వెల్తారా, వెళ్లరా: షర్మిల కుమార్తె వివాహానికి జగన్ హాజరుపై చర్చ.!

Publish Date:Nov 6, 2026

Advertisement

తెలుగు రాష్ట్రాలలో వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబ వివాదాలు, ఆస్తి తగాదాలు, రాజకీయ పంచాయతీలు మరోసారి తెరమీదకు వచ్చాయి. పెద్ద ఎత్తన చర్చకు తెరలేపాయి.   వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం, పులివెందుల ఎమ్మెల్యే   జగన్మోహన్ రెడ్డి, ఆయన సోదరి ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుటుంబాల మధ్య నెలకొన్న విభేదాలు, వివాదాలు మళ్లీ హాట్ టాపిక్ గా మారాయి.  వైఎస్ షర్మిల కుమార్తె వివాహ వేడుకకు సంబంధించి చోటుచేసుకున్న పరిణామాలు,  అసలు మేనకోడలి వివాహ వేడుకకు జగన్ హాజరౌతారా అన్న సందేహాలు బలంగా వ్యక్తమౌతున్నాయి.  

ఇటీవల కాలంలో వైఎస్ కుటుంబంలో   ఆస్తి తగాదాలకు సంబంధించిన వార్తలు మీడియాలో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. ముఖ్యంగా బెంగళూరులోని ఎలహంక ప్యాలెస్‌లో వైఎస్ షర్మిల కుమార్తె అంజలి రెడ్డి వివాహం నిర్వహించడానికి వైఎస్ షర్మిల జగన్  అనుమతి కోరారు.  అయితే భద్రతా కారణాలు ప్రస్తావిస్తూ ఆ ప్రాంగణాన్ని వివాహ వేడుకకు ఉపయోగించేందుకు వైఎస్ జగన్ అంగీకరించలేదు. ఈ విషయంలో మరోసారి అన్నా చెళ్లెళ్ల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి.  

కుటుంబ భవనంలో వివాహం జరగకపోవడంతో, వివాహ వేదికను వేరే ప్రాంతానికి మారుస్తున్నట్లు వైఎస్ షర్మిల స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అదే సమయంలో అసలు ఎలహంక తన ఆస్తి అని కూడా విస్పష్టంగా ప్రకటించారు. అయితే కుమార్తె వివాహం నేపథ్యంలో తగాదాలు, అనవసర వివాదాలు ఎందుకని భావించి వేదికను మార్పు చేసినట్లు ఆమె ఆ సందర్భంగా చెప్పారు.  ఈ నేపథ్యంలో నవంబర్ 25న జరగనున్న ఈ వివాహ వేడుకకు కుటుంబ సభ్యులందరూ హాజరవుతారా లేదా అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

గతంలో వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహ వేడుకకు వైఎస్ జగన్ తన సతీమణితో కలిసి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆ కుటుంబ వేడుక రాజకీయ వర్గాల్లో  ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఆ తర్వాత కాలంలో రాజకీయ పరిణామాలు, ఆస్తుల పంపిణీ వివాదాలు మరింత ముదిరాయి.  

ఇది కూడా చదవండి: యలహంక ప్యాలెస్ నా ఆస్తి: షర్మిల సంచలన ప్రకటన.!

తాజాగా ఇప్పుడు  కుమార్తె వివాహం సందర్భంగా చోటుచేసుకున్న వేదిక మార్పు వివాదం నేపథ్యంలో..  ఈ వేడుకకు   జగన్మోహన్ రెడ్డి హాజరవుతారా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమౌతున్నాయి.  సొంత చెల్లెలు కుమార్తె వివాహ వేడుకకు మేనమామ హోదాలో జగన్   హాజరై ఆశీర్వదిస్తారా లేక ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటారా అన్న చర్చ జోరుగా సాగుతోంది. 

ఈ నేపథ్యంలోనే తాజాగా జగన్ మోహన్ రెడ్డి వైఎస్ అనీల్ రెడ్డి ఇంటో వివాహ వేడకకు హాజరయ్యారు. ఏపీలో మునిసిపల్, పరిషత్ ఎన్నికల కారణంగా జగన్ పొలిటికల్ గా చాలా చాలా బీజీ అయినప్పటికీ, వెసులుబాటు చేసుకుని చెన్నై వెళ్లి మరీ ఆ వివాహానికి హాజరయ్యారు. మరి ఇప్పుడు సొంత చెల్లెలి కుమార్తె వివాహానికి హాజరౌతారా? లేక చెల్లెలితో ఉన్న విభేదాల కారణంగా ముఖం చాటేస్తారా అన్నది ఆసక్తిగా మారింది.  

మీకు నచ్చవచ్చు:  యలహంక భూమి షర్మిలదే: కుండబద్దలు కొట్టిన విజయమ్మ: జగన్ కు షాక్.!

ఎలహంక ప్యాలెస్ లో షర్మిల కుమార్తె పెళ్లి: పేర్ని నానికెందుకు నొప్పి.?

[Will   Jagan Attend YS Sharmila Daughter Wedding, Yelahanka Palace Controversy, YSR family Disputes, Anjili Reddy wedding, Telugu One]

By
en-us Political News

  
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్‌ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్‌ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
Telangana government pays special attention to the renovation of barrages, Revanth Reddy, Kaleshwaram Project, Medigadda Barrage, Annaram Barrage, Sundilla Barrage, Kaleshwaram Barrage Repairs, Barrage Restoration, Dam Safety, NDSA, Irrigation Projects, Devadula Lift Irrigation, Sitarama Lift Irrigation
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మూల్యాంకన కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) చేపట్టిన సోదాలు ముగిశాయి.
తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్య పరిరక్షణ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల లబ్దిదారుల ఎంపిక విధానంలో అత్యంత కీలకమైన మార్పులకు తెరలేపుతున్నట్లు తెలుస్తోంది.
Mahabubnagar ACB Raid, Telangana ACB, ACB Trap, Bribery Case, Rs 1 Lakh Bribe, Government Officials Arrested, Mahabubnagar Corruption, Youth and Sports Department, Jakkula Rajasekhar Reddy, Gorre Umesh, Telangana Anti Corruption Bureau, ACB Helpline 1064, Telangana Crime News
చలికాలం రాగానే మనలో చాలామంది ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు
అనంతపురం జిల్లాలో జరుగుతున్న పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.