గాఢ నిద్రలో ఉన్న ఆ కుటుంబం శాశ్వత నిద్రలోకి జారుకుంది. కుండపోతగా కురుస్తున్న వర్షానికి వారు నివసిస్తున్న ఇల్లు కుప్పకూలి కుటుంబంలోని ఆరుగురి ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ జిల్లా మౌజమ్‌పూర్ గ్రామంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. గురువారం (ఆగస్టు 6) తెల్లవారుజామున ఈ ఘోర సంఘటన జరిగింది. ఈ ప్రాంతంలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రహీస్ అనే వ్యక్తికి చెందిన రెండంతస్తుల ఇల్లు కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులలో ఇంటి యజమాని రహీస్, ఆయన భార్య, వారి పిల్లలు మరణించారు.
యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన ఆయన, బాధిత కుటుంబానికి తక్షణమే 4 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు. అలాగే, జిల్లా యంత్రాంగం నిరుపేద కుటుంబాలకు, పాత ఇళ్లలో నివసిస్తున్న వారికి వర్ష కాలంలో తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
UP rains accident, Moradabad house collapse, UP heavy rains tragedy, 6 dead in Moradabad, Uttar Pradesh news, UP house collapse
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/up-rains-accident-36-228139.html
ప్రభుత్వ పాఠశాలలో విషసర్పం కాటుకు ఎనిమిదేళ్ల విద్యార్థి బలి..!
హైదరాబాద్ నగరంలోని చెరువుల పునరుద్ధరణకు హైడ్రా మరో కీలక అడుగు వేస్తోంది
తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ బతికున్న సమయంలో ఆయనకు తగిన గౌరవం ఇవ్వలేదని మాజీ ఎంపీ వి. హనుమంతరావు ఆరోపించారు.
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన జూనియర్ కాలేజీలు.. నిబంధనలను తుంగలో తొక్కి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమా డుతున్నారు.
తాడేపల్లి ప్యాలెస్ ముందు, కాలిపోయే ఎండలో, రోడ్డు పక్కన ప్లాట్‌ఫారమ్‌పై కట్టుకున్న పెళ్లాన్ని పక్కన కూర్చోబెట్టుకుని, నాయకుల దర్శనం కోసం దేహి అని వేడుకుంటున్న
తెలంగాణ రాష్ట్ర ఇంధన రంగ చరిత్రలో సరికొత్త అధ్యాయం ఆవిష్కృతమైంది.
దేశంలో విస్తృతంగా ఉపయోగిస్తున్న యూపీఐ డిజిటల్ లావాదేవీల వినియోగానికి సంబంధించి పార్లమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది.
రాజేంద్రనగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కుమారుడు సంతోష్ గౌడ్ చేసిన ఆరోపణలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి.
ఐసీయూలో చావుబతుకుల మధ్య వైద్య విద్యార్థిని..!
నూతన రేషన్ కార్డుల రూపకల్పనలో ప్రభుత్వం మార్పులను తీసుకొచ్చింది. గతంలో ఉన్న పాత కాగితపు కార్డుల స్థానంలో లామినేషన్‌తో, డెబిట్ కార్డు సైజులోనే ఈ నూతన కార్డులను రూపొందించారు.
ప్రతిష్టాత్మక గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో రజత పతకం సాధించిన ఏపీకీ చెందిన వల్లూరి అజయ్ బాబు
చదువు కోసం ఇంటికి దూరంగా వెళ్లిన ఓ విద్యార్థిని.. తన మనసులోని బాధను తల్లిదండ్రులతో పంచుకుంది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర భావజాల వ్యాప్తికి తన జీవితాన్ని అంకితం చేసిన అమర సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరిగాయి.