Publish Date:Aug 26, 2022
పోటీలు అనగానే క్రీడారంగంలో పోటీలు, రాజకీయరంగంలో పోటీపడటాలు గురించే అందరికీ తెలు స్తుంది. కానీ చిత్రంగా అస్సలు ఎవ్వరూ ఊహంచని సరికొత్త పోటీ ఒకటి ఈమధ్య నిర్వహించారు. అపానవాయు పోటీ! ఆమధ్య ఏదో సినిమాలో ముగ్గురు కమెడియన్లు యూ.ఎస్‌లో ఒక నగరం వీధిలో నిలబడి అపానవాయు వదలుతారు, దాని ధాటికి చాలామంది పారిపోతారు!
ఇదో సినిమాలో కామెడీ సీన్ ! అది ప్రేక్షకులకు సరదా కోసం సినిమావారు కల్పించిన ఒక సీన్. తలచు కుంటే నవ్వొస్తుంది. కానీ అలా నిజంగానే అవుతుందా అంటే ! ఏమో అనే సందేహాస్పద సమాధానాలూ వినవలసివస్తుంది. మావూళ్లో ఒక పెళ్లి భోజనం చేసిన ఓ పెద్దాయన... అంటూ ఎవరికి తోచిన విధంగా వారు ఏదో ఒక విచిత్ర వివరణలతో ఇలాంటి సంఘటనలు గుర్తుచేసుకున్నా పెద్దగా ఆశ్చర్య పోనక్క ర్లేదు.
ఇలాంటి పోటీ ఏమిటన్నదే ఇపుడు అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నది. ఇది ఎక్కడో విదేశాల్లో కాదు.. చక్కగా మన దేశంలోనే నిర్వహించారు. ఈపోటీలో పాల్గొనడానికి ఏకంగా ముంబై, జైపూర్, దుబాయ్ వంటి నగ రాల నుంచి కూడా పేర్లు నమోదయ్యాయి!
ఒక పెద్ద గది.. ఎంతో చక్కటి సుగంధద్రవ్యాలతో సువాసనలతో ఆకట్టుకుంటుంది. ఎంతో శుభ్రంగా అలంకరించి ఉంటుంది. ఆ గదిలోకి ఒక వ్యక్తిని పంపిస్తారు. అతను అపానవాయు వదులుతాడు.. అది ఎంతగా దారుణంగా వాతావరణాన్ని కంపుమయం చేస్తుందో అంచనా వేస్తారుట! ఎలా చేస్తారన్నది వదిలేద్దాం. అలా చేసిన తర్వాత. మరో వ్యక్తిని మరో గదిలోకి పంపుతారు. ఇలా ఉన్న రెండు గదుల్లోకి లెక్ ప్రకారం, సమయాన్ననుసరించి శుభ్రత జాగ్రత్తలు తీసుకుంటూ మరీ పంపుతారట! ఫైనల్‌గా ఎవరు ఎంతగా ఇబ్బందిపెడితే వారే విజేత! పరామర్ అనే మహిళ ఈ పోటీలకి జడ్జి. ఊహంచని ఈ పోటీలకు తనను జడ్జిగా నియమించడం గురించి చెబుతూ నవ్వు ఆపుకోలేకపోయిందామె.
ఇదే కాంపిటీషనండీ! అని చిరాకుపడొచ్చు. అనేకానేక వెర్రి ఆటలు, కాంపిటీషన్లలో ఇదోటి! విదేశాల్లో గిన్నిస్బుక్ రికార్డుల కోసం చిన్న చిన్న విషయాల్లోనూ పెద్ద పెద్ధ పోటీలు జరుగుతుంటాయిట. తినడం, రన్నింగ్, బస్కీలు తీయడం.. ఇలాంటివి. మరి మనవాళ్లు కనుగొన్న ఈ పోటీ కూడా ఆ స్థాయికి అను మతి లభిస్తుందేమో చూడాలి! చిత్రంగా ఉంది గదా. ఈమధ్యనే సూరత్‌లో ఈ పోటీ జరిగితే పెద్ద సంఖ్య లో ఎవ్వరూ పాల్గొనలేదు. కానీ విన్నవారు పడి పడి నవ్వుకుంటూనే ఉన్నారు! ఇలాంటి పోటీలూ ఉంటా యా అని! ఇదే కాదు త్రేణుపుల పోటీ కూడా ఉంటుంది. అయితే దీనికి మాత్రం మరింత కష్టపడాల్సి వస్తుం ది. త్రేణుపులు అంత సులభంగా రావు కదా!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/variety-competition-39-142670.html
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది