పొత్తులుంటాయి కేంద్ర మంత్రి.. చులకన కాదల్చుకోలేదు.. బాబు

Publish Date:Jul 12, 2023

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ గందరగోళం సృష్టించడమే లక్ష్యంగా వైసీపీ, బీజేపీలు అడుగులు వేస్తున్నాయా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. వచ్చే ఎన్నికలలో  రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుందన్న అంచనాల నడుమ మరో సారి అధికారాన్ని దక్కించుకోవడానికి వైసీసీ ఆడుతున్న మైండ్ గేమ్ కు బీజేపీ తోడైందంటున్నారు. అటువంటి మైండ్ గేమ్ లో భాగంగానే తాజాగా రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి నారాయణ స్వామి తెలుగుదేశం, జనసేనలతో బేజీపీ పొత్తు ఉంటుందన్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకు నిదర్శనంగా ఎవరు పడితే వారు చేసే వ్యాఖ్యలకు స్పందించబోనని ,అలా స్పందించి చులకన కాబోననీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు చెప్పడాన్ని ప్రస్తావిస్తున్నారు. 

కేంద్రంలోని మోడీ సర్కార్ తో  వైసీపీ అత్యంత సన్నిహిత సంబంధాలు నెరపడం, రాష్ట్రంలో మాత్రం ఆ పార్టీ నేతలు, రాష్ట్రపర్యటనకు వచ్చిన ఆ పార్టీ అగ్రనేతలు జగన్ సర్కార్ పై విమర్శల వర్షం కురిపించడం ప్రజలలో  కన్ఫ్యూజన్ క్రియోట్ చేయడమనే వ్యూహంలో భాగమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత తొమ్మిదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న నేపథ్యంలో మరో సారి అధికారంలోకి రావాలంటే మిత్రులను చేర్చుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. పేరుకే కేంద్రంలో ఉన్నది  బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ అయినా.. ప్రస్తుతం ఎన్డీయే భాగస్వామ్య పక్షాలుగా ఉన్న పార్టీలేవీ సొంతంగా ఒకింత బలం ఉన్న పార్టీలు కావు. లోక్ సభలో వాటి ప్రాతినిథ్యం సింగిల్ డిజిట్ కే పరిమితమైన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో  బీజేపీ జాతీయ స్థాయిలో విపక్షాల ఐక్యతను అధిగమించి బలం చాటాలంటే ఎన్డీయేను పటిష్టం చేసుకోక తప్పని పరిస్థితి. మరో వైపు ఇటీవలి కాలం వరకూ బలహీనంగా కనిపించిన కాంగ్రెస్, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ఒక్కసారిగా బలోపేతం అయ్యాయి.

కేంద్రంలోని మోడీ సర్కార్ పట్ల వ్యక్తమౌతున్న ప్రజా వ్యతిరేకతే ఇందుకు కారణమని వేరేగా చెప్పాల్సిన  అవసరం లేదు.  ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ పాత మిత్రులను దరి చేర్చుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలతో ఈ నెల 18న సమావేశం కూడా ఏర్పాటు చేసింది. కేంద్రంలో మోడీ సర్కార్ పదవీ పగ్గాలు చేపట్టిన తరువాత ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశం జరగడం ఇదే తొలిసారి. ప్రస్తుతం ఉన్న బలం సరిపోదన్న ఉద్దేశంతో పాత మిత్రులను కూడా కలుపుకోవడానికి చేసే ప్రయత్నంలోనే బీజేపీ తెలుగుదేశం పార్టీకి దగ్గర కావడానికి ప్రయత్నాలు ప్రారంభించిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏపీలో ఒకే సమయంలో అధికార, విపక్షాలతో సంబంధాలను నెరపుతూ.. అవసరాన్ని బట్టి.. అంటే వచ్చే ఎన్నికలలో   వైసీపీ, తెలుగుదేశంల పెర్ఫార్మెన్స్ ను బట్టి, తన అవసరాలను బట్టి జట్టు కట్టాలన్న వ్యూహంతో కమలనాథులు పావులు కదుపుతున్నారన్నది పరిశీలకుల విశ్లేషణ. అందులో భాగంగానే బీజేపీ అగ్రనేతలు ఏపీలో ఒకలా, హస్తినలో ఒకలా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు.

కేంద్రం స్థాయిలో జగన్ సర్కార్ కు అన్ని విధాలుగా సహకారం అందిస్తూనే.. రాష్ట్రం దగ్గరకు వచ్చేసరికి వైసీపీ పాలనపై విమర్శలు గుప్పిస్తూ కర్రవిరగకుండా, పాము చావకుండా అన్న టెక్నిక్ ను ఉపయోగిస్తోందంటున్నారు. మొత్తం మీద కేంద్ర మంత్రి నారాయణ స్వామి వ్యాఖ్యలపై చంద్రబాబు నిక్కచ్చిగా, నిర్మొహమాటంగా స్పందించడమే కాకుండా   దగాపడ్డ ఏపీ రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యమని కుండబద్దలు కొట్టారు.

  ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి జగన్ దుర్మార్గపాలనను అంతమొందించడమే తన ధ్యేయమని చెప్పారు. ఇదొక పెద్ద బాధ్యత అందుకే పెద్ద ఆలోచనలూ చేయాలి.  పోరాడితే కేంద్రం దిగొస్తుందనడానికి జల్లికట్టు ఘటనే ఉదాహరణ.  జగన్.. ఆ స్థాయి పోరాటానికి కనీస ప్రయత్నం కూడా చేయలేదన్న చంద్రబాబు,    ఓట్ల అవకతవకలపై ఢిల్లీని వదిలిపెట్టేది లేదన్నారు. ఓట్ల తీసివేత, దొంగ ఓట్ల నమోదులను సరిదిద్దకపోతే కేంద్ర ఎన్నికల సంఘం విశ్వసనీయత కోల్పోతుందన్నారు. ఇక తెలుగుదేశం అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తుందంటూ జరుగుతున్న ప్రచారాన్ని సైతం ఆయన ఖండించారు.  వలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుందనీ, వలంటీర్ల ఉద్యోగాలకు ఢోకా లేదనీ భరోసా ఇస్తూనే వాలంటీర్ల సేవలను పౌర సేవలకు మాత్రమే ఉపయోగించుకుంటామని స్పష్టం చేశారు. మొత్తంగా ఆయన కేంద్ర మంత్రి నారాయణ స్వామి వ్యాఖ్యలపై స్పందించి చులకన కాదలచుకోలేదంటూనే ప్రజలలో కన్ఫ్యూజ్ క్రియోట్ చేయడానికి జగన్ సర్కార్ ఆడుతున్న మైండ్ గేమ్ ను ఎండగట్టారు. ప్రజా వ్యతిరేక జగన్ సర్కార్ ను గద్దెదించడమే లక్ష్యంగా రాజీలేకుండా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. 

By
en-us Political News

  
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.