మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మరోసారి తన వైసీపీ అనుకూల వైఖరిని బయటపెట్టుకున్నారు. స్వయం ప్రకటిత మేధావి అయిన ఉండవల్లి అరుణ్ కుమార్ వైసీపీ అధికారంలోకి రావాలంటే ఏం చేయాలో ఎవరూ అడగకుండానే చెప్పేశారు.
రాజకీయం అంటే కేవలం అధికారంలో ఉండటం మాత్రమే కాదని, ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ ముందుకు సాగాలని వైసీపీకి హితవు పలుకుతున్నట్లుగా మాట్లాడుతూనే.. ఆ పార్టీకి కర్తవ్యబోధ చేశారు. ఇంతకీ ఆయన చెప్పిందేమిటంటే.. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావాలన్నా, జగన్ ముఖ్యమంత్రిగా ఉండాలన్నా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి విచ్ఛిన్నం కావాలని చెప్పారు. అంటే ఒక రకంగా కూటమిని విచ్ఛిన్నం చేయడమొక్కటే వైసీపీ రాజకీయ ఎజెండా కావాలని ఆయన జగన్ కు ఉద్బోధించారన్న మాట. వైసీపీ ఉనికి కూటమి విచ్ఛిన్నంపైనే ఉందన్న విషయాన్ని ఆయన కుండబద్దలు కొట్టినట్లు చెప్పారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కూటమి ఐక్యత ఇలాగే ఉంటే.. మరో పది హేనేళ్లు వైసీపీకి అధికారం అందని ద్రాక్షగానే ఉంటుందని హెచ్చరించారు.
మామూలుగా అయితే ఉండవల్లి ప్రస్తుతం జగన్ చేసిన మావిగన్ ప్రతిపాదన, ఆ ప్రతిపాదనపై నెటిజనుల ట్రోలింగ్ గురించి మాట్లాడాలి. మావిగన్ ప్రతిపాదనపై తన అభిప్రాయమేంటో చెప్పాలి. అలాగే అమరావతి ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా చట్టబద్ధత కల్పించే బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలూ ఆమోదముద్ర వేయడంపై తానేమనుకుంటున్నారన్నది చెప్పాలి. అయితే వాటి ఊసెత్తకుండానే.. వైసీపీ మళ్లీ రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే ఏం చేయాలో చెప్పారు. కూటమి విచ్ఛిన్నం కావడం కోసం పని చేయాలని జగన్ కు, వైసీపీకి సూచించినట్లుగా ఆయన మాటలు ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/undavalli-arun-kumar-on-power-to-ycp-25-216757.html
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్‌షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.