ఆ చిత్రంలో నటించడం తప్పా?
Publish Date:May 20, 2023
Advertisement
ది కేరళ స్టోరిలో ఆసిఫా పాత్ర ధారి అయిన సొనాలీకి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. మొదట్నుంచి వివాదంలో ఉన్న ఈ చిత్రాన్ని పశ్చిమ బెంగాల్ లో నిషేధించారు. సుప్రీం జోక్యంతో నిషేధం ఎత్తివేసారు. చాలా రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ప్రదర్శించకూడదని హిందుత్వ వాదులు హెచ్చరించారు. అయితే ఎగ్జిబిటర్లే స్వయంగా చిత్రాన్నిఎత్తివేస్తున్నారు.వేశారు కూడా. ఈ చిత్రంలో అసిఫా క్యారెక్టర్లో ఉన్న సొనాలికి బెదిరింపు కాల్స్ రావడంతో ఆమె కుటుంబం మీడియా ముందుకు వచ్చింది. సొనాలి ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని నటీమణి కుటుంబం అంటోంది. సొనాలికి మోడలింగ్ చేసిన అనుభవం ఉంది. మూడు నాలుగు చిత్రాల్లో నటించింది. ది కేరళ స్టోరీని మహరాష్ట్ర , తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ప్రదర్శించాలని బిజెపి నిర్ణయించింది. వోటు బ్యాంకు రాజకీయాలను ఈ ఎన్నికల్లో నడపాలంటే చిత్రాన్ని ఉచితంగా చూయించాలని బిజెపి పన్నాగం. కేరళలో తప్పిపోయిన అమ్మాయిలు ఐసిస్ లో చేరి టెర్రరిస్ట్ లుగా మారతారు. ఇది స్టోరీ సారాంశం.వివాదానికి ఇదే కారణమైంది. చిత్రాన్ని నిషేధించడం వ్యవస్థను ప్రశ్నించడం అవుతుంది. ఇష్టమున్న వాళ్లు చిత్రాన్ని చూస్తారు. నచ్చని వాళ్లు చూడరు. సమాజానికి నష్టం వాటిల్లుతుంది అనుకుంటే కోర్టులు జోక్యం చేసుకుని నిషేధిస్తాయి. కానీ ఇవేవి జరగకుండా అందులో నటించిన తారలకు అసభ్య మెసేజ్ లు, బెదిరింపుకాల్స్ చేయడం శోచనీయం. చట్టాలను చేతుల్లో తీసుకున్న వారిని చట్ట పరిధిలో శిక్షలు వేయాలని ప్రజాస్వామిక వాదులు డిమాండ్ చేస్తున్నారు. ది కేరళ స్టోరి చిత్రంలో నటించడం తప్పా అని లౌకికవాదులు ప్రశ్నిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/unwanted-calls-from-unknown-says-actress-the-kerala-story-39-155667.html





