పుస్తకాల చదువు కన్నా జీవితంలో విలువలు ముఖ్యం

Publish Date:May 4, 2025

Advertisement

చదువేరా అన్నిటికీ మూలం.. ఆ చదువు విలువ తెలుసుకొనుటే ధర్మం. ఇది అక్షర సత్యం. అయితే చదువుకోవడం అంటే మార్కులూ, ర్యాంకులూ కాదు. విలువలు, వివేకం. కేవలం పుస్తకాల పురుగులా బట్టీయం పడితే సరిపోదు. అలా బట్టీయం పట్టి ర్యాంకులు సాధించినా మనిషిగా విలువలకు దూరమైతే ప్రయోజనం లేదు. అటువంటి విలువలు లేని విద్యావంతులను చూసే చదవేస్తే ఉన్నమతి పోయింది, చదువుకు ముందు కాకరకాయ, చదివాకా కీకరకాయ వంటి సమేతలు పుట్టాయి. ఈ విషయాన్ని తెలుసుకోకుండా విద్యార్థులూ, వారి తల్లిదండ్రులూ కూడా మార్కులూ, ర్యాంకుల వెంట పడుతున్నారు. వ్యక్తిత్వ వికాసం కంటే.. పరీక్షల్లో వచ్చిన పర్సంటేజీ ఎంత, అధిక ప్యాకేజీతో కొలువులు సంపాదించడం ఎలా అన్నదానిపైనే దృష్టి పెడుతున్నారు. ఆ క్రమంలో తల్లిదండ్రులు విద్యార్థులపై ఒత్తిడి పెంచేస్తున్నారు. మంచి ర్యాంకు రాకపోతే ఎందుకూ పనికి రామన్న న్యూన్యతా భావం పిల్లలలో పెంచేలా వ్యవహరిస్తున్నారు. ఆ కారణంగానే పరిక్షా ఫలితాలు వచ్చిన తరువాత విద్యార్థుల ఆత్మహత్యల వార్తలను ఎక్కువగా వినాల్సిన పరిస్థితి ఏర్పడింది. చదువు అంటే కేవలం ఉత్తీర్ణత మాత్రమే కాదనీ, ఒక వైఫల్యం భవిష్యత్ విజయానికి మొదటి మెట్టన్న సంగతి మరిచిపోతున్నారు. మార్కులు తక్కువ వచ్చినా, ఒక వేళ పరీక్షలో ఫెయిలైనా జీవితం ముగిసినట్లు కాదన్న విషయాన్ని విస్మరిస్తున్నారు. 

ఏపీజే అబ్దుల్ కలాం చదువులో సాధారణ విద్యార్థే.. అయినా శాస్త్రవేత్త అయ్యారు. రాష్ట్రపతిగా గౌరవాన్ని అందుకున్నారు. భారత రత్న పురస్కారం తీసుకున్నారు. అలాగే క్రికెట్ గాడ్ గా అశేష అభిమానులను సంపాదించుకున్న   సచిన్ టెండూల్కర్ విద్యార్థిగా టెన్త్ ఫెయిలయ్యారు. అటువంటి వారు ఇంకెందరో ఉన్నారు. చదువు అంటే మార్కులూ, ర్యాంకులే కాదనీ, తమకు నచ్చిన, తమకు నైపుణ్యం ఉన్న రంగాలలో సాధన చేసి ఉన్నత స్థాయిని అందుకోవచ్చనీ చాటిన ఎందరో ఉన్నారు. అటువంటి వారిని ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు ముందుకు సాగాల్సి ఉంటుంది. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు చదువు అనేది విజ్ణానసముపార్జనకు సాధనమే కానీ, చదువంటే ర్యాంకులూ, మార్కులు, కొలువులేకాదని చెప్పాలి. చదువులో వెనుకబడిన పిల్లలలో ఆత్మస్థైర్యం పెంచి.. భవిష్యత్ లో మరింత కష్టపడి పైకి వచ్చే విధంగా ప్రోత్సహించాలి. 

సరిగ్గా అలాంటి పనే చేశారు ఆ తల్లిదండ్రులు.. అసలేం జరిగిందంటే.. కర్నాటకకు చెందిన అభిషేక్ ఇటీవల జరిగిన టెన్త్ పరీక్షలు రాశాడు. అయితే అన్ని సబ్జెక్టుల్లోనూ ఫెయిలయ్యాడు. తోటి విద్యార్థల అవహేళలనతో కృంగిపోయాడు. ఇది గమనించిన అతడి తల్లిదండ్రులు.. అతడికి ధైర్యం చెప్పారు. ఈ సారి బాగా చదివి ప్యాసవ్వాలని బోధించారు. అంతే కాకుండా భవిష్యత్ విజయానికి ఈ ఫెయిల్యూల్ స్టెప్పింగ్ స్టోన్ గా భావించాలని చెబుతూ.. తమ కుమారుడి భవిష్యత్ విజయాన్ని కాంక్షిస్తూ కేట్ కట్ చేసి వేడుక చేశారు. ఈ వేడుకకు అభిషేక్ ను గేలి చేసిన తోటి విద్యార్థులనూ ఆహ్వానించారు. మొత్తంగా తమ కుమారుడిలో ఆత్మ స్థైర్యాన్ని ప్రోది చేయడమే కాకుండా, ఇతరులకూ ఆదర్శంగా నిలిచారు. 

By
en-us Political News

  
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్‌ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్‌ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.