రెంటికీ చెడ్డ రేవడి వల్లభనేని వంశీమోహన్

Publish Date:May 12, 2022

Advertisement

 గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది. గత ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్‌పై వంశీ గెలిచినా.. జగన్ పార్టీ అధికారంలోకి రావడంతో.. ఆ పార్టీలోకి వెళ్లితే.. తనకు అందలం దక్కుతుందని ఆయన భావించారు. కానీ అనుకున్నది ఒకటి అయింది మరొకటి. దీంతో తన సీన్ ఇంతలా సితారవుతుందని అనుకోలేదని వల్లభనేని వంశీ మధనపడుతున్నారట.

బుధవారం నుంచీ రాష్ట్ర వ్యాప్తంగా   గడప గడపకు వైసీపీ   కార్యక్రమానికి ఆ పార్టీ నేతలు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.  అయితే ఇది మా పార్టీ ఫ్యామిలీ పండగ.. మేం  మాత్రమే చేసుకుంటామంటూ   ఫ్యాన్ పార్టీ నేతలు దీర్ఘాలు తీస్తూ కండీషన్లు పెట్టి ఈ కార్యక్రమానికి వల్లభనేని వంశీని దూరం పెట్టేశారుట. దీంతో టీడీపీలో గెలిచి.. ఫ్యాన్ పార్టీలోకి జంప్ కొట్టిన వల్లభనేని వంశీకి ఆయన వర్గానికి అనుకోని విధంగా ఎదురు దెబ్బ తగిలినట్లైంది. అంతే కాకుండా    నియోజకవర్గంలో వల్లభనేని వంశీ వ్యతిరేకులు అంటే డాక్టర్ దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావ్ తదితరులు ఏక తాటిపైకి వచ్చి.. గడపగడపకూ కార్యక్రమం అంతా తామే అన్నట్లు వ్యవహరిస్తూ.. నియోజకవర్గమంతటా  భారీగా ఫ్లెక్సీలు  ఏర్పాటు చేశారు. దీంతో  చేసేదేమీ లేక వల్లభనేని వంశీ, ఆయన వర్గం నోటిపై వేలేసుకుని మరీ సైలెంట్ అయిపోయారట.  

2014 ఎన్నికల తర్వాత చంద్రబాబు అధికారంలో రావడంతో...  ప్రతిపక్షంలోని వైయస్ జగన్ పార్టీ నుంచి వెళ్లిన ఎమ్మెల్యేలకు .. నిధులు ఇచ్చి.. తననూ ప్రోత్సహిస్తారని వల్లభనేని వంశ ఆశించారట.    ఆ క్రమంలో తన  స్నేహితుడు, మాజీ మంత్రి కొడాలి నానితో కలిసి.. టీడీపీకి వ్యతిరేకంగా గట్టిగానే గళమెత్తారు. ఆ క్రమంలో చంద్రబాబుతోపాటు ఆయన భార్య నారా భువనేశ్వరిపై వల్లభనేని వంశీ అనుచిత వ్యాఖ్యలు చేసి.. తానేమి కొడాలి నాని కంటే తక్కువ కాదనట్లు నిరూపించుకొన్నారు. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలన్నీ   తెలిసినవే. 

ఈ నేపథ్యంలో టీడీపీకి తనకు తానుగా దూరమైన వల్లభనేని వంశీని.. ఫ్యాన్ పార్టీ నేతలు మాత్రం కావాలని  దూరంగా పెట్టారట. ఆ క్రమంలోనే ఫ్యాన్ పార్టీలోని వంశీ వ్యతిరేక వర్గం.. ఏకంగా పార్టీలో కీలక నేత విజయసాయిరెడ్డికి కొండవీటి చాంతాడంత లేఖ రాసి మరీ వంశీకి గన్నవరం నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తే.. ఫ్యాన్ పార్టీ గెలుపు కష్టమవుతోందని వంశీకి కాకుండా ఎవరికి  అవకాశం ఇచ్చినా   తామంతా కష్టపడి మరీ పార్టీని గెలుపించుకొనేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని స్పష్టం చేశారట. వల్లభనేని వంశి పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా మారడానికి కారణమేమిటన్నదానికి 
మరోవైపు వల్లభనేని వంశీని అటు టీడీపీ వాళ్లు.. ఇటు వైసీపీ వాళ్లు ఎందుకిలా పగ పట్టారంటే మాత్రం.. గన్నవరం నియోజకవర్గంలో ఓ టాక్  జోరుగా వైరల్ అవుతోంది. 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఆ క్రమంలో గన్నవరం నుంచి గెలిచిన వల్లభనేని వంశీ చాలా దూకుడుగా వ్యవహరించారట.  ఎలా అంటే నాటి ప్రతిపక్షంలో ఉన్న వైయస్ఆర్సీపీ శ్రేణులపై కేసులు పెట్టించారట. అలాగే వారి ఆర్థిక మూలాలను సైతం ఆయన తీవ్రంగా దెబ్బ కొట్టారట. ఈ నేపథ్యంలో ప్రస్తుత అధికార పార్టీలోని ద్వితీయ శ్రేణి నేతలకు సైతం ఈ వల్లభనేని వంశీపై కన్నెర్రగా ఉందన్నదే ఆ టాక్.   అదీకాక రానున్న ఎన్నికల్లో గన్నవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా మళ్లీ యార్లగడ్డ వెంకట్రావ్ బరిలోకి దిగాలని భావిస్తుండగా.. మరో వైపు వైఎస్ ఫ్యామిలీకి అత్యంత ఆప్తుడు దుట్టా రామచంద్రరావు   అల్లుడిని రంగంలోకి దింపేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో వీరిద్దరు వ్యూహాత్మకంగా  అడుగులు వేస్తున్నారట. దుట్టా రామచంద్రరావు అల్లుడు వైయస్ జగన్ భార్యకు సమీప బంధువు అని తెలుస్తోంది.ఆ క్రమంలో ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. అయితే వల్లభనేని వంశీకి మాత్రం టికెట్ రాకూడదనే విధంగా కూడా వీరు వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం

మరోవైపు.. వచ్చే ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి తమ పార్టీ తరఫున బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపాలని ఇప్పటికే చంద్రబాబు స్కెచ్ వేశారు. ఎందుకంటే.. ఫ్యాన్ పార్టీ అధినేత జగన్ ఓ వేళ.. ఎవరినీ కాదని.. వల్లభనేని వంశీకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా.. అతడి ఓడించాలనే ఓ విధమైన దృఢ సంకల్పంతో సైకిల్ పార్టీ అధినేత ఉన్నట్లు తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. 

వల్లభనేని వంశీ.. పార్టీ మారి తప్ప చేశారని.. ఓ వేళ పార్టీ మారినా ఆయన చంద్రబాబు ఫ్యామిలీ గురించి అలా మాట్లాడకుండా ఉండాల్సిందనే ఓ అభిప్రాయం అయితే గన్నవరం నియోజకవర్గంలో  బలంగా వినిపిస్తోంది.

By
en-us Political News

  
దేశవ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక కీలక ప్రకటన చేసింది
డేటింగ్ యాప్ ద్వారా పరిచయం.. పబ్‌కు తీసుకెళ్లి రూ.29 వేల బిల్లు.!
హైదరాబాద్ నగరంలోని ఎస్‌ఆర్‌ నగర్ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపిన ఒక విషాదకర ఘటనలో యువతి ప్రాణాలు కోల్పోయింది.
అరుణాచల్ ప్రదేశ్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేసేందుకు కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది.
సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రి ప్రాంగణంలో ఓ మానసిక రోగి హల్‌చల్‌ చేయడంతో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
దేశ రాజకీయాల్లో ప్రాంతీయ అసమానతలు, ఉత్తరాది ప్రాబల్యంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి తన గళాన్ని గట్టిగా వినిపించారు.
జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత యువ షూటర్, తెలంగాణ ముద్దుబిడ్డ ఈషా సింగ్ అద్భుత ప్రతిభ కనబరిచారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు సంబంధించి ప్రభుత్వం అధికారిక ప్రకటన జారీ చేసింది.
హైదరాబాద్ నగరంలో మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేస్తూ మరో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.