గడ్డంపై శపథం.. ఉత్తమ్ ఒక్కసారి ఆలోచించుకో...!
Publish Date:Nov 4, 2017
Advertisement
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితి ఏంటో అందరకీ తెలిసిందే. రాష్ట్రం విడపోవడంతోనే కాంగ్రెస్ పార్టీకి దుస్థితి నెలకొంది. ఏపీలో అయితే కాంగ్రెస్ కు సమాధి కట్టేశారు. తెలంగాణలోనే కాస్తో కూస్తో బెటర్. ప్రతిపక్షం పొజిషన్ లో అయినా ఉంది. కానీ అధికారంలోకి రావాలంటే మాత్రం అది అంత సామాన్యమైన విషయం కాదు. అలాంటిది ఏకంగా ఉత్తమ్ ఓ పెద్ద శపథాన్నే చేశాడు. అది కూడా తన గడ్డంపై. ప్రస్తుతం తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా లాబీలో ఓ ఆసక్తికర దృశ్యం కంటబడింది. కాంగ్రెస్ పార్టీ నేత, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి లాబీలో వస్తుండగా, తెరాసకి చెందిన ఎర్రబెల్లి దయాకర్ రావు ఎదురు పడ్డారు. ఆ సమయంలో "అన్నా, గడ్డం ఎప్పుడు తీస్తావ్?" అని ఎర్రబెల్లి ప్రశ్నించగా, "2019లో తీస్తాను" చెప్పారు. అయితే వచ్చే ఎన్నికల్లో విజయం కాంగ్రెస్ పార్టీదేనని, అప్పటిదాకా గడ్డం తీయబోనని, ప్రభుత్వ ఏర్పాటు తరువాతే షేవింగ్ చేయించుకుంటానని ఉత్తమ్ శపథం చేసిన సంగతి తెలిసిందే. మరి రాజకీయ నాయకులు సవాళ్లు చేయడం కామనే. తాము కనుక ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తామని ఒకరంటే... పదవికి రాజీనామా చేస్తానని మరొకరంటారు. కొంతమంది అయితే గుండు కొట్టించుకుంటానని అంటారు. ఆశ్చర్యం ఏంటంటే.. అలా శబథాలు చేయడం... వాటికి లైట్ తీసుకోవడం కూడా వారికి కామనే. అలాంటి నేపథ్యంలో ఉత్తమ్ ఏకంగా కాంగ్రెస్ గెలుస్తుందని చాలా కాన్ఫిడెంట్ గా చెబుతూ ఏకంగా గడ్డం తీయనని శపథం చేశాడు. మరి కాంగ్రెస్ అధికారంలోకి రావడం అంటే అబ్బో అది కలే. అలాంటిది ఉత్తమ్ ఇలాంటి శపథాలు అవసరమా.. ఒకవేళ అధికారంలోకి రాకపోత్ మళ్లీ ఐదు సంవత్సరాలు అలాగే ఉండాలి.. ఏది ఏమైనా ఉత్తమ్ శపథం చేసేముందు ఒకసారి ఆలోచించాల్సింది.
http://www.teluguone.com/news/content/uttam-kumar-reddy-39-78629.html





