వైభవ్ సూర్యవంశీ సిక్సర్ల మోత.. క్రిస్ గేల్ రికార్డుకు చేరువ

Publish Date:May 20, 2026

Advertisement

ఐండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ  రికార్డుల మోత మోగిస్తున్నాడు. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ తో మంగళవారం ( మే 19) జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. లక్నో సూపర్ జాయింట్స్‌తో జరిగిన అత్యంత కీలకమైన ఈ మ్యాచ్ లో  15 ఏళ్ల  లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగిపోయాడు.   సిక్సర్ల సునామీ సృష్టించాడు. వైభవ్ బ్యాటింగ్ విధ్వంసంతో   లక్నో నిర్దేశించిన భారీ లక్ష్యం సైతం చిన్నబోయింది. ఈ అద్భుత విజయంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్లేఆఫ్స్ రేసులో తన అవకాశాలను  సజీవంగా ఉంచుకుంది.

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జాయింట్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 220 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్నో ఓపెనర్ మిచెల్ మార్ష్ కేవలం 57 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్లతో 96 పరుగులు చేసి సెంచరీ చేజార్చుకున్నాడు. హర్ష్ మరో ఓపెనర్ జోష్ ఇంగ్లిస్ 60 పరుగులు  కలిసి  మొదటి వికెట్‌కు 109 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రాజస్థాన్ బౌలర్లలో యష్ రాజ్ పుంజా రెండు వికెట్లు పడగొట్టి లక్నో పరుగుల వేగానికి కాస్త అడ్డుకట్ట వేశాడు.  అనంతరం 221 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్‌కు ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఊహించని రీతిలో అదిరిపోయే ఇన్నింగ్స్ అందించాడు. సాధారణంగా మొదటి బంతి నుంచే అటాక్ చేసే వైభవ్, ఈ మ్యాచ్‌లో ఆరంభంలో కాస్త సంయమనం పాటించాడు. తొలి 10 బంతుల్లో కేవలం 5 పరుగులు మాత్రమే చేసిన ఈ యువ ఆటగాడు, పిచ్‌పై పట్టు సాధించిన తర్వాత లక్నో బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు.

తర్వాతి 28 బంతుల్లోనే ఏకంగా 88 పరుగులు రాబట్టాడు.  మొత్తంగా కేవలం 38 బంతులు ఎదుర్కొన్న వైభవ్ 7 ఫోర్లు, 10  సిక్సర్లతో 93 పరుగులు సాధించాడు. కేవలం 7 పరుగుల తేడాతో సెంచరీ మార్క్‌ను అందుకోలేకపోయినప్పటికీ.. వైభవ్ బ్యాటింగ్ విధ్వంసం  రాజస్థాన్ జట్టుకు విజయాన్నందించింది.   ఈ ఇన్నింగ్స్ ద్వారా వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ చరిత్రలో పలు రికార్డులను తన ఖాతాలో జమ చేసుకున్నాడు.

ఈ సీజన్‌లో పవర్‌ప్లేలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో ఆస్ట్రేలియా ఆటగాడు ట్రావిస్ హెడ్‌ను వెనక్కి నెట్టి వైభవ్   రెండో స్థానానికి చేరుకున్నాడు. అలాగే ఈ సీజన్‌లో తన సిక్సర్ల సంఖ్యను 53కి పెంచుకుని, క్రిస్ గేల్ నెలకొల్పిన ఒకే సీజన్‌లో అత్యధిక సిక్సర్ల (59) రికార్డుకు కేవలం 7 సిక్సర్ల దూరంలో నిలిచాడు. వైభవ్ అద్భుత ప్రదర్శనకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.   

By
en-us Political News

  
నల్లమలలో సోదాలు.. కౌకూర్‌, యాప్రాల్‌, అచ్చంపేటలో ఆయుధాల కోసం గాలింపు..!
హైదరాబాద్ గచ్చిబౌలి అంజయ్యనగర్‌లోని హరిహర మెన్ హాస్టల్‌లో దారుణ హత్య చోటుచేసుకుంది. తోటి పనివాడు ప్రమోద్ జరిపిన కత్తిపోట్లకు కుక్ శశిధర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఢిల్లీ ఎర్రకోట బాంబు పేలుడు కేసులో ఎన్ఐఏ సంచలన చార్జ్‌షీట్ దాఖలు చేసింది. 11 మంది ప్రాణాలు తీసిన ఈ ఘటన వెనుక లాల్ మందిర్ దాడి కుట్ర, మూత్రం నుంచి బాంబు తయారీ, 12 సార్లు రెక్కీ నిర్వహించిన విస్తుపోయే వివరాలు వెలుగులోకి వచ్చాయి.
అమెరికాలోని పెన్సిల్వేనియా ల్యాంకాస్టర్ కౌంటీలో ఎఫ్రాతా పోలీసులు చేపట్టిన కీలక అరెస్ట్ వివరాలు. క్రైమ్‌వాచ్ నిఘా మరియు తాజా క్రైమ్ అప్‌డేట్స్ కోసం చదవండి.
ఒడిశా కోరాపుట్ పరిధిలోని బాలిపేట సేవాశ్రమం హాస్టల్‌లో 9వ తరగతి విద్యార్థి సీయారా తాడింగిపై సహవిద్యార్థి తీవ్రంగా దాడి చేశాడు. మత్తు పదార్థాల ప్రభావంతోనే ఈ దాడి జరిగిందని, ర్యాగింగ్ అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఆయుధాలు చోరీ అయ్యాయి అంటూ సీన్ క్రియేట్ చేసిన ఇంటి దొంగలు..!
లండన్ వీసాలు, ఉద్యోగాల పేరిట మోసాల ఆరోపణలతో యూట్యూబర్ నందూస్ వరల్డ్ నందనను విజయవాడ పోలీసులు 4 గంటల పాటు విచారించారు. బిగ్ బాస్ తెలుగు 10 ఎంట్రీ ప్రచారం, రూ. 15 లక్షల ఫిర్యాదు మరియు పోలీసులకు ఆమె ఇచ్చిన షాకింగ్ స్టేట్‌మెంట్ పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
సంగారెడ్డి జిల్లా కంది మండలంలో అక్రమ ఇసుక దందాపై మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు సంయుక్త దాడులు నిర్వహించారు. ఎర్ధనూర్ సర్వే నెంబర్ 134లోని నక్క వాగు పరివాహక ప్రాంతంలో ఉన్న 6 ఇసుక ఫిల్టర్లను ధ్వంసం చేశారు. వాల్టా చట్టం ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు పెడతామని అధికారులు హెచ్చరించారు.
లండన్ ఉద్యోగాలు, వీసా రెన్యువల్స్ పేరిట రూ.15 లక్షల మోసానికి పాల్పడిన ఆరోపణలపై నందూస్ వరల్డ్ యూట్యూబర్ నందనను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇబ్రహీంపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు వివరాలు మరియు సీఐ సుబ్రహ్మణ్యం అందించిన పూర్తి సమాచారం ఇక్కడ చదవండి!
ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని పహుజ్ డ్యామ్ వద్ద సోషల్ మీడియా రీల్ కోసం 30 అడుగుల ఎత్తు నుంచి నీటిలోకి దూకిన యువకుడి రెండు కాళ్లు విరిగిపోయాయి. వైరల్ స్టంట్ వికటించిన పూర్తి వివరాలు మరియు వీడియో కథనం ఇక్కడ చదవండి.
సోషల్ మీడియాలో ఓ మహిళా ప్రజాప్రతినిధిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్‌పై సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ సస్పెన్షన్ వేటు వేశారు.
కృష్ణాష్టమి 2026 సందర్భంగా భారతదేశంలో తప్పక సందర్శించాల్సిన మథుర, బృందావనం, ద్వారక, గురువాయూర్ మరియు పూరీ జగన్నాథ ఆలయాల విశేషాలు మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఇక్కడ తెలుసుకోండి.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2026 అక్టోబర్ 12 నుండి 21 వరకు జరగనున్నాయి. గరుడ సేవ, రథోత్సవం, చక్రస్నానం మరియు వాహన సేవల సంపూర్ణ షెడ్యూల్ ఇక్కడ తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.