కేబినెట్ విస్తరణపై డైల‌మా!.. ఆశావహుల్లో ఉత్కంఠ!..

Publish Date:Mar 21, 2022

Advertisement

మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ఈ అంశం చుట్టూనే రాజకీయ మీడియా వర్గాల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి.ముఖ్యంగా అధికార వైసీపీలో అయితే, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చుట్టూనే అందరి ఆలోచనలు పరుగులు తీస్తున్నాయి. సహజంగా మంత్రి వర్గ విస్తరణ అంటే, అందరిలోనూ కొత్తగా ఎవరిని అదృష్టం వరిస్తుంది, అనే ఆసక్తే కనిపిస్తుంది. అయితే, ఇప్పుడు చిత్రంగా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, కొత్తగా ఎవరికి అవకాశం కల్పిస్తారు అనేదాని కంటే, ప్రస్తుత మంత్రులో ఎంతమంది మిగులుతారు, ఎంతమంది మాజీలు అవుతారనే విషయంగానే ఎక్కువ ఆసక్తి ఎక్కువగా కనిపిస్తోంది. మరోవంక రోజులు దగ్గరయ్యేకొద్దీ, లెక్కలు మారుతున్న సంకేతాలు స్పష్టమవుతున్నాయి. దీంతో ఆశావహుల్లో ఆందోళన పెరిగి పోతోందని అంటున్నారు. 

మూడేళ్ళుగా మంత్రులుగా ఉన్న వారిలో ఎంతమంది మంత్రులుగా కొనసాగుతారు, ఎంతమందికి ముఖ్యమంత్రి ఉద్వాసన పలుకుతారు అనే విషయం పైనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. ముందుగా ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా అయితే, ప్రస్తుత మంత్రులు అందరూ ఇంటికి పోవలసిందే. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తొలి మంత్రివర్గం తొలి సమావేశంలోనే,  రెండున్నరేళ్ల తర్వాత, ఫస్ట్ బ్యాచ్ మంత్రులు అందరూ, తప్పుకుని కొత్త వారికి  అవాకాశం ఇవ్వాలని క్లియర్ కట్’గా చెప్పారు. 

అయితే ఇప్పుడు కొందరు మంత్రులకు ముఖ్యమంత్రి మినహాయింపు ఇచ్చారని, ఆ విధంగా ఓ పది మంది వరకు మంత్రులు సెకండ్ బ్యాచ్’ లోనూ కొనసాగే అవకాశం ఉందని అంటున్నారు, నిజానికి, మొదట్లో మత్రులుగా కొనసాగే వారిలో బొత్స సత్యనారయణ, పెద్ది రెడ్డి వంటి కొద్దిమంది సీనియర్ల పేర్లు మాత్రమే వినిపించాయి. అయితే, రోజులు గడిచే కొద్దీ, కొనసాగే మంత్రుల సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. మొత్తం 25 మంది మంత్రులలో, ఐదారుగు మాత్రమే వడపోతలు మిగులుతారని. మిగిలిన అందరికీ, ఉద్వాసన తప్పదని అనుకుని అనేక మంది ఆశలు పెంచుకున్నారు.దీంతో, ఆశావహుల్లో నిరాశ తొంగిచూస్తోందని అంటున్నారు. 

మరోవంక ఆశావహులు, ఎక్కేగడప,దిగేగడప అన్నట్లుగా కీలక నేతల చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నారు. అయితే, ముఖ్యమంత్రి మనసులో ఏముందో ఎవరికీ తెలియదని, ఇతవరకు ఆయన ఒకరిద్దరు మినహా మరెవరితోనూ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ గురించి, మాట్లాడలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆ ఒకరిద్దరితో కూడా క్లుప్తంగా మాట్లాడారే కానీ, తమ మనసులో ఏముందో బయట పెట్టలేదని అంటున్నారు. 

అదలా ఉంటే, వేకెన్సీలు ఎన్ని ఉంటాయో ఏమో తెలియక పోయినా, శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఏ జిల్లా తీసుకున్నా, ఇద్దరు అంతకంటే ఎక్కువమందే ఆశలు పెట్టుకున్నారు.అలాగే, మంత్రి పదవులు ఆశిస్తున్న వారిలో స్పీకర్ తమ్మినేని సీతారామ్‌, మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, కొలుసు పార్థసారధి, మాజీ చీఫ్ విప్ సామినేని ఉదయభాను, ఇంకా చాలా మందే  ఉన్నారు. అయితే చివరకు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఏమి చేస్తారో , ఎవరిని అందలం ఎక్కిస్తారో, ఎవరికి నెక్స్ట్ టైమ్’ బెటర్ లక్’ అని పక్కన పెడతారో ఎవరికీ అంతుచిక్కడం లేదని అంటున్నారు. అన్నిటినీ మించి ఆశావహులు ఆశిస్తున్నట్లుగా, మంత్రి వర్గ విస్తరణ ఉగాదికి ఉంటుందా, లేక జూలై వరకు .. వాయిదా వేస్తారా .. అనేది ఇంకా తేలవలసే వుంది.

By
en-us Political News

  
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.