హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణకు డీపీఆర్ త్వరగా ఇవ్వాలని అధికారులను కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సూచించారు. అప్పుడే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయని కిషన్రెడ్డి పేర్కొన్నారు. కేంద్రంతోపాటు అంతర్జాతీయ సంస్థల నుంచి నిధులు తెచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. హైదరాబాద్-విజయవాడ హైవేను 6 లైన్లుగా మార్చే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. గత పదేళ్లుగా నేషనల్ హైవేలను అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. తెలంగాణలోని 33 జిల్లాలలో 32 జిల్లాల నుంచి జాతీయ రహాదారులు వెళ్తున్నట్టు వెల్లడించారు. రోడ్లు అభివృద్ధి చెందినప్పుడే పెట్టుబడులు వస్తాయని తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రహదారుల అనుసంధానం అన్నింటికంటే చాలా ముఖ్యమైనది అన్నారు.
అందుకే వాజ్ పేయి హయాంలో ఎన్డీఏ ప్రభుత్వం స్వర్ణ చతుర్భుజి పథకాన్ని తీసుకొచ్చిందని.. 2004లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దానిని నిలిపివేసింది. రోడ్ల నిర్మాణం పై రూ.లక్షల కోట్లు ఎందుకు అని ఆనాడు విమర్శించారు. 2014లో తెలంగాణలో 2500 కిలోమీటర్ల మేరకు జాతీయ రహదారులుండేవి. పదేళ్ల తరువాత అవి 5200 కిలోమీటర్లకు చేరుకున్నాయి. తెలంగాణలో రింగ్ రోడ్ల అభివృద్ధి జరుగుతోంది. అనుసంధానం కోసం కేంద్ర ప్రభుత్వం ఎక్కువ నిధులు ఖర్చు చేస్తోంది. పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్న అన్ని ప్రాంతాలకు రహదారులు నిర్మిస్తామని.. హైదరాబాద్ – శ్రీశైలం మధ్య ప్రయాణ సమయం తగ్గించే రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/union-minister-kishan-reddy-25-197396.html
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.