ఇరాన్ తో యుద్ధంలో అమెరికాకు చావుదెబ్బ.!

Publish Date:Aug 14, 2026

Advertisement

ఇరాన్ తో యుద్ధం అమెరికాకు కొరివితో తలగోక్కున్న చందంగా మారిందా? ఈ యుద్ధం అమెరికా సైనిక బలహీనతలను ప్రపంచానికి చాటిందా? అన్నిటికీ మించి భారీ ఆర్థిక, ఆయుధ నష్టాన్ని మిగిల్చిందా అంటే.. అమెరికాకే చెందిన ప్రముఖ వార్తా పత్రిక వాషింగ్టన్ పోస్టు ఔననే అంటోంది.  ఈ పత్రికలో వచ్చిన ప్రత్యేక కథనం మేరకు  అమెరికా సైనిక పాటవానికి, అత్యాధునిక నిఘా సాంకేతికతకు నిదర్శనంగా నిలిచే శక్తిమంతమైన ఎంక్యూ-9 రీపర్ డ్రోన్ వ్యవస్థపై ఇరాన్ దాడి తీవ్ర ప్రభావాన్ని చూపింది. అమెరికా వద్ద ఉన్న మొత్తం రీపర్ డ్రోన్ల బలగంలో  25 శాతం డ్రోన్లు ధ్వంసమయ్యాయి.  యుద్ధక్షేత్రంలో ఇప్పటివరకు అమెరికా దాదాపు 45 రీపర్ డ్రోన్లను శాశ్వతంగా కోల్పోవడం వల్ల ఆ దేశ సైనిక, రక్షణ వ్యూహాలకు భారీ గండి పడింది.

అంతే కాదు ఇది అమెరికా ఖజానాపై కూడా తీవ్ర ప్రభావం చూపింది.  ఒక్కో ఎంక్యూ-9 రీపర్ డ్రోన్ విలువ దానిలో అమర్చే హైటెక్ సెన్సార్లు, ఆయుధాల స్థాయిని బట్టి  దాదాపు 50 మిలియన్ డాలర్ల వరకు ఉంటుంది. ఈ లెక్కన ధ్వంసమైన 45 డ్రోన్ల మొత్తం విలువ సుమారు 1.3 బిలియన్ డాలర్లకు పైగానే ఉంటుందని వాషింగ్టన్ పోస్టు అంచనా వేసింది.   అగ్రరాజ్యం గర్వంగా చెప్పుకునే ఈ డ్రోన్లను ఇరాన్ అతి సునాయాసంగా  ఇరాన్ ముందు ఎందుకు బోల్తా పడుతున్నాయనే దానిపై రక్షణ  రంగ విశ్లేషకులు ఈ  రీపర్ డ్రోన్లు చాలా నెమ్మదిగా, తక్కువ ఎత్తులో ప్రయాణించడం వల్ల ఇరాన్ ఉపయోగిస్తున్న ఎయిర్ డిఫెన్స్ క్షిపణులకు   సులభమైన లక్ష్యాలుగా మారుతున్నాయంటున్నారు. కేవలం క్షిపణి దాడులతో పాటు సాంకేతిక లోపాలు, కమ్యూనికేషన్ సిగ్నల్స్ కట్ అవ్వడం వల్ల కూడా కొన్ని డ్రోన్లు కూలిపోయాయి. ఇక  మధ్యప్రాచ్యంలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ జరిపిన మెరుపు దాడుల్లో నేలపై సిద్ధంగా ఉన్న  కొన్ని  డ్రోన్లు  పూర్తిగా నాశనమయ్యాయి.

ఈ తీవ్ర నష్టంతో అమెరికా వద్ద ఉన్న డ్రోన్ల నిల్వ ఆందోళనకర స్థాయికి పడిపోయింది. యుద్ధానికి ముందు అమెరికా వైమానిక దళం, మెరైన్ కోర్ప్స్ వద్ద  మొత్తం 185 రీపర్ డ్రోన్లు ఉండగా, ఇప్పుడు వాటి సంఖ్య   135కు పడిపోయిందని ఎయిర్‌ఫోర్స్ లెఫ్టినెంట్ జనరల్ డేవిడ్ టాబోర్ యుఎస్ సెనెట్‌లో  అంగీకరించారు.  

US Iran Conflict, Iran America War, MQ-9 Reaper Drones, US Drone Losses, Pentagon News, TeluguOne

By
en-us Political News

  
స్వాతంత్ర్య దినోత్సవ శుభసందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
కమ్మటి నీటి బొట్టు కోసం నల్లమల అడవుల వైపు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూడటం ఆ ప్రాంత ప్రజలకు కొత్తేమీ కాదు.
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో గోల్కొండ కోట పరిసరాల్లో శనివారం ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు
తిరుమల శ్రీవారి దర్శనం, సేవలు, వసతి బుకింగ్‌ల పేరుతో నకిలీ వెబ్‌సైట్లు, వాట్సాప్ ఖాతాలు, సోషల్ మీడియా పేజీల ద్వారా జరుగుతున్న మోసాల పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
ఎర్రకోట పరిసరాల్లో మల్టీ లేయర్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. పంద్రాగస్టు వేడుకల ముంగిన  ఈ ఈమెయిల్ బెదిరింపులు రావడంతో  భద్రత, నిఘా వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేశారు.  ముందస్తు జాగ్రత్త చర్యగా అన్ని ప్రవేశ  నిష్క్రమణ మార్గాల్లో వాహనాలు, ప్రయాణీకుల తనిఖీలు చేపట్టారు.  
కేసీఆర్ ఉచితంగా ఇస్తే.. ఇందిరమ్మ ఇండ్లకు 6 లక్షలా..!
గతంలో ఎన్నడూ లేని విధంగా అంతర్జాతీయ మార్కెట్లో  ఇండియ్  ఉత్పత్తులకు డిమాండ్ పెరిగింది. దీంతో ఎగుమతులు   పుంజుకున్నాయి. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం జూలై నెలలో ఇండియా  దాదాపు 44.24 బిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో  4.22 లక్షల కోట్ల రూపాయల విలువైన వస్తువులను ఎగుమతి చేసింది.
గతంలో   ఒక కేసు విచారణ సందర్భంగా సీజేఐ చేసిన వ్యాఖ్యలకు నిరసినగా లా విద్యార్థులు వీసీకి ఈ లేఖ రాశారు. దీనిపై తీవ్రంగా మడిపడిన బీసీఐ..   నాల్సార్‌ విద్యార్థులను అడ్వకేట్లుగా నమోదు చేయవద్దంటూ రాష్ట్ర బార్ కౌన్సిల్స్‌కు ఆదేశాలు జారీ చేసింది.  
తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది
వైసీపీ నేత, మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
ఎండనకా, వాననకా తమ కళ్లెదుటే మట్టి దిబ్బలుగా మిగిలిపోయిన కలల రాజధానిని చూసి మూగబోయిన గుండెలకు నేడు కొద్దిగా ఉపశమనం లభించింది.
సావర్కర్ పరువునష్టం కేసులో ఊరట..!
గోదావరి పుష్కరాలు– 2027 నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.