అనేక స‌మ‌స్య‌లు.. వ్య‌ర్ధ‌మైన‌ అనేకానేక అవ‌కాశాలు!

Publish Date:Aug 1, 2022

Advertisement

స‌మ‌స్య‌లు చుట్టుముట్టిన‌పుడు వాటి నుంచి బ‌య‌ట‌ప‌డే మ‌ర్గాన్ని ఆలోచించాలి. కానీ అవి త‌న‌కు సంబంధం లేనివని భావించి స్వ‌లాభాపేక్ష‌తో తిరిగితే అవే స‌మ‌స్య‌లు ఉన్న స్థితిని దిగ‌జారుస్తాయి. చాప‌కింద‌కి నీళ్లు వ‌చ్చిన‌పుడు కాకుండా ముందే స‌మ‌స్య‌ల ప‌రిష్కారం చెప్ప‌గ‌లిగేవారి ద‌గ్గ‌ర‌కు, సాయం చేసేవారి ద‌గ్గ‌ర‌కు వెళ్లాలి. త‌ప్ప స్నేహ‌పూర్వ‌కంగా నాలుగు మాట‌లు మాట్లాడుకుని కాఫీ తాగి న‌వ్వుతూ తిరిగిరావ‌డం వ‌ల్ల ఏమాత్రం ప్ర‌యోజ‌నం ఉండ‌దు. స‌రిగ్గా ఈ చిత్రాన్నే చూస్తున్నారు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లు.

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ రెడ్డి ముఖ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి  నుంచి   ఇప్పటి అత్తారిం టికి వెళ్లి నంత దర్జాగా హస్తిన పర్యటనలు చేస్తున్నారు కానీ అక్కడ అల్లుడు మర్యాదలు ఏవీ లభించిన దాఖలాలు లేవు. పైపెచ్చు రాష్ట్రానికి హక్కుగా రావలసిన ఏ ఒక్కదానినీ ఇవ్వకుండా అవమానాలను ఎదురిస్తున్నారు. అయినా జగన్ కిమ్మనడంలేదు. ఇదేమిటి అని ప్రశ్నించడం లేదు. అసలు రాష్ట్రానికి ఇవి కావాలి. ఇది మా హక్కు అని ఒక్కసారైనా కేంద్రాన్ని కోరారా అన్నది కూడా అనుమానమే.

ఏమీ సాధించకుండా హస్తిన వెళ్లి ప్రధాని, కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు. చిరునవ్వులతో ఫొటోలకు పోజులిస్తున్నారు. అంతే అక్కడ ఏం జరిగింది. భేటీలలో ప్రస్తావనకు వచ్చిన అంశాలేమిటి అన్నది బయటకు పొక్కనీయడం లేదు. పర్యటనలన్నీ ఏదో సొంత వ్యవహారమన్నట్లు సాగించేస్తు న్నారు. అంతులేని రహస్యాన్ని  మెయిన్టైన్ చేస్తున్నారు.  దీనినే విపక్షాలు నిలదీస్తున్నాయి. ప్రశ్నిస్తు న్నాయి. విమర్శలు గుప్పిస్తున్నాయి. అయినా జగన్ బేఖాతరు చేస్తున్నారు. రాష్ట్రం ఎదుర్కొం టున్న అనేకానేక విభజన సమస్యల పరిష్కారం విషయంలో ఈ మూడేళ్లలో వచ్చిన అనేక అవకాశాలను ఆయన వ్యర్థం చేశారు. అడగకుండానే కేంద్ర నిర్ణయాలన్నిటికీ డూడూ బసవన్నలా తలూపేయడానికి కారణమేమిటని విపక్షాలు నిలదీస్తున్నా జగన్ బే ఫర్వాగానే వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి గత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అప్పటి మిత్రపక్షం బీజేపీతోనూ.. భాగస్వామ్య పక్షంగా ఉండి కూడా ఎన్డీయే సర్కార్ తోనూ రాష్ట్రానికి న్యాయంగా రావలసిన నిధులు, హోదా ఇవ్వడం లేదనే విభేదించారు. పోట్లాడారు. కోట్లాడారు. నిలదీశారు. ప్రశ్నించారు. ఆ కారణంగానే ఆయనకు ప్రధాని నరేంద్రమోడీ అపాయింట్ మెంట్ కూడా దక్కలేదు. ఇప్పుడు జగన్ కేంద్రంలోని ఎన్డీయేలో భాగ స్వామ్య పక్షం కాదు. కనీసం రాష్ట్రంలో బీజేపీతో మైత్రి కూడా లేదు. అయినా సరే రాష్ట్ర హక్కుల కోసం నోరిప్పడం లేదు. విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేస్తాం అంటే నవ్వుతూ వింటున్నారు. విశాఖ రైల్వే జోన్ ఇవ్వడం లేదని పార్లమెంటు సాక్షిగా కేంద్రం కుండబద్దలు కొట్టినా మొహం మీద చిర్నవ్వును చెరగనీయడం లేదు. వ్యవసాయ విద్యుత్ మీటర్లకు మోటార్లు బిగించాలని ఆలోచిస్తున్నాం అని కేంద్రం అనగానే ఇక్కడ బిగించేస్తున్నారు. అంతగా అడుగులకు మడుగులొత్తినా రాష్ట్రానికి ఆయన సాధించు కువచ్చిన ప్రయోజనం శూన్యమే.  

తెలుగు రాష్ట్రాల మ‌ధ్య ఆస్తుల విభ‌జ‌న, విభ‌జ‌న అంశాల‌ను త్వ‌ర‌గా ప‌రిష్క‌రించాల‌ని కేంద్ర మంత్రి అమిత్  షాను  క‌లి సిన ప్ర‌తీసారీ జ‌గ‌న్ కోరార‌ని వైసీపీ నేత‌లు ప్ర‌చారం చేస్తున్నారేగాని,  ఫ‌లితం ద‌క్క‌నే లేదు.  విశాఖ రైల్వే జోన్ విష‌యంలోనూ కేంద్రం చేతులు ఎత్తేసింది. దాని మాట తెర‌మీద‌కి వ‌చ్చిన‌పుడ‌ల్లా రాష్ట్రంలో ఏదో ఒక స‌మ‌స్య‌ను ప్ర‌శ్నించ‌డంతో ఇక్క‌డి బీజేపీ నేత‌లు ఆ సంగ‌తిని మ‌ర్చిపోయేలా చేస్తున్నారు. ఇదంతా ప్ర‌భుత్వం త‌మ బాధ్య‌త‌గా కేంద్రాన్ని ప్ర‌శ్నించ‌లేక‌పోవ‌డం వ‌ల్ల త‌లెత్తిన ప‌రిస్థితుల‌ని విశ్లేష‌కులు అంటున్నారు.  

కేవ‌లం త‌న రాజ‌కీయ ప‌ర‌ప‌తి, సుస్థిర‌త కోస‌మే కేంద్ర నాయ‌కుల‌ను క‌ల‌వ‌డం త‌ప్ప ఈ స‌మ‌స్య‌ల గురించి వీస‌మెత్తు ధైర్యంగా ప్ర‌శ్నించిన స‌మ‌యమే ఆయనకు చిక్కలేదా అని విశ్లేష‌కులు ప్రశ్ని స్తున్నారు.

By
en-us Political News

  
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 నామినేషన్ల ఉపసంహరణ గడువు  ముగిసే నాటికి  రాష్ట్ర వ్యాప్తంగా  77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు.  గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 
 2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్   ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో  పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.