Publish Date:Mar 28, 2025
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి శుక్రవారం ఎస్సీ ఎస్టీ కోర్టులో షాక్ తగిలింది. టిడిపి కార్యాలయంపై దాడి కేసులో నిన్న సిఐడి కోర్టు వంశీకి బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తే కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్దన్ కిడ్నాప్ కేసులో ఎస్సీ ఎస్టీ కోర్టు ఇవ్వాళ వంశీకి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. బాధితుడు సత్యవర్దన్ తరపు న్యాయవాది వంశీకి బెయిల్ ఇస్తే సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉందని వాదించారు. నిందితుడు నుంచి మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉందని కోర్టుకు తెలిపారు. వంశీకి బెయిల్ ఇస్తే సత్యవర్దన్ ప్రాణాలకు హాని ఉందని పేర్కొన్నారు. రిమాండ్ లో ఉన్న తన క్లయింట్ కు బెయిల్ ఇవ్వాలని వంశీ న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు వంశీకి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. వరుసగా రెండ్రోజులు రెండు ప్రత్యేక కోర్టులు వంశీకి బెయిల్ ఇవ్వకపోవడంతో చర్చనీయాంశమైంది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఎపి పోలీసులు వంశీని హైద్రాబాద్ లో అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. ఈ కేసు నడుస్తుండగానే సిఐడి పోలీసులు గన్నవరం టిడిపి కార్యాలయంపై దాడి కేసులో నిందితుడైన వంశీని అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/vallabhaneni-vamsi-gets-a-series-of-shocks-bail-petition-dismissed-25-195184.html
భారతీయ రాజకీయ రంగంలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
దసరా పండుగ సెలవులు ప్రారంభం కావడంతో భాగ్యనగరంలో ప్రయాణికుల రద్దీ తారాస్థాయికి చేరింది.
దేశ రాజధాని న్యూఢిల్లీలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రముఖ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం లైంగిక వేధింపుల ఉదంతంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి హసిరాణి రథ్ భారీ విజయం సాధించారు.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏవియేషన్ రంగానికి సంబంధించి అత్యంత కీలకమైన చారిత్రాత్మక పరిణామం చోటుచేసుకుంది.
ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి ప్రకటన అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గాదె సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కీలక ఛార్జిషీట్‌ను కోర్టుకు సమర్పించింది.
ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే అత్యున్నత పురస్కారాలలో ఒకటైన 2026 సంవత్సరపు నోబెల్ శాంతి బహుమతిని భారత సంతతికి చెందిన ప్రముఖ న్యాయకోవిదురాలు నవనీతం నవి పిళ్లై గెలుచుకున్నారు.
అర్ధరాత్రి వేళ రోడ్లపై పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ నగరవాసులకు విజ్ఞప్తి చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు.
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.