చంద్రబాబుకున్న మనోబలం.. వంశీకి లేదా?

Publish Date:Mar 27, 2025

Advertisement

జైల్లో గడపవలసి రావడమే ఇబ్బందికరమైన పరిస్థితి. అలాంటిది సింగిల్ బ్యారక్ లో ఒంటరి గా ఉండాలంటే చాలా కష్టం. సాధారణంగా జైలు శిక్ష  అనుభవిస్తూ అక్కడ కూడా కొత్త తప్పులు చేసిన వారిని, తీవ్రమైన నేరాలు చేసినవారిని ఇటువంటి సాలిటరీ సెల్ లలో ఉంచుతారు. అలాగే సెలబ్రిటీలు ఇతరులతో కలిపి ఉంచడం వలన వారికి ప్రమాదం ఉంటుందనే అనుమానం ఉంటే..  వాళ్ళను కూడా ఒక సెల్ లో ఒంటరిగా ఉంచుతారు. ప్రస్తుతం దళిత యువకుడు సత్యావర్ధన్ ను కిడ్నాప్ చేసిన కేసులో రిమాండ్ లో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఈ విధంగా సింగిల్ బ్యారెక్ లో ఒంటరిగా ఉంటున్నారు. సెల్ లో ఒక్కడినే ఉండలేకపోతున్నాను.. తనకు తోడుగా మరొక ఖైదీని ఉంచాలని  ఆయన కోర్టును పదేపదే వేడుకుంటున్నారు. అయితే మాజీ ఎమ్మెల్యేగా, వైసీపీకి నాయకుడిగా ప్రముఖ వ్యక్తి కావడం వలన ఆయన భద్రతా కారణాల దృష్ట్యా మరొక ఖైదీని అక్కడ ఉంచలేం అని జైలు అధికారులు చెప్పడంతో కోర్టు కూడా అనుమతించడం లేదు. రిమాండు పొడిగింపు కోసం న్యాయమూర్తి ఎదుటకు వచ్చిన ప్రతి సందర్భంలోనూ జైల్లో తనకు తోడు కావాలని వంశీ అడగడం,  ఆ కోరిక నెరవేరకపోవడం జరుగుతూనే ఉంది. 

ఇదంతా నేపథ్యం అనుకుంటే.. ఇప్పుడు అసలు సంగతి ప్రస్తావించుకోవాలి! ముందే చెప్పుకున్నట్టు ఒక సెల్ లో ఒంటరిగా ఉండడం అనేది నిజంగానే కష్టం! అయితే అలా ఉండడానికి ఎంతో దృఢమైన మానసిక బలం ఉండాలి. ఒక టర్మ్ రిమాండ్ పూర్తి అయిన నాటి నుంచి తనకు తోడు కావాలని గోల ప్రారంభించిన  వంశీ ఇలాంటి మానసిక బలం విషయంలో చాలా వీక్ గా ఉన్నారని అనుకోవాల్సి వస్తోంది.

గతంలో జగన్ పాలనలో చంద్రబాబునాయుడడిని అరాచకంగా అరెస్టు చేసి.. చాలా దుర్మార్గమైన రీతిలో రోడ్డు మార్గంలో  తరలించి మొత్తానికి ఆయనను 53 రోజుల పాటు సెంట్రల్ జైలులో నిర్బంధించారు. తనను అరెస్టు చేసిన ప్రభుత్వ అరాచకత్వాన్ని చంద్రబాబునాయుడు ప్రశ్నించారే తప్ప.. జైలులో తనకు తోడు కావాలని మొర పెట్టుకోలేదు. వయసు రీత్యా డెబ్భయ్యేళ్లు దాటిన చంద్రబాబునాయుడుకు కొన్ని ప్రత్యేక సదుపాయాలను మాత్రం కోర్టు కల్పించింది. ఆ విషయానికి వస్తే.. వల్లభనేని వంశీ విన్నవించుకున్న తర్వాత.. ఆయనకు కూడా ప్రత్యేక సదుపాయాలు కల్పించారు. ఇనుప మంచం ఇబ్బందికరంగా ఉందని అంటే.. పరుపు, దిండు కూడా ఏర్పాటు చేశారు. వాటి గురించి న్యాయమూర్తి ప్రత్యేకంగా ప్రశ్నించినప్పుడు.. అవన్నీ సౌకర్యంగానే ఉన్నాయని ఒప్పుకున్న వల్లభనేని వంశీ జైలు బ్యారెక్ లో తనకు ఒక తోడు కావాలని ఆరాటపడడమే ఆయన మానసిక దౌర్బల్యానికి నిదర్శనం. ఆ మాటకొస్తే 2014కు పూర్వం జగన్ జైలులో ఉన్నప్పుడు కూడా ఆయన బ్యారెక్ లో మరొకరు తోడు ఉన్నారు. 

కానీ.. చంద్రబాబునాయుడు ఏకంగా 53 రోజులు జైల్లో ఉన్నప్పటికీ.. తోడు అడగలేదనే సంగతిని గమనించాలి. ఆయన మానసిక దారుఢ్యాన్ని ప్రత్యేకంగా ప్రశంసించాలి. నిజానికి చంద్రబాబు వయస్సు ఎక్కువ అయినప్పటికీ.. శారీరకంగా   చాలా ఫిట్ గా ఉంటారు. ఆయన వయసు గురించి జగన్ హేళన చేసినప్పుడు.. ఇద్దరం కలిసి నడుద్దాం.. ఎవరు ఎక్కువ దూరం నడవగలరో కూడా చూద్దాం అంటూ చంద్రబాబు సవాలు చేశారు కూడా. చంద్రబాబుకు ఉండే మానసిక బలం.. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు వాటిని తనకు అనుకూలంగా మలచుకోవడం, నిబ్బరంగా ఉండడం, ధైర్యాన్ని కోల్పోకుండా బుద్ధికి పదును పెట్టుకోవడం వంటి విషయాలను చంద్రబాబును చూసి వంశీ లాంటి నాయకులంతా నేర్చుకోవాలని ప్రజలు అంటున్నారు.

By
en-us Political News

  
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.