Publish Date:Aug 28, 2024
ఆంధ్రప్రదేశ్ కు గుడ్ న్యూస్. రాష్ట్రానికి జీవనాడి వంటి పోలవరం నిర్మాణం ఇక ఏ అడ్డంకులూ లేకుండా సాఫీగా సాగనుంది. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం నిర్మాణానికి అవసరమైన నిధులను విడుదల చేయడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పటికే పెండింగ్ లో ఉన్న నిధులనే కాకుండా ప్రాజెక్టు నిర్మాణం సత్వరంగా పూర్తి కావడానికి అవసరమైన నిధులను కూడా ఎటువంటి జాప్యం లేకుండా విడుదల చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది.
ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన ఢిల్లీలో బుధవారం (ఆగస్టు 28) జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో పోలవరం మొదటి దశ నిర్మాణానికి 12వేల 500 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయడానికి ఆమోదం తెలిపింది. అలాగే ఇాప్పటి వరకూ పెండింగ్ లో ఉన్న నిధులను కూడా విడుదల చేయాలని నిర్ణయించింది.
జగన్ హయాంలో గత ఐదేళ్లుగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే అన్న చందంగా నిలిచిపోయాయి. దానికి తోడు నిర్వహణ కూడా లేకపోవడంతో డయాఫ్రం వాల్ దెబ్బతింది. సజావుగా సాగుతున్న పోలవరం నిర్మాణాన్ని జగన్ సర్కార్ రివర్స్ టెండరింగ్ పేరుతో నిలిపివేసిన సంగతి తెలిసిందే. అలాగే ముంపు బాధితుల పరిహారం నిధులను కూడా పక్కదారి పట్టించింది. ఇప్పుడు రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో పనులు జోరందుకున్నాయి. సీఎం చంద్రబాబు కూడా పోలవరం, అమరావతి నిర్మాణాలను అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రత్యేక దృష్టి సారించారు. సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయన తొలి పర్యటన పోలవరం సందర్శనే కావడమే ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఆయన ఇస్తున్న ప్రాధాన్యత ఏమిటన్నది అవగతమౌతుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/union-cabinet-green-signal-to-release-polavaram-funds-39-183799.html
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని.
అయితే ఆయన తాజాగా నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు, వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో కలకలం రేపింది.
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు. ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం.
Publish Date:Sep 30, 2026
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.
Publish Date:Sep 30, 2026
గత కొన్నేళ్లుగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు. ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు.