ఆర్కే ఒక్కడే కాదు.. జగన్ కు అందరూ కూరలో కరివేపాకులే!

Publish Date:Dec 12, 2023

Advertisement

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాజకీయ ప్రత్యర్థి, వైసీపీ కీల‌క నేత, మంగ‌ళ‌గిరి శాస‌న స‌భ్యుడు ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి (ఆర్కే) వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. హ‌ఠాత్తుగా ఉరుములు లేని పిడుగులా ఆర్కే రాజీనామా చేసేసి సంచ‌ల‌నం సృష్టించారు. అదేదో ఆషామాషీగానో.. బెదిరించడానికో కాదు. స్పీకర్ ఫార్మాట్ లో శాస‌న స‌భ్య‌త్వానికి, అదేవిధంగా వైసీపీ స‌భ్య‌త్వానికి కూడా ఆయ‌న రాజీనామా చేశారు. నిజానికి ఆయన రాజీనామాను  వైసీపీ నేతలెవరూ ఊహించి ఉండ‌రు. ఎందుకంటే వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కంటే ఆళ్ల రామకృష్ణారెడ్డే  అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంపై ఎక్కువగా పోరాడారు. నూతన రాజధానికి అతి దగ్గరలో ఉండే ఆర్కే.. అదే స్థాయిలో  తెలుగుదేశం ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడంలో చాలా యాక్టివ్ గా ఉండేవారు. ఇంకా చెప్పాలంటే జగన్ కోసం సుదీర్ఘ రాజకీయ భవిష్యత్ ఉన్న ఆర్కే సూటిగా చంద్రబాబుతోనే తలపడ్డారు. హైకోర్టు, సుప్రీంకోర్టుల చుట్టూ తిరిగి తెలుగుదేశం నేతలు, అమరావతిపై కూడా వ్యక్తిగతంగా కేసులు వేశారు. అలాంటి నేత ఉన్నఫళంగా జగన్ కు, ఆయన పార్టీకి రాంరాం చెప్పేశారు.  దీంతో ఒక్కసారిగా వైసీపీలో ఏం జరుగుతోందన్నది ఆసక్తిగా మారింది.

రాజీనామా అనంతరం కూడా ఆర్కే మీడియా ముందు ఎక్క‌డా ప‌న్నెత్తు మాట ఎవ‌రినీ   అన‌లేదు. ఆర్కే లాంటి ఎమ్మెల్యే సీఎం జ‌గ‌న్‌కు చెప్ప‌కుండా రాజీనామా చేశారంటే నమ్మలేం. జగన్ కు అత్యంత సన్నిహితుడైన నేతగా మెలిగిన ఆర్కే జగన్ కు ముందుగానే చెప్పి రాజీనామా చేసి ఉంటార‌ని ప‌రిశీల‌కులు అంటున్నారు. దీంతో రాజీనామా చేయ‌డం వెన‌క కార‌ణాలు ఏంటి, అలాగే ఆర్కే లాంటి నేత రాజీనామా చేసి వెళ్లిపోతున్నా.. జగన్   లైట్ ఎలా తీసుకున్నరన్నదానిపై ఇప్పుడు  విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఆర్కే రాజీనామా వెనక‌ చాలా  కార‌ణాలు ఉన్నాయని అంటున్నారు. వీటిని ఆర్కే పైకి చెప్ప‌క‌పోయినా వైసీపీలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయన్నది ఇప్పుడు అందరికీ అర్ధమౌతున్న రాజకీయ వాస్తవం. 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో సాక్షాత్తూ జ‌గ‌నే ఆర్కేను మంత్రిని చేస్తానని హామీ ఇచ్చారు.  కానీ, ఆ మాట నిల‌బెట్టుకోలేదు. పోనీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సమయంలోనైనా ఆర్కే పేరును కనీసం పరిశీలించనుకూడా లేదు. పైగా కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో   ఆర్కే కంటే జూనియర్లకు కేబినెట్ లో అవకాశం ఇచ్చిన జగన్ ఆర్కేకు కనీసం అప్పాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదు. 

అలాగే ఒకవైపు రాజ్యసభ సభ్యుడైన తన సోదరుడు, మరోవైపు టీడీపీ నుంచి వ‌చ్చిన గంజి చిరంజీవికి పార్టీ ప్రాధాన్యత పెంచుతూ వచ్చింది. ముందుగా చిరంజీవిని వైసీపీ చేనేత విభాగం అధ్యక్షుడిగా, తరువాత ఆప్కో చైర్మన్ గా నియమించారు. దీంతో ఆయన ఒక అధికార కేంద్రంగా మారిపోయారు.  ఆ తర్వాత గత ఎన్నికల్లో తన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించిన వేమారెడ్డిని మంగళగిరి తాడేపల్లి నగర పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. దీంతో వేమారెడ్డి మంగళగిరిలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి దానిని చిరంజీవితో ప్రారంభింపచేశారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కూడా మరో వర్గాన్ని ఏర్పాటు చేసుకొని నియోజకవర్గంలో గ్రూపు కట్టారు. అన్నీ తెలిసినా చూస్తూ ఉండడం తప్ప ఆర్కే ఏమీ చేయలేకపోయారు. చివరికి చిరంజీవినే తన నియోజకవర్గ ఇన్ చార్జిగా ప్రకటించడంలో పార్టీ పెద్దలు ఒక ప్లాన్ ప్రకారమే ఆర్కేకు పొగబెట్టారని స్పష్టంగా తేలిపోవడంతోనే ఎమ్మెల్యే పదవికి ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

ఒకరకంగా ఆర్కే తన భవిష్యత్తును కాదని మరీ జగన్ కోసం పనిచేశారు. అమరావతిలో అసైన్మెంట్ భూములు, ఇన్నర్ రింగ్ రోడ్డు విషయంలో  సీఐడీకి  ఆర్కేఫిర్యాదు చేశారు. తెలంగాణలో ఓటుకు నోటు కేసులోనూ చంద్రబాబు పేరు చేర్చాలని, కేసును తెలంగాణ ఏసీబీ నుంచి సిబిఐకి బదలాయించాలని పిల్ వేశారు. అసలు తాను అమరావతి రాజధాని ప్రాంతంలో ఒక ఎమ్మెల్యేనన్న విషయాన్ని కూడా మర్చిపోయి రాజకీయంగా జగన్ కు లబ్ది చేకూర్చేందుకు పనిచేశారు. ఫలితంగా ఇప్పుడు ఆర్కే తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకోగా..   పార్టీ అదే వ్యతిరేకతను చూపి ఆయనను పక్కన పెట్టేసింది. ఇది ఒక్క ఆర్కేకి మాత్రమే కాదు.. అధికారంలో ఉండగా ప్రజల ప్రయోజనాలను కాకుండా జగన్ మెప్పు కోసం ఆరాటపడిన వారందరికీ  ఫలితం ఇలాగే ఉంటుందన్నది ఆర్కే అనుభవం చెప్పే మాట. ఎవరినైనా తన చేతిలో పావులుగా మార్చుకొని రాజకీయ అవసరాల కోసం వాడుకోవడం, ఆ తరువాత కూరలో కరివేపాకులా పక్కన పారేయడం జగన్ కు వెన్నతో పెట్టిన విద్య అని పార్టీ వర్గాల్లోనే గట్టిగా వినిపిస్తోంది. ఇప్పుడు వైసీపీలో ఆర్కే బాటలోనే  మాజీ మంత్రులు, మంత్రులు సహా పలువురు ఉన్నట్లు రాజకీయవర్గాలలో వినిపిస్తోంది. 

By
en-us Political News

  
కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు.
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం వివరాలు. రూ. 5 లక్షల ఉచిత బీమా కవరేజ్, అర్హతలు, వయస్సు పరిమితి మరియు దరఖాస్తు విధానం గురించిన పూర్తి సమాచారం.
విజయవాడలో ప్రతిష్ఠాత్మక రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఆన్‌లైన్ పరిచయం.. చాటింగ్‌తో స్నేహం.. వీడియో కాల్స్‌తో నమ్మకం.. ఆ తర్వాత ఇంటికి ఆహ్వానం. అంతా సజావుగా సాగుతున్నట్లే కనిపిస్తుంది. కానీ ఆ పరిచయాల వెనుక ఉన్నది స్నేహం కాదు
హైదరాబాద్ వేదికగా ఇటీవల జరిగిన భారత్ సమ్మిట్‌ 2026లో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
సినిమాను తలపించిన నగల దొంగతనం..పట్టించిన పచ్చబొట్టు.!
హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా బిర్యానీ ప్రియులకు భారీ షాక్ తగిలింది.
ప్రియుడి హత్యకు 19 ఏళ్ల యువతి సుపారీ.. షాకింగ్ ట్విస్ట్.!
దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపడానికి స్వస్థలానికి వచ్చిన ఓ యువతికి మృత్యువు అనూహ్య రీతిలో ఎదురైంది.
హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే కార్తీక మాసం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.