ఇరాన్‌పై అమెరికా వైమానిక దాడులు.. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు.!

Publish Date:Jul 7, 2026

Advertisement

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు ప్రజ్వరిల్లాయి.  యుద్ధ జ్వాలలు ఎగసిపడుతున్నాయి.  హర్మూజ్ జలసంధి వేదికగా ఇరాన్  వాణిజ్య నౌకలపై దాడులకు తెగబడటంతో , అమెరికా ప్రతిదాడి ప్రారంభించింది.   అమెరికా రక్షణ శాఖ సోషల్ మీడియా వేదికగా ఈ దాడులకు సంబంధించి ప్రకటనను కూడా విడుదల చేసింది. 

ప్రస్తుతం తుర్కియేలో జరుగుతున్న నాటో శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఈ పరిణామాలపై  స్పందించారు. ఇరాన్ దుశ్చర్యకు బుద్ధి చెప్పేలా రూపొందించిన వైమానిక దాడి ప్రణాళికకు ఆయన అక్కడి నుంచే ఆమోదం తెలిపారు. అమెరికా వైమానిక దాడుల ధాటికి దక్షిణ ఇరాన్‌లోని   రేవు పట్టణాలు బందర్ అబ్బాస్, సిరిక్,   క్వేష్మ్ దీవుల పరిసర ప్రాంతాలు భారీ పేలుళ్లతో దద్దరిల్లాయి.   ఇరాన్ ప్రభుత్వ అధికారిక మీడియా సంస్థలు తమ భూభాగంలో సంభవించిన ఈ భారీ పేలుళ్లను ధ్రువీకరించాయి. 

అమెరికా  కమాండ్ బలగాలు ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని దెబ్బతీసేలా వ్యూహాత్మక లక్ష్యాలపై క్షిపణుల వర్షం కురిపించాయి. ఈ మెరుపు దాడుల్లో ఇరాన్‌కు చెందిన   వాయు రక్షణ వ్యవస్థలు, కోస్టల్ రాడార్ సైట్లు, ఉపరితలం నుంచి గగనతలంలోకి దూసుకెళ్లే అత్యాధునిక క్షిపణి కేంద్రాలు,  డ్రోన్ లాంచ్ ప్యాడ్లు ధ్వంసమయ్యాయి. వీటితో పాటు  ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కి చెందిన 60కి పైగా చిన్న తరహా యుద్ధ నౌకలను అమెరికా క్షిపణులు సముద్రంలోనే నామరూపాలు లేకుండా చేశాయి. ఈ స్థాయి విధ్వంసం ఇరాన్ నావికా, వైమానిక రక్షణ వ్యవస్థలను కోలుకోలేని దెబ్బతీసింది.

యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ (యూకేఎంటీవో)   నివేదికల ప్రకారం.. అసలు వివాదం ఒమన్ తీరానికి సమీపంలో మొదలైంది. ఇరాన్ దళాలు అక్కడ ప్రయాణిస్తున్న సౌదీ అరేబియాకు చెందిన ఒక ముడి చమురు ట్యాంకర్,   ఖతార్‌కు చెందిన ద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్‌జీ) ట్యాంకర్‌ సహా మొత్తం మూడు వాణిజ్య నౌకలపై డ్రోన్లు,   క్షిపణులతో దాడులు చేశాయి.  ఈ దాడుల నేపథ్యంలో అమెరికా  కఠిన నిర్ణయం తీసుకుంది. గత నెలలో ఉభయ దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక ఒప్పందాన్ని పక్కనపెట్టి..  ఇరాన్‌కు ఇచ్చిన చమురు విక్రయాల ప్రత్యేక ఆంక్షల మినహాయింపు తక్షణమే రద్దు చేస్తున్నట్లు వైట్ హౌస్ ప్రకటించింది. శాంతి చర్చల మధ్య ఇలాంటి ఉల్లంఘనలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, ఇరాన్ స్వయంగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని చేతులా చెడగొట్టుకుందని అమెరికా రక్షణ శాఖ పేర్కొంది. 

Strait of Hormuz conflict, Donald Trump NATO summit, IRGC boats destroyed, US Central Command strikes, West Asia war news

By
en-us Political News

  
హైదరాబాద్‌లో కేంద్ర మంత్రి పేరుతో వచ్చిన నకిలీ ఇన్వెస్ట్‌మెంట్ ప్రకటన నమ్మి రూ.85 లక్షలు పోగొట్టుకున్న ప్రముఖ డాక్టర్. సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తు వివరాలు మీకోసం.
భారత్,ఇంగ్లాండ్ 3వ టీ20 మ్యాచ్‌లో తిలక్ వర్మ స్టంపింగ్ వివాదంపై థర్డ్ అంపైర్ నిర్ణయం వెనుక ఉన్న అసలు ఐసీసీ క్రికెట్ నిబంధనలు మరియు పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఈ దర్యాప్తులో భాగంగా పోలీసులు ఇప్పటివరకు ఐదుగురు కీలక నిందితులను అరెస్ట్ చేశారు. వారిలో విజయవాడకు చెందిన 23 ఏళ్ల మహ్మద్ రహ్మతుల్లా షరీఫ్, 27 ఏళ్ల ఎండీ డానిష్, 23ఏళ్ల మీర్జా సోహైల్ బేగ్‌లతో పాటు, హైదరాబాద్‌కు చెందిన సయీదా బేగం, కర్ణాటకలోని బళ్లారికి చెందిన అబ్దుల్ సలాం ఉన్నారు.
ఫిఫా వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో నరాలు తెగే ఉత్కంఠ కొలంబియాపై పెనాల్టీ షూటౌట్‌లో 4,3 తేడాతో స్విట్జ‌ర్లాండ్ చారిత్రక విజయం సాధించింది. రూబెన్ వ‌ర్గాస్ నిర్ణయాత్మక గోల్‌తో 1954 తర్వాత తొలిసారి క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లిన స్విస్ జట్టు, ఇప్పుడు డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాతో తలపడనుంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి
భారీ వర్షాలు మరియు కొండచరియలు విరిగిపడటంతో ముంబై,పుణే రైలు సర్వీసులకు తీవ్ర అంతరాయం కలిగింది. హైదరాబాద్, విశాఖ రైళ్లు దారి మళ్లించారు. పూర్తి వివరాలు, టికెట్ రీఫండ్ రూల్స్ మరియు లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చూడండి.
పాత ఇల్లు అమ్మి కొత్త ఇల్లు కట్టేటప్పుడు కోవిడ్ లేదా ఇతర కారణాల వల్ల ఆలస్యమైతే సెక్షన్ 54 కింద లభించే ఆదాయపు పన్ను మినహాయింపు రద్దవుతుందా చెన్నై ఐటీఏటీ పన్ను చెల్లింపుదారులకు అనుకూలంగా ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు మరియు పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
మోబిక్విక్ (MobiKwik) యాప్ ద్వారా మీ క్రెడిట్ కార్డ్ బిల్లులు చెల్లించి 1% నుండి 5% వరకు భారీ క్యాష్‌బ్యాక్ ఎలా పొందాలో తెలుసుకోండి. జీమెయిల్ బిల్ఫెచ్ ఫీచర్, నియమ నిబంధనలు మరియు గరిష్ట పొదుపు చిట్కాలు ఇక్కడ చూడండి.
ప్రజలకు మెరుగైన సేవలను అందించడంతో పాటు సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు చేర్చేందుకు డిజిటల్ గవర్నెన్స్ ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలు అందించేందుకు వివరాలను పూర్తిగా డిజిటలైజ్ చేయాలని సూచించారు.
అయితే బ్యాటరీ ఛార్జ్ విషయంలో నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందనడానికి ఈ ఘటన నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది. ఎలక్ట్రిక్ మెర్సిడెస్-బెంజ్ కారు బ్యాటరీ పూర్తిగా డిశ్చార్జ్ కావడంతో నడి రోడ్డులో నిలిచిపోయి.. తీవ్రమైన ట్రాఫిక్ సమస్యకు కారణమైంది.
రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ ప్రభుత్వ రంగ బ్యాంకుల కన్సార్టియం నుంచి తీసుకున్న రుణ నిధులను రుణ ఒప్పంద నిబంధనలకు విరుద్ధంగా మధ్యవర్తి సంస్థలు, అనుబంధ కంపెనీల ద్వారా రిలయన్స్ ఏడీఏ గ్రూప్‌లోని ఇతర సంస్థలకు మళ్లించి నట్లు దర్యాప్తులో భాగంగా సీబీఐ గుర్తించింది. ఈ చర్యల వల్ల బ్యాంకులకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లగా.. సంబంధిత సంస్థలు, నిందితులకు అక్రమ లాభం చేకూరినట్లు సీబీఐ చార్జ్‌షీట్‌లో పేర్కొంది.
ఈ ప్రారంభోత్సవం ఎప్పుడు అన్న ప్రశ్నకు.. ప్రధానమంత్రి ఎప్పుడు ప్రారంభోత్సవానికి రావడానికి తేదీ ఖరారు చేస్తారో, ఆరోజునే ప్రారంభిస్తామన్నారు. అలాగే.. ప్రారంభోత్సవం జరిగిన వారం రోజులలోనే ఇక్కడ నుంచి విమానరాకపోకలను ప్రారంభిస్తామని మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు.
ఈ దారుణ వైఫల్యంపై టీమిండియా స్కిప్పర్ శ్రేయస్ అయ్యర్ అసహనం వ్యక్తం చేశాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన శ్రేయస్ అయ్యర్.. జట్టు ప్రదర్శన ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, మైదానంలో ఆడిన తీరు చెత్తగా ఉందంటూ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు సాధించింది. ఆ జట్టు ఓపెనర్ ఫిల్ సాల్ట్ భారత బౌలర్లపై విరుచుకుపడుతూ 44 బంతుల్లో 70 పరుగులుచేశాడు. జోస్ బట్లర్ 36 రాణించాడు. చివర్లో శామ్ కర్రన్ 24 బంతుల్లో 41 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడంతో ఇంగ్లాండ్ జట్టు సులువుగా 200 పరుగుల మార్కును దాటింది. భారత బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ 30 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.