నిండుకుంటున్న అమెరికా ఆయుధ నిల్వలు.!

Publish Date:Aug 9, 2026

Advertisement

ఇరాన్‌ యుద్ధం అమెరికాను తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేస్తున్నది. అగ్రరాజ్యం ఇరాన్  యుద్ధం కారణంగా ఇటు ఆర్థికంగానూ, అటే ఆయుధ నిల్వల పరంగానూ కూడా సంక్షోభం నుంచి సంక్షోభంలోకి కూరుకుపోతున్నది. ఇరాన్ యుద్ధం అమెరికా సైనిక సామర్థ్యాన్నిదారుణంగా దెబ్బ తీసింది. ఈ యుద్ధం కారణంగా  అమెరికా అత్యాధునిక క్షిపణి నిరోధక వ్యవస్థలు, వ్యూహాత్మక ఆయుధాలను  భారీగా ఉపయోగించాల్సి రావడంతో.. ఆ దేశం వద్ద  ఉన్న ప్రధాన క్షిపణి నిల్వలు నిండుకుంటున్నాయి. అమెరికా రక్షణ సామర్థ్యానికి వెన్నెముకగా నిలిచే  ఇంటర్‌సెప్టర్లు ఖాళీ అయిపోయాయి. ఇది ఆ దేశాన్ని ఆందోళన కు గురి చేస్తోంది.  అమెరికా మాజీ రక్షణ కార్యదర్శి మార్క్ ఎస్పర్ ఇందుకు సంబంధించి  సంచలన విషయాలను బయటపెట్టారు. ఇరాన్‌ పై  యుద్ధ చర్యల కారణంగా  అమెరికా ఆయుధాగారంలో  పేట్రియాట్, థాడ్ వంటి మిస్సైల్ డిఫెన్స్ ఇంటర్‌సెప్టర్ల సంఖ్య  కనిష్ట స్థాయికి పడిపోయిందని ఓ ఇంటర్వ్యేలో వెల్లడించారు.  ఆయుధ నిల్వల క్షీణత కారణంగా   ప్రపంచంలో ఎదురయ్యే ఇతర రక్షణ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనే   సంసిద్ధత అమెరికాకు లేకుండా పోతుందని ఆయన పేర్కొన్నారు.  

ప్రచ్ఛన్న యుద్ధం అనంతరం  అమలు చేసిన స్ట్రాటజిక్ విధానాలు,  ఉక్రెయిన్ పోరుకు భారీగా ఆయుధ సహాయం అందించడం,  ప్రస్తుతం ఇరాన్‌తో యుద్ధం.. అమెరికా ఆయుధ నిల్వలపై   ప్రభావం చూపాయన్న  మార్క్ ఎస్పర్.. ఈ   ఆయుధ కొరత అమెరికాను  బలహీనపరుస్తోందనీ,  అదే సమయంలో ఈ పరిస్థితి చైనా వంటి దేశాలకు   తప్పుడు సంకేతాలు పంపే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు.  అదలా ఉంటే.. ఒక్క పేట్రియాట్ ఇంటర్‌సెప్టర్ క్షిపణిని నిర్మించడానికి  రెండేళ్ల సమయం పడుతుంది. అందువల్ల ప్రభుత్వం ఎన్ని అత్యవసర నిధులు విడుదల చేసినప్పటికీ..   ఆయుధ కొరతను అధిగమించడం అమెరికాకు ఇప్పటికిప్పుడు సాధ్యపడే పరిస్థితి లేదు. 

పశ్చిమాసియా యుద్ధంలో  పేట్రియాట్, థాడ్ వ్యవస్థలు  క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయి. శత్రు దేశాల యుద్ధ విమానాలు, క్రూయిజ్ క్షిపణులను నిరోధించడానికి పేట్రియాట్ వ్యవస్థ ఉపయోగపడుతుండగా, బాలిస్టిక్ క్షిపణులను అంతరిక్ష సరిహద్దుల్లోనే  కూల్చివేసేందుకు థాడ్ డిఫెన్స్ సిస్టమ్ దోహదం చేస్తున్ననది. ఇరాన్  వరుస మిస్సైల్ దాడుల నుంచి తమ స్థావరాలను, మిత్రదేశాలను కాపాడుకోవడానికి అమెరికా వీటిపైనే ఎక్కువగా ఆధారపడింది.  ఇప్పుడు వాటి నిల్వలే దాదాపు అడుగంటి పోవడంపై అగ్రరాజ్యంలో ఆందోళన వ్యక్తం అవుతోంది. 

క్షీణిస్తున్న ఆయుధ నిల్వలను పునరుద్ధరించడానికి పెంటగాన్ అదనంగా 67 బిలియన్ డాలర్ల బడ్జెట్‌ ప్రతిపాదించగా,  దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డెమొక్రాటిక్ పార్టీ సెనేటర్ క్రిస్ మర్ఫీ అయితే..  ఇప్పటికే త  టోమాహాక్, ఇంటర్‌సెప్టర్ క్షిపణులను దాదాపుగా వాడేశామని, ఇరాన్‌తో యుద్ధం ముగిసే వరకు ఇక అదనపు సైనిక నిధులను ఆమోదించడం కరెక్ట్ కాదంటున్నారు. అయితే.. రిపబ్లికన్ సెనేటర్ జిమ్ బ్యాంక్స్  ప్రభుత్వం అనుసరిస్తున్న ఇరాన్ విధానాలకు మద్దతు,. ఇరాన్ ఎలాంటి పరిస్థితుల్లోనూ అణ్వాయుధ సామర్థ్యాన్ని సాధించకుండా అడ్డుకోవడమే అమెరికా ప్రాధాన లక్ష్యమంటూ.. అందుకు సైనిక చర్యలు అనివార్యమన్నారు. మొత్తానికి ఇరాన్ తో యుద్ధం అమెరికాను చిక్కుల్లో పడేసిందని చెప్పక తప్పదు. 

US Iran War, Patriot Missile System, THAAD Interceptors, Mark Esper Defense, Pentagon Weapons Shortage

By
en-us Political News

  
ఒకప్పుడు మావోయిస్టు లకు కంచుకోటగా, సేఫ్‌ షెల్టర్‌ జోన్‌గా ఉన్న కర్రెగు ట్టలు ఇప్పుడు తెలంగాణ పోలీసుల పటిష్ట భద్రతలోకి వచ్చాయి.
పెద్ది సుదర్శన్ రెడ్డి సంతాప సభలో కంటతడి పెట్టిన హరీశ్ రావు..!
మద్యం మత్తులో ఇంజెక్షన్..! విద్యార్థిని ప్రాణాలు తీసిన ఆర్ఎంపీ..!
మద్యం మత్తులో కారు డ్రైవర్ భీభత్సం.. ప్రమాదంలో ఆర్మీ జవాన్ మృతి..!
జేపీఎస్సీ పేపర్ లీక్ దుమారం.. విద్యార్థులపై పోలీసుల వాటర్ క్యాన్స్ ప్రయోగం..!
ళ్ల తరబడి కాగితాలకే పరిమితమైన ఈ మెట్రో ప్రాజెక్టులకు సంబంధించిన పనులలో ఇప్పుడు కదలిక రావడమే కాకుండా వేగం పుంజుకున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. విజయవాడ, విశాఖ రైల్వే ప్రాజెక్టులు రెండూ కలిపి 21వేల 616 కోట్ల భారీ అంచనా వ్యయంతో, 84.63 కిలోమీటర్ల పొడవైన మెట్రో నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు అధికార యంత్రాంగం ప్రణాళికలు రూపొందించింది.
మీ స్మార్ట్‌ఫోన్ మరియు డిజిటల్ డేటాను హాకర్లు, డేటా చోరీ నుండి ఎలా రక్షించుకోవచ్చో తెలుసుకోండి. నార్టన్, 1పాస్‌వర్డ్, ప్రొటాన్ మెయిల్ మరియు అథెంటికేటర్ యాప్‌లతో అత్యుత్తమ సైబర్ సెక్యూరిటీ గైడ్.
USB పెన్ డ్రైవ్‌ల వాడకం ఎందుకు తగ్గింది? క్లౌడ్ స్టోరేజ్, స్మార్ట్‌ఫోన్‌లు, వేగవంతమైన SSDలు డేటా నిల్వ ప్రపంచాన్ని ఎలా మార్చేశాయో, పెన్ డ్రైవ్‌ల భవిష్యత్తు ఏమిటో ఈ వెబ్ స్టోరీ ద్వారా తెలుసుకోండి.
రన్నింగ్ అంటే విసుగు చెందే వారికి గూగుల్ జెమిని AI మరియు గార్మిన్ స్మార్ట్‌వాచ్ ఎలా ఒక కొత్త ఉత్తేజాన్ని ఇచ్చాయో ఈ కథనంలో తెలుసుకోండి. 14 కిమీ సిటీ2సర్ఫ్ పరుగు కోసం జెమిని అందించిన 3 దశల వర్కౌట్ ప్లాన్, హెల్త్ టిప్స్ మరియు ఫిట్‌నెస్ సీక్రెట్స్ మీ కోసం!
నల్సార్ క్యాంపస్‌లోని  విద్యార్థుల  మాత్రం సీజేఐ జస్టిస్ సూర్యకాంత్‌ను స్నాతకోత్సవానికి ఆహ్వానించడానికి వీల్లేదంటూ వ్యతిరేకిండం కలకలం రేపింది. దాదాపు  వర్సిటీ స్నాతకోత్సవానికి సీజేఐ సూర్యకాంత్‌ను చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించవద్దంటూ దాదాపు 450 మంది విద్యార్థులు సంతకాలు చేసిన లేఖను వర్సిటీ వీసీకి సమర్పించారు. 
ఆగస్టు 10 నాటి పసిడి మరియు వెండి రిటైల్ ధరల పూర్తి సమాచారం. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ వంటి ప్రధాన నగరాల్లో 24K, 22K బంగారం మరియు కిలో వెండి తాజా రేట్లు, MCX మార్కెట్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
భారత స్టాక్ మార్కెట్ లైవ్ అప్‌డేట్స్: సెన్సెక్స్, నిఫ్టీ పతనం, ఐసిఐసిఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ షేర్ల కదలికలు, ఐటీ రంగం రికవరీ మరియు ఎస్‌బీఐ క్యూ1 ఫలితాల పూర్తి విశ్లేషణ. గ్లోబల్ మార్కెట్ సంకేతాలు, గిఫ్ట్ నిఫ్టీ స్థాయిలు మరియు ఈ వారం ఇన్వెస్టర్లు పాటించాల్సిన కీలక వ్యూహాలను క్షుణ్ణంగా తెలుసుకోండి.
చైనాకు చెందిన ప్రముఖ రోబోటిక్స్ సంస్థ యూనిట్రీ షాంఘై మార్కెట్లో ఐపీఓగా అడుగుపెడుతోంది. $8.5 బిలియన్ల వ్యాల్యుయేషన్, హ్యూమనాయిడ్ రోబోట్ల విక్రయాలు, మరియు ప్రపంచ రోబోటిక్స్ రంగంలో చైనా సాధిస్తున్న తిరుగులేని ఆధిపత్యం గురించిన పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.