అనేక సమస్యలు.. వ్యర్ధమైన అనేకానేక అవకాశాలు!
Publish Date:Aug 1, 2022
Advertisement
సమస్యలు చుట్టుముట్టినపుడు వాటి నుంచి బయటపడే మర్గాన్ని ఆలోచించాలి. కానీ అవి తనకు సంబంధం లేనివని భావించి స్వలాభాపేక్షతో తిరిగితే అవే సమస్యలు ఉన్న స్థితిని దిగజారుస్తాయి. చాపకిందకి నీళ్లు వచ్చినపుడు కాకుండా ముందే సమస్యల పరిష్కారం చెప్పగలిగేవారి దగ్గరకు, సాయం చేసేవారి దగ్గరకు వెళ్లాలి. తప్ప స్నేహపూర్వకంగా నాలుగు మాటలు మాట్లాడుకుని కాఫీ తాగి నవ్వుతూ తిరిగిరావడం వల్ల ఏమాత్రం ప్రయోజనం ఉండదు. సరిగ్గా ఈ చిత్రాన్నే చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ముఖ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటి అత్తారిం టికి వెళ్లి నంత దర్జాగా హస్తిన పర్యటనలు చేస్తున్నారు కానీ అక్కడ అల్లుడు మర్యాదలు ఏవీ లభించిన దాఖలాలు లేవు. పైపెచ్చు రాష్ట్రానికి హక్కుగా రావలసిన ఏ ఒక్కదానినీ ఇవ్వకుండా అవమానాలను ఎదురిస్తున్నారు. అయినా జగన్ కిమ్మనడంలేదు. ఇదేమిటి అని ప్రశ్నించడం లేదు. అసలు రాష్ట్రానికి ఇవి కావాలి. ఇది మా హక్కు అని ఒక్కసారైనా కేంద్రాన్ని కోరారా అన్నది కూడా అనుమానమే. ఏమీ సాధించకుండా హస్తిన వెళ్లి ప్రధాని, కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు. చిరునవ్వులతో ఫొటోలకు పోజులిస్తున్నారు. అంతే అక్కడ ఏం జరిగింది. భేటీలలో ప్రస్తావనకు వచ్చిన అంశాలేమిటి అన్నది బయటకు పొక్కనీయడం లేదు. పర్యటనలన్నీ ఏదో సొంత వ్యవహారమన్నట్లు సాగించేస్తు న్నారు. అంతులేని రహస్యాన్ని మెయిన్టైన్ చేస్తున్నారు. దీనినే విపక్షాలు నిలదీస్తున్నాయి. ప్రశ్నిస్తు న్నాయి. విమర్శలు గుప్పిస్తున్నాయి. అయినా జగన్ బేఖాతరు చేస్తున్నారు. రాష్ట్రం ఎదుర్కొం టున్న అనేకానేక విభజన సమస్యల పరిష్కారం విషయంలో ఈ మూడేళ్లలో వచ్చిన అనేక అవకాశాలను ఆయన వ్యర్థం చేశారు. అడగకుండానే కేంద్ర నిర్ణయాలన్నిటికీ డూడూ బసవన్నలా తలూపేయడానికి కారణమేమిటని విపక్షాలు నిలదీస్తున్నా జగన్ బే ఫర్వాగానే వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి గత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అప్పటి మిత్రపక్షం బీజేపీతోనూ.. భాగస్వామ్య పక్షంగా ఉండి కూడా ఎన్డీయే సర్కార్ తోనూ రాష్ట్రానికి న్యాయంగా రావలసిన నిధులు, హోదా ఇవ్వడం లేదనే విభేదించారు. పోట్లాడారు. కోట్లాడారు. నిలదీశారు. ప్రశ్నించారు. ఆ కారణంగానే ఆయనకు ప్రధాని నరేంద్రమోడీ అపాయింట్ మెంట్ కూడా దక్కలేదు. ఇప్పుడు జగన్ కేంద్రంలోని ఎన్డీయేలో భాగ స్వామ్య పక్షం కాదు. కనీసం రాష్ట్రంలో బీజేపీతో మైత్రి కూడా లేదు. అయినా సరే రాష్ట్ర హక్కుల కోసం నోరిప్పడం లేదు. విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేస్తాం అంటే నవ్వుతూ వింటున్నారు. విశాఖ రైల్వే జోన్ ఇవ్వడం లేదని పార్లమెంటు సాక్షిగా కేంద్రం కుండబద్దలు కొట్టినా మొహం మీద చిర్నవ్వును చెరగనీయడం లేదు. వ్యవసాయ విద్యుత్ మీటర్లకు మోటార్లు బిగించాలని ఆలోచిస్తున్నాం అని కేంద్రం అనగానే ఇక్కడ బిగించేస్తున్నారు. అంతగా అడుగులకు మడుగులొత్తినా రాష్ట్రానికి ఆయన సాధించు కువచ్చిన ప్రయోజనం శూన్యమే. తెలుగు రాష్ట్రాల మధ్య ఆస్తుల విభజన, విభజన అంశాలను త్వరగా పరిష్కరించాలని కేంద్ర మంత్రి అమిత్ షాను కలి సిన ప్రతీసారీ జగన్ కోరారని వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారేగాని, ఫలితం దక్కనే లేదు. విశాఖ రైల్వే జోన్ విషయంలోనూ కేంద్రం చేతులు ఎత్తేసింది. దాని మాట తెరమీదకి వచ్చినపుడల్లా రాష్ట్రంలో ఏదో ఒక సమస్యను ప్రశ్నించడంతో ఇక్కడి బీజేపీ నేతలు ఆ సంగతిని మర్చిపోయేలా చేస్తున్నారు. ఇదంతా ప్రభుత్వం తమ బాధ్యతగా కేంద్రాన్ని ప్రశ్నించలేకపోవడం వల్ల తలెత్తిన పరిస్థితులని విశ్లేషకులు అంటున్నారు. కేవలం తన రాజకీయ పరపతి, సుస్థిరత కోసమే కేంద్ర నాయకులను కలవడం తప్ప ఈ సమస్యల గురించి వీసమెత్తు ధైర్యంగా ప్రశ్నించిన సమయమే ఆయనకు చిక్కలేదా అని విశ్లేషకులు ప్రశ్ని స్తున్నారు.
http://www.teluguone.com/news/content/unsolved-problems-wasting-chances-39-141005.html





