బాలయ్య అన్ స్టాపబుల్ సీజన్ 4 చంద్రబాబుతో తొలి ఎపిసోడ్?

Publish Date:Oct 19, 2024

Advertisement

నందమూరి బాలకృష్ణ టాక్ షో అన్ స్టాపబుల్ 4వ సీజన్ రెడీ అయ్యింది. తొలి మూడు సీజన్లూ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అటు సినిమాలలోనూ బాలయ్య అన్ స్టాపబుల్ హిట్స్ తో దూసుకు పోతున్నారు. మరో వైపు హిందూపురం ఎమ్మెల్యేగా ప్రజా సమస్యల పరిష్కారం విషయంలోనూ అందరి మన్ననలూ అందుకుంటున్నారు. ఇక తన అన్ స్టాపబుల్ టాక్ షో ద్వారా ప్రేక్షకులను బుల్లితెరకు కట్టిపారేస్తున్నారు. విజయవంతంగా మూడు సీజన్లు పూర్తి చేసుకున్న అన్ స్టాపబుల్ ఇప్పుడు నాలుగో సీజన్ కు రెడీ అయ్యింది. గత మూడు సీజన్లకు మించి ఈ నాలుగో సీజన్ ఉంటుందని అంటున్నారు. అన్ స్టాపబుల్  సీజన్ 2లో  తెలుగుదేశం అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. అప్పటికి ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు అన్ స్టాపబుల్ నాలుగో సీజన్ లో కూడా పాల్గొంటున్నారు.  

అన్ స్టాపబుల్ 2 షోలో చంద్రబాబు తెలుగుదేశం పార్టీలో ఆగస్టు సంక్షోభం నాటి పరిస్థితులపై మాట్లాడారు. నాటి సంక్షోభానికి దారి తీసిన పరిస్థితులు, అందుకు కారకులు వంటి విషయాలపై వివరంగా చెప్పారు. చంద్రబాబు తన వ్యక్తిగత, రాజకీయ విశేషాలను ఈ కార్యక్రమంలో ఎలాంటి శషబిషలకూ తావులేకుండా వివరించారు. మరీ ముఖ్యంగా 1995 ఆగస్టులో తెలుగుదేశం పార్టీలో ఏర్పడిన సంక్షోభానికి సంబంధించి విమర్శలను భరించారు.  1995 పరిణామాల అనంతరం ఎన్టీఆర్ కుటుంబం మొత్తం, తెలుగుదేశం పార్టీ క్యాడర్ మొత్తం చంద్రబాబు వెనుక నిలబడటం ద్వారానే నాడు అది రాష్ట్ర భవిష్యత్ కు, ప్రగతికి, పురోగతికి, అభివృద్ధికి అనివార్యం అని నిరూపితమైంది. అలాగే 1999 ఎన్నికలలో ప్రజలు కూడా చంద్రబాబు నాయకత్వానికి జై కొట్టడం ద్వారా చంద్రబాబు విధానాలకు ఆమోదముద్ర వేశారు. అయినా కూడా వెన్నుపోటు విమర్శను ఆయన ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇప్పటి వరకూ ఎన్టీఆర్ కుటుంబం నుంచి ఆ విమర్శలను ఖండిస్తూ, లేదా నాటి పరిస్థితులను వివరిస్తూ ఎవరూ బహిరంగంగా ప్రకటనలు చేయలేదు. అందరూ సమష్టిగా చంద్రబాబు వెంట నిలవడం ద్వారా తామేమనుకుంటున్నామో చెప్పకనే చెప్పారు.

అయితే వారి మౌనాన్ని ప్రత్యర్థులు అవకాశంగా తీసుకుని ఇన్నేళ్లుగా సందర్భం వచ్చినా, రాకున్నా, సమయం అయినా కాకున్నా.. అవే విమర్శలు గుప్పిస్తూ వికృతానందం పొందుతూ వచ్చారు. అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే  సీజన్ 2 తొలి ఎపిసోడ్ లో వారి విమర్శలకు ఇక ఫుల్ స్టాప్ పెట్టక తప్పని రీతిలో చంద్రబాబు బాలయ్య చేతే సమాధానం చెప్పించారు. ఇప్పుడు మళ్లీ బాలయ్య టాక్ షో అన్ స్టాపబుల్ సీజన్ 4 తొలి ఎపిసోడ్ కు కూడా చంద్రబాబు హోస్ట్ గా రానున్నారు. ఆ ఎపిసోడ్ కు సంబంధించిన చిత్రీక‌ర‌ణ  అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో వేసిన సెట్ లో ఆదివారం జరగనుంది. ఇదే కాకుండా ఈ సీజన్ లో అల్లు అర్జున్, చిరంజీవి, వెంకటేష్ వంటి స్టార్స్ కూడా రానున్నారు.   ముఖ్యంగా నాలుగో సీజన్ లో  అల్లు అర్జున్ పాల్గొనడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటీవలి ఎన్నికలలో కూటమి అభ్యర్థికి వ్యతి రేకంగా వైసీపీ అభ్యర్థికి మద్దతుగా అల్లు అర్జున్ నిర్వహించిన రోడ్ షో అనంతరం అల్లు ఏం మాట్లాడతారా అన్నదానిపై అన్ని వర్గాలలోనూ ఆసక్తి నెలకొని ఉంది.  

By
en-us Political News

  
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.