మనిషి విలువ
Publish Date:Oct 16, 2018
Advertisement
తెలుసుకోవాలని ఉంది ప్రేమకా, ప్రాణానికా, మనిషికా, మనసుకా, డబ్బుకా, బలానికా, దేనికి విలువ..? ప్రపంచంలో అన్నీ మనకే కావాలనిపిస్తుంది. అన్నీ ఉన్నాక కొన్నే లేవు అన్నీ తప్ప అనిపిస్తుంది. ఇదే జీవితం! నిండా మునగాలనుంది- అలా మునిగిపోతూ పక్కన ఒడ్డున నిలబడి చూడాలనీ ఉంది.. సాధ్యంకాదు..! పోగొట్టుకుంటే రాబట్టుకోలేం... అదీ తెలుసు..! ఆశ- వెధవ మానవ జీవితం కదండీ అలానే అనిపిస్తుంది మరి. కట్టప్ప చంపింది కేవలం బాహుబలి పాత్రని మాత్రమే అని తెలుసు..? అయినా చిత్రాన్ని చూస్తుంటే దు.ఖం ఆగలేదండి ఈ చిన్ని ప్రాణానికి అలాంటిది మన ప్రాణమే పోయాక లోకంతో మనకింక పనేంటీ అంటారా..! ఉందండీ.. * ఒక్కసారి నువ్వంటే ప్రాణం, నువ్వు లేకపోతే నేను లేను బంగారం అనే భర్త మాటల విలువ ప్రేమదా..? అదే భర్త.. భార్య జీతం డబ్బులు ఓ నెల తక్కువ తెస్తే నీతో యిలా అయితే కష్టం అన్నాడంటే ఆ మాటల విలువ దేనిది..? * నా పిల్లలే నా ప్రాణాలు అంటాం..! వాళ్లకోసమే ఈ ప్రాణాలు అంటుంటాం.. ఖరీదైన ఫోన్లు, కార్లు కొని చేతిలో పెట్టి love you కన్నా అన్నారంటే ఆ మాటల విలువ బంధానిదా..? అదే నాన్న... పిల్లల చేతిలో జారిపోయిన ఖరీదైన ఫోన్ కోసం చావదెబ్బలు కొడితే ఆ విలువ దేనికంటారు..? * గోరు ముద్దలు తింటూ, లాలి పాటలు వింటూ చిట్టి కథలు వింటూ పెంచి పెద్ద చేసిన అమ్మ నాది మాత్రమే అనే ఆ మాట విలువ బంధానిదా..? అదే అమ్మ వయసు పైబడ్డాక అనారోగ్యం బారిన పడ్డాక కొడుకులు అమ్మ నీదంటే నీది అని అంటే ఆ విలువ దేనికంటారు..? * మనం నవ్వితే నవ్వుతాడు.. ఏడుస్తుంటే ఓదారుస్తూ, గెలిస్తే భుజం తట్టి ప్రోత్సహించి ఓటమిలో ధైర్యాన్ని పంచే స్నేహితుల విలువ మనిషికా.. మనసుకా..? ఇలా అలోచిస్తే ప్రతీ బంధం విలువా తెలుసుకోవాలనే అనిపిస్తుంది. మనకి మన వాళ్లు ఇచ్చే విలువేంటో తెలుసుకోవాలనిపిస్తుంది. ఒక్కసారి చచ్చి మళ్ళీ బతకాలనిపిస్తుంది. నేనేంటో, నా విలువేంటో తెలుసుకోవాలనిపిస్తుంది. చేసిన తప్పులేంటో, బాధ పెట్టిన క్షణాలెన్నో, క్షమించాల్సిన మనసులెన్నో అన్నీ చూడాలని, వినాలని ఉంది. సాధ్యం కాదు అని తెలిసినా.. ఆ ఊహ వినడానికి బాగుంది..! * డాలర్ రేటు రాదు పడితే లేపడానికి మనిషి విలువ ఒక సినిమా లాంటిది మనిషి విలువ. మున్నాళ్ల జీవితం మూడు గంటల సినిమాలో ఒక పాత్రలాగా పాత్రని పోషించి, నవ్వించి, కవ్వించి, ఏడిపించి, అలరించి వెళ్లిపోతుంది. అందుకే సాటి మనిషిని ప్రేమిద్దాం.. ప్రేమను పంచుదాం..
ఒక్కసారి ఒకే ఒక్కసారి విలువ దేనికి అనేది తెలుసుకోవాలని ఉంది.
* సినిమా రివ్యూ కాదు రేటింగ్ యివ్వడానికి మనిషి విలువ
* facebook posting కాదు like, comments ఇచ్చేందుకు మనిషి విలువ
* Real estate, gold rate, IT boom కాదు మనిషి విలువ
http://www.teluguone.com/news/content/value-of-human-35-74908.html





