వారెవా.. నదిలో మెట్రో రైల్ సొరంగ మార్గం...
Publish Date:Apr 7, 2022
Advertisement
చుట్టూ వాటర్. మధ్యలో మెట్రో రైల్. చుట్టూ జలచరాలు. మెట్రోలో ప్రయాణికులు. అలా నది మధ్యలోంచి రైలు దూసుకుపోతుంటే.. ఆ మజానే వేరు. ఇంకో లెవెల్. అలాంటి అద్భుతమే త్వరలోనే మన దగ్గరా అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ప్రముఖ నగరాల్లో మెట్రోలు పరుగులు పెడుతుంటే.. కొత్తగా రాబోతున్న కోల్‌కతా మెట్రో రైల్ ఏకంగా నదీ గర్బంలో ప్రయాణించడానికి రెడీ అవుతోంది. దేశంలోనే మొదటిసారిగా కోల్‌కతాలోని హుగ్లీ నది అడుగున మెట్రోరైలు మార్గం కోసం సొరంగం నిర్మాణం చేపట్టారు. హౌరా- కోల్‌కతాల మధ్య మెట్రో కనెక్టివిటీ కోసం హుగ్లీ నదిలో, నీటి అడుగున సొరంగం నిర్మాణం జరుగుతోంది. 16.6 కిలోమీటర్ల పొడవున.. 520 మీటర్ల లోతున.. హుగ్లీ నదిలో మెట్రో రైల్ సొరంగాన్ని నిర్మిస్తున్నారు. 33 మీటర్ల లోతులో హుగ్లీ నది కింద మెట్రో స్టేషన్‌ను నిర్మిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణీకులను తరలించడానికి సొరంగాలలో నడక మార్గాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. వాటర్ టన్నెల్ ప్రాంతంలో సాంకేతిక సమస్య తలెత్తితే ప్రత్యేక మార్గం ద్వారా ప్యాసింజర్స్‌ను బయటకు పంపించవచ్చు. 2023 కల్లా పనులు పూర్తయి.. ప్రజలకు అందుబాటులోకి రానుంది కోల్‌కతా-హుగ్లీ మెట్రో రైల్ ప్రాజెక్ట్.
http://www.teluguone.com/news/content/under-water-metro-rail-tunnel-in-kolkata-39-134055.html





