తెలుగుదేశం కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై యూనికార్న్ సర్వే.. 60 శాతానికి పడిపోయిన రేటింగ్!

Publish Date:Jun 23, 2026

Advertisement

తెలుగువన్ ఎక్స్ క్లూజివ్

ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో ప్రముఖ సర్వే సంస్థ  యూనికార్న్ పొలిటికల్ స్ట్రాటజీ సంచలన నివేదికను బయటపెట్టింది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో బాగానే సాగుతున్నప్పటికీ, ప్రజల్లో ప్రభుత్వ పనితీరుపై సంతృప్తి గ్రాఫ్ ఆందోళనకరంగా పడిపోయిందని ఈ సర్వే పేర్కొంది. 100 శాతం సంతృప్తి ఆశించిన చోట ప్రభుత్వ ప్రస్తుత రేటింగ్ కేవలం 60 శాతం (5.9 మార్కులు) లోపు మాత్రమే నమోదవ్వడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

దీనిపై తెలుగువన్ తో ప్రత్యేకంగా మాట్లాడిన యూనికార్న్ పొలిటికల్ స్ట్రాటజీ అధినేత రవి..  కూటమి ప్రభుత్వంలో పరిపాలనా లోపాలు, రాజకీయ సమన్వయ లేమి స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. గతంలో ఆర్టీజీఎస్  వంటి డిజిటల్ వ్యవస్థల ద్వారా లభించిన 80 శాతం ప్రజా సంతృప్తి కేవలం కాగితాలకే పరిమితమైందనీ..  డిజిటల్ కనెక్టివిటీ పెరిగి భౌతిక సంబంధాలు  దెబ్బతినడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని తమ సర్వేలో తేలిందని చెప్పారు. కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాల్లో ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ సెల్స్‌కు గత ఏడెనిమిదేళ్లుగా ఒకే రకమైన ఫిర్యాదులు రావడం అధికారుల వైఫల్యానికి అద్దం పడుతోందన్నారు. 

తమ సర్వేలో ముఖ్యంగా క్యాబినెట్‌లో సీనియర్లు, జూనియర్ల మధ్య ఉన్న సమన్వయ లోపాలు ప్రస్ఫుటంగా బయటపడ్డాయన్నారు. 2024 అధికార మార్పిడి తర్వాత యువ రక్తాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో జూనియర్లకు మంత్రి పదవులు ఇచ్చినప్పటికీ..  వారు జిల్లాల్లో పట్టు సాధించలేకపోతున్నాని తేలిందని చెప్పారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో తలెత్తిన డయేరియా వంటి తీవ్ర ప్రజా సమస్యలను పరిష్కరించే క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లాంటి అగ్రనేతలు వెళ్లినప్పుడు, స్థానిక సీనియర్ నేత కళా వెంకట్రావు వంటి వారి అనుభవాన్ని వాడుకోలేకపోయారని విశ్లేషించారు. సీనియర్ల అనుభవంతో జూనియర్ల ఉత్సాహాన్ని మిక్స్ చేయడంలో ప్రభుత్వం విఫలమైందనే అభిప్రాయం ప్రజలలో వ్యక్తమైందన్నారు. 

అటు కడప జిల్లాలో జూనియర్ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి లాంటి వారు జిల్లా రాజకీయాలను ప్రభావితం చేయలేకపోతున్నారని, రాయలసీమలో సామాజిక సమతుల్యత లోపించిందని తమ సర్వేలో వెల్లడైందని చెప్పారు.   అలాగే, నెల్లూరు జిల్లాలో తమిళనాడు బోట్ల వివాదం, మత్స్యకారుల ఆందోళనలు, కార్పొరేట్ పాలిటిక్స్ కారణంగా ఇంటర్నల్ డ్యామేజ్ తీవ్రంగా జరుగుతోందనీ.. ఆనం రామనారాయణ రెడ్డి వంటి సీనియర్లను ఇలాంటి సమస్యల పరిష్కారానికి టాస్క్‌గా ఉపయోగించుకోవడంలో ప్రభుత్వం వెనుకబడిందని రవి విశ్లేషించారు.

మరోవైపు.. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు, లోకేష్‌లపై నమోదైన సీఐడీ కేసుల దర్యాప్తుకు సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ వైఫల్యాలను కూడా రవి వివరించారు.  ప్రస్తుతం సీఐడీ విభాగానికి డీజీ ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో సిబ్బంది లేకపోవడం, 13 జిల్లాల్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు లేకపోవడం, గత ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసిన ఐఓలు (ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్) ఇప్పుడు  కేసులను క్లోజ్ చేసేలా నివేదికలు ఇవ్వడం వంటివి కూటమి శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తిని రగిలిస్తున్నాయనిరవి విశ్లేషించారు. సీనియర్ ఐపీఎస్ అధికారి రవిశంకర్ అయ్యన్నార్ లాంటి సమర్థులను సరైన స్థానాల్లో ఉపయోగించుకోకపోవడం, రిటైర్డ్ అధికారులకు ఎక్స్టెన్షన్స్ ఇవ్వడం వల్ల క్రింది స్థాయి అధికారుల ప్రమోషన్లు ఆగిపోయి డిపార్ట్‌మెంట్‌లో నైరాశ్యం అలుముకుందని సర్వే స్పష్టం చేసింది.

ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం కేవలం సంక్షేమ పథకాల ఆధారంగానే బండి లాగిస్తోందనీ, రాజకీయంగా ఎదురవుతున్న అంతర్గత సవాళ్లను చల్లార్చడంలో విఫలమవుతోందని తన సర్వే నివేదిక తేటతెల్లం చేసిందని రవి చెప్పారు.  రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, ఆపై 2029 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని క్షేత్రస్థాయి కార్యకర్తలను బలోపేతం చేసుకోకపోతే, ఈ రేటింగ్స్ మరింత దిగజారి ప్రభుత్వానికి ప్రమాద ఘంటికలు మోగడం ఖాయమనీ,  సీఎం చంద్రబాబు నాయుడు ఆశిస్తున్న 100 శాతం టాప్ ర్యాంక్ సాధించాలంటే కేవలం "పాస్ మార్కులు" సరిపోవని, తక్షణమే పరిపాలన, రాజకీయ సమన్వయంలో సమూల మార్పులు చేయాలని తమ సర్వే నివేదికలో తేలిందని   యూనికార్న్ పొలిటికల్ స్ట్రాటజీ అధినేత రవి స్పష్టం చేశారు. 

By
en-us Political News

  
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల వరకు ప్రస్తుత రాజకీయ చిత్రం ఎంతో ఉత్కంఠభరితంగా మారింది.
అమరావతి కేవలం ప్రజా రాజధాని మాత్రమే కాదు..  దేవతల రాజధాని కూడా అని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల నుంచి, ప్రముఖ పుణ్యక్షేత్రాల నుంచి పవిత్ర మట్టి , జలాలను సేకరించి ఇక్కడ పవిత్ర పూజలు నిర్వహించిన విషయాన్ని ప్రస్తావించారు.
జగన్ హయాంలో పాలన అంటే పంచడం, పంచుకోవడం అన్న చందంగా పరిస్థితి ఉండేది. దాంతో జగన్ హయాంలో రాష్ట్రానికి కొత్తగా పెట్టుబడులు ఏవీ రాలేదు సరికదా.. ఉన్నవి కూడా తరలిపోయాయి. అసలు అప్పట్లో ఏపీ వైపు చూడాలంటేనే పారిశ్రామిక వేత్తలు భయపడేలా పరిస్థితులు ఉండేవి.
65 సెంట్ల భూమి విషయంలో కోర్టుకు వెళ్లిన రైతులపై చంద్రబాబుకు ప్రేమ లేదంటూ పేర్ని నాని ఈ సందర్భంగా విమర్శించారు. కానీ వేల ఎకరాలు రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్ ద్వారా భూమిని ఇచ్చిన రైతుల విషయంలో జగన్ హయాంలో జరిగిందేంటి?
ర్యాలీకి ముందుగానే గుడివాడ వన్ టౌన్ ఎస్ఐ వీవీ సత్యనారాయణ మాజీ మంత్రి కొడాలి నానికి నోటీసులు అందజేశారు. అయితే ఆ నోటీసులను ఖాతరు చేయకుండా..  వైసీపీ శ్రేణులు, మద్దతుదారులతో   పార్టీ క్యాంప్ ఆఫీస్ దిశగా ముందుకు సాగారు.
తాజాగా  భారత్ జన వికాస్  పేరిట ఆయన ఒక కొత్త జాతీయ పార్టీ ఆలోచన వెనుక వేరే వ్యూహం ఉందన్నారు. వైసీపీ అధినేత జగన్ పై ఒత్తిడి పెంచి, లేదా బ్లాక్ మెయిల్ చేసి పార్టీలో లేదా ఢిల్లీ నెట్‌వర్క్ బాధ్యతల్లో తిరిగి పట్టు సాధించేందుకు చేస్తున్న ప్రయత్నమా అన్న అనుమానాన్ని భరద్వాజ వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో  జగన్   రాజకీయ వ్యూహం కూటమి ప్రభుత్వానికి అర్థమవుతోందా అనే అంశంపై ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ఆంధ్రప్రదేశ్ మేధావుల వేదిక కన్వీనర్ చలసాని శ్రీనివాస్ తెలుగువన్ న్యూస్ చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. 
 శాసనసభ సమావేశాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నప్పటికీ, శాసనమండలి   సమావేశాలకు మాత్రం పూర్తిస్థాయిలో హాజరుకావాలని వైసీపీ  నిర్ణయం తీసుకుంది. శాసనమండలిలో తమ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉండటంతో, అక్కడ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని యోచిస్తోంది.
తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఆ పార్టీలో అత్యంత కీలక పాత్రలను పోషిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ అల్లుడు నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం అధినేతగా, ఆయన కుమారుడు, ఎన్టీఆర్ మనవడు నారా లోకేష్ పార్టీ జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. ఇక ఎన్టీఆర్ కుమారుడు నందమూరి బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. ఇక ఎన్టీఆర్ మరో కుమారుడు దివంగత హరికృష్ణ కుమార్తె సుహాసిని పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నారు.
వైసీపీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ అభ్యర్థిగా తూమాటి మాధవరావు..!
నాలుగు దశాబ్దాలకు పైగా వైఎస్ కుటుంబానికీ, జగన్ కు పెట్టని కోటగా ఉన్న పులివెందులలో జగన్ ప్రతిష్ఠ పూర్తిగా మసకబారింది. ఇటీవల ఏపీ ప్రభుత్వం చేపట్టిన మెగా డీఎస్సీ ప్రక్రియ, విద్యాశాఖ నిర్ణయాలకు వ్యతిరేకంగా వైసీపీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంా జరుగుతున్న నిరసనలు పులివెందులలో తుస్సు మన్నాయి.
అమరావతి నిర్మాణ పనులు వేగంగా ముందుకు సాగుతుండటం.. సహజంగానే వైసీపీయులకు మింగుడు పడటంలేదు. ఆ క్రమంలోనే.. వైసీపీ అధినేత జగన్.. అమరావతి కాదు మావిగన్ రాజధాని అంటూ ప్రతిపాదన చేసి నవ్వుల పాలయ్యారు.
మాజీ మంత్రి జనసేన నాయకుడు బాలినేని తీరు పట్ల ఇటు తెలుగుదేశంలోనూ, అటు జనసేనలోనూ ఆగ్రహం వ్యక్తం అవుతోంది. 2024 ఎన్నికల తరువాత బాలినేని శ్రనివాసరెడ్డి.. వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేన గూటికి చేరారు. ఆ ఎన్నికలలో ఒంగోలు ఎమ్మెల్యేగా దామచర్ల జనార్దన్ రావు ఎన్నికయ్యారు. బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్ కు బంధువు కావడం, 2024 ఎన్నికలలో తనకు ప్రత్యర్థి కావడంతో అప్పట్లోనే దామచర్ల జనసేనలోకి బాలినేని ఎంట్రీని వ్యతిరేకించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.