కల్లుతో కరోనా మాయం! యూపీ బీఎస్పీ నేత కొత్త చిట్కా
Publish Date:Dec 22, 2020
Advertisement
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి కట్టడి కోసం అంతా ఎదురుచూస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ పంపిణి ఇప్పటికే కొన్ని దేశాల్లో ప్రారంభమైంది. భారతీయులు కోసం కరోనా టీకా కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఉత్తరప్రదేశ్ కు చెందిన బీఎస్పీ నాయకుడు మాత్రం కరోనాను ఖతం చేసేందుకు కొత్త చిట్కా చెప్పారు. కల్లుతో కరోనా మహమ్మారిని తరిమికొట్టవచ్చన్నారు బహుజన్ సమాజ్ పార్టీ నేత భీమ్ రాజ్భర్ . బల్లియా జిల్లా రాస్రాలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కల్లుకు రోగ నిరోధక శక్తి ఉందని, ఇది గంగానది కంటే స్వచ్ఛమైనదని చెప్పారు భీమ్ రాజ్ భర్. కల్లును ఎక్కువగా తాగడం వల్ల కరోనా నుంచి దూరంగా ఉండొచ్చని ప్రజలకు బీఎస్పీ నేత పిలుపునిచ్చారు. అంతేకాదు రాజ్భర్ సమాజంలో పిల్లలు కూడా కల్లు తాగుతారని చెప్పారు భీమ్ రాజ్ భర్. కల్లు తాగితే కొవిడ్ నుంచి ఈజీగా బయటపడవచ్చని చెప్పారు. గతంలో గోమూత్రానికి కరోనాను ఎదుర్కొనే శక్తి ఉందని ఓ బీజేపీ నేత చెప్పారు. ప్రతి రోజు గోమూత్రం తీసుకోవడం ద్వారా కరోనా మహమ్మారికి దూరంగా ఉండొచ్చన్న కమలం నేత కామెంట్లు అప్పట్లో వివాదాస్పదమయ్యాయి. బీఎస్పీ నేత ఓ అడుగు ముందుకేసి కల్లు తీసుకుంటే కరోనా ఖతం అని చెప్పడం చర్చగా మారింది. కల్లు తాగితే కరోనా పోతుందని బీఎస్పీ నేత మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
http://www.teluguone.com/news/content/up-bsp-leader-says-thadi-remedy-for-covid-39-108041.html





