మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ క్షమాపణకు మంత్రి వంగలపూడి అనిత డిమాండ్

Publish Date:Jun 17, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో   తీవ్ర దుమారం రేగింది. ఏపీ హోంమంత్రి  వంగలపూడి అనితను ఉద్దేశించి వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి.  రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా.. ఒక మహిళా మంత్రి వ్యక్తిత్వాన్ని, కట్టుబొట్టును టార్గెట్ చేస్తూ చేసిన గుడివాడ అమర్నాథ్  చేసిన ఈ వ్యాఖ్యలపై కూటమి నేతలతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళా సంఘాలు,  తెలుగు మహిళా విభాగాలు తీవ్రస్థాయిలో మండి పడుతున్నాయి. మాజీ మంత్రి క్షమాపణను డిమాండ్ చేస్తూ ఆందోళనలకు దిగుతున్నాయి. 

ఈ వివాదంపై హోంమంత్రి వంగలపూడి అనిత  మాట్లాడుతూ,   రాజకీయ ముసుగు వేసుకుని మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచే వికృత ధోరణిని తాము  సహించబోమని స్పష్టం చేశారు.  ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేసే ముందు, తమ ఇళ్లలో కూడా మహిళలు, తల్లులు, చెల్లెళ్లు ఉన్నారనే కనీస విషయాన్ని గుర్తుంచుకుంటే మంచిదని హితవు పలికారు. సమాజంలో మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తించే వారిపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు   గుడివాడ అమర్‌నాథ్  బహిరంగ క్షమాపణ చెప్పాలని  డిమాండ్ చేశారు.

ఈ రాజకీయ వ్యవహారంపై జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా  తీవ్రంగా స్పందించారు. ఇవి కేవలం ఒక హోంమంత్రిని ఉద్దేశించి అన్న  మాటలు కావని, యావత్ మహిళా జాతిని, వారి ఆత్మగౌరవాన్ని ఘోరంగా అవమానించడమేనని మండిపడ్డారు. రాజకీయాల్లో విమర్శలు ప్రతివిమర్శలు సహజమే అయినప్పటికీ..  మహిళల పట్ల ఇలాంటి అసభ్యకర ధోరణిని ప్రదర్శించడం వైకాపా నేతల కుసంస్కారానికి నిదర్శనమని విమర్శించారు.

మరోవైపు  మంత్రి నారా లోకేష్ సైతం గుడివాడ అమర్నాథ్ పై  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక దళిత మహిళ సమాజంలో ఎదిగి, రాష్ట్రంలో అత్యున్నతమైన హోంమంత్రి పదవిని అధిరోహిస్తే..  ఓర్వలేకనే వైసీపీ నేతలు ఇలాంటి నీచమైన విమర్శలకు దిగుతున్నారని ఆరోపించారు. ఒక మహిళా నాయకురాలి కట్టును, బొట్టును టార్గెట్ చేస్తూ మాట్లాడటం  వైసీపీ చేస్తున్న విషపూరిత, వికృత రాజకీయాలకు పరాకాష్ట అని మండిపడ్డారు.  

By
en-us Political News

  
గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంలో తీవ్ర రూపం దాల్చుతున్న తాగునీటి ఎద్దడి విద్యాసంస్థలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. సోషల్ మీడియాలో సవాళ్లు విసరడం మానేసి, EVMలు మరియు SIR అంశాలపై పార్లమెంట్‌లో చర్చకు రావాలని ఆమె డిమాండ్ చేశారు.
 2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్   ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో  పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది. 
ఆంధ్రప్రదేశ్ పురపాలక ఎన్నికల ఫలితాల్లో కడప జిల్లాలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి
విశాఖపట్నం మేయర్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన సత్తా చాటింది.
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మద్యం రవాణా కాంట్రాక్టుల కుంభకోణం కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి వెంకట నాగేశ్వరరావుకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
20 వార్డుల్లో 17 స్థానాలు గెలుపు.!
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాతావరణ మార్పుల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో పెను తుపాను ముప్పును ఎదుర్కొంటోంది.
​కడప పులివెందుల మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్ ఎన్నికల కౌంటింగ్‌లో తెలుగుదేశం పార్టీ విజయపథంలో దూసుకుపోతోంది
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.