అన్న అపాయింట్‌మెంటా?.. ఆశ.. దోశ.. అప్పడం!

Publish Date:Oct 7, 2020

Advertisement

ఫాఫం.. గజపతిరాజుల ఫ్యామిలీ

 

ఆశకయినా ఒక హద్దుండాలి. ఆశ మంచిదే. అత్యాశ పనికిరాదు. పూసపాటి ఆనంగజపతిరాజు సతీమణి, వారి కుటుంబ రత్నం,  జగనన్నయ్య అపాయింట్‌మెంట్ దొరకలేదని అమాకంగా చెప్పడంపై, వైసీపీ నేతలు పుసిక్కున నవ్వుకుంటున్నారట. మాన్సాస్ వ్యవహారంపై తాము జగన్ కలుద్దామని ఏడాది నుంచీ ప్రయత్నిస్తున్నా, ఆయన అపాయింట్‌మెంట్ దొరకడం లేదని ఆనందగజపతి రాజు భార్య సుధా ఆనంద గజపతిరాజు, కుమార్తె ఊర్మిళ గజపతి రాజు.. తెలుగు ఏడుపుగొట్టు సీరియల్‌లో బాధిత క్యారక్టర్ల మాదిరిగా తెగ వాపోవడం చూసి, వైసీపీలో ‘ట్వల్వ్ ఇయర్స్ ఇండస్ట్రీ’లు.. తుండుగుడ్డలు నోట్లో కుక్కుకుని, తలుపేసుకుని భోరున విలపిస్తున్నారట. జగనన్నయ్యతో ఓదార్పు యాత్ర నుంచి.. ఇప్పటివరకూ వెంట ఉన్న తమకే, ఆయన దర్శనభాగ్యం దొరక్క, టన్నుల కొద్దీ కన్నీరు కారుస్తుంటే.. అసలు పార్టీకి సంబంధమే లేని తల్లీకూతుళ్లు కొత్తగా వచ్చి, ఆయన అపాయింట్‌మెంట్ దొరకడం లేదని చెప్పడం.. తమ కష్టాల పుండుపై కారం చల్లినట్లేనంటున్నారు. ఏం చేస్తాం? సీత బాధ సీతది, పీత బాధ పీతది!

 

విజయనగరంలోని మహారాజా కళాశాలను, ప్రైవేటు పరం చేయాలన్న నిర్ణయంపై పాపం తల్లీకూతుళ్లు తెగ బాధపడ్డారు. మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ సంచయిత.. తమ తాత పీవీజీ రాజు, తండ్రి ఆనంద గజపతిరాజు ఆశయాలను తుంగలో తొక్కుతున్నారని జమిలిగా వాపోయారు. అసలు మాన్సాస్ ట్రస్టు వ్యవహారాలపై సీఎం జగనన్నతో మాట్లాడాలని ఏడాది నుంచీ ప్రయత్నిస్తున్నా, ఆయన అపాయింట్‌మెంట్ దొరకడం లేదని అసలు విషయం బయటపెట్టారు. అదీ సంగతి.

 

తాత-తండ్రి సంగతి చెబితే ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ, తమ అభిమాన నాయకుడయిన జగనన్నయ్య అపాయింట్‌మెంట్ కోసం, ఏడాది నుంచీ ప్రయత్నిస్తున్నా కుదరడం లేదన్న తల్లీకూతుళ్ల మాటలే.. అన్నను అభిమానించే తమ్ముళ్లకు నచ్చడం లేదు. తాము ఎంతో ప్రేమించి, అభిమానించి, తమ గుండెలో ప్రతిష్ఠించుకున్న జగనన్నయ్యను కలవడం.. తమకే ఇంతవరకూ సాధ్యం కాక అల్లాడి ఆకులు మేస్తుంటే, మధ్యలో వచ్చిన ఈ తల్లీకూతుళ్ల గోలేమిటని జగనన్నయ్య అభిమానులు తెగ ఇదయిపోతున్నారట. అసలు జగనన్నయ్య సీఎం అయిన తర్వాత ఇప్పటివరకూ, ఆయనను ఓ పదిమంది మంత్రులు, ఓ అరడజను ఎంపీలే వన్‌టూ వన్ కలిశారట. అన్నను కలవాలని అధికారులను అడిగితే, ముందు తమకు కారణాలు చెప్పమని, సదరు అధికారులు కూపీలు తీస్తున్నారట. అంతపెద్ద ఎంపీ భీమవరం బుల్లోడు రఘురామకృష్ణంరాజుకే అపాయింట్‌మెంట్ ఇవ్వని జగనన్నయ్య..  గజపతిరాజు కుటుంబానికి ఇస్తారా? మరీ అత్యాశ కాకపోతే అని, అన్నయ్య అభిమానులు లాజిక్కు పాయింట్లు తీస్తున్నారట. నిజమే కదా మరి?

 

నిజానికి జగనన్నయ్య, మన పాత చంద్రన్నలా ఎవరినీ కలవరు. బాబన్న మాదిరిగా రోజుకు పది సమీక్షలు, రెండు పార్టీ సమీక్షలు చేయరు. సమీక్షల పేరిట సమయాన్ని సాగదీయరు. క్లారిటీ వచ్చే వరకూ ఎవరినీ సతాయించరు. అసలు జగనన్నయ్య స్టైలే వేరట. రోజుకు ఒక సమీక్ష. తర్వాత ఆయన కంప్యూటరూ, ఆ గోలనే వేరట! మంత్రయినా, ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంత లావు పార్టీ లీడరయినా సరే... ముందు నందీశ్వరులను కలవాల్సిందే. వారికి నచ్చి, మెచ్చితేనే అప్పుడు జగనన్నయ్య వద్దకు ప్రవేశపెడతారన్న ప్రచారం ఉంది. రాష్ట్రంలో ఏం జరుగుతుందో చెప్పే సర్కారీ వే గులున్నారు. వారితోపాటు,  ప్రైవేటు నివేదికలిచ్చే తన సొంత మీడియా వేగులు ఉండనే ఉన్నారు. ఇక జగనన్నయ్య దేని గురించి ఆందోళన చెందాలి?

 

ఈ మంత్రులు, ఎమ్మెల్యే, ఎంపీలు కలిస్తే.. ఆ పనులు చేయాలి, ఈ పనులు చేయాలంటూ టన్నుల కొద్దీ అర్జీలు తన ఎదుట కుమ్మరిస్తారు. అటు చూస్తే ఖజానా బాగా వీకాయె. చేస్తానని చెప్పి చేయకపోవడం తన ఇంటా వంటా లేదు. అందుకే అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరమే మేలన్నట్లు.. అసలు ఎవరినీ కలవకుండా ఉంటే ఈ సీత కష్టాలుండవు కదా? అదన్నమాట.. జగనన్నయ్య ఎవరికీ అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడానికి వెనకున్న అసలు కథ! అర్ధమవుతోందా...?

-మార్తి సుబ్రహ్మణ్యం

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.