అవినాష్.. సీబీఐ.. ఓ అంతులేని కథ

Publish Date:May 21, 2023

Advertisement

తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు అచ్చెంనాయుడు.. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు, మాజీ మంత్రి నారాయణ, తెలుగుదేశం నాయకుడు అయ్యన్న పాత్రుడు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఏసీబీ, ఏపీ సీఐడీ అరెస్టు చేసిన వారి జాబితా కొండవీటి చాంతాడంత ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ.. సీనియర్ జర్నలిస్టు అంకబాబు వంటి వారిని అర్ధరాత్రి అరెస్టు  చేసిన సంఘటనలూ పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. వీళ్లెవరూ ఉగ్రవాదులు కాదు... రాత్రికి రాత్రి బిచాణా ఎత్తేసి పరారైపోతారన్న అనుమానాలూ లేవు. అయినా కూడా ఏపీ సీఐడి, పోలీసులు వీళ్లను అరెస్టు చేశారు. అర్థరాత్రి ఇళ్లల్లోకి చొరబడి, ఒక్కో చోట తలుపులు బద్దలుకొట్టి, కాంపౌండ్ వాల్ దూకి మరీ అరెస్టు చేశారు. 

టీడీపీ అధికారం లో ఉన్నపుడు జరిగినట్లుగా చెప్పబడుతున్న ఇఎస్ఐ స్కామ్ పై జగన్ ప్రభుత్వం ఎసిబి విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. గతం లో కొన్ని మెడికల్ ఎక్విప్మెంట్ కొనుగోళ్ల వ్యవహారం లో అవకతవకలు జరిగినట్లుగా ప్రభుత్వం భావించింది. ఈ స్కామ్ జరిగిన సమయం లో అచ్చం నాయుడు కార్మిక శాఖ మంత్రిగా ఉన్నఉన్నారంటూ 2020 జనవరిలో  అర్ధరాత్రి శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ లో ఉన్న  మంత్రి అచ్చం నాయుడు ను ఎసిబి అదుపులోకి తీసుకుని రోడ్డు మార్గంలో విజయవాడ కు తరలించింది. శస్త్ర చికిత్స చేయించుకుని కదలలేని స్థితిలో ఉన్న ఆయనను రోడ్డు మార్గంలో విజయవాడకు తరలించారు. ఇందు కోసం  దాదాపుగా 100 మంది పొలిసు బలగం తో అర్ధరాత్రి ఆయన ఇంటిపై దాదాపు దాడి చేసినంత పని చేశారు.

అలాగే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు విషయంలో ఏపీ సీఐడీ వ్యవహరించిన తీరు కూడా వివాదా స్పదంగానే ఉంది. ఆయన జన్మదినం రోజున అర్దరాత్రి హైదరాబాద్ లో అరెస్టు చేసిన ఏపీ సీఐడీ రోడ్డు మార్గాన ఏపీకి తీసుకువచ్చింది. దారి పొడవునా చిత్రహింసలు పెట్టిందని ఆయన ఆరోపించిన సంగతి విదితమే. అలాగే ఏపీలో విపక్ష నేతలు, ప్రభుత్వాన్ని విమర్శించే వారి పట్ల ఏపీ సీఐడీ ఇలాగే వ్యవహరించింది. నోటీసులు, పద్ధతులు, నిబంధనలను పట్టించుకోకుండా ఇష్టారీతిగా అరెస్టులు చేసింది. అదే వివేకాహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ విషయానికి వచ్చే సరికి అన్ని అనుమతులూ ఉన్నా, అరెస్టే తరువాయి అని స్వయంగా కోర్టులకు చెప్పిన సీబీఐ ఆయన నీడను కూడా ముట్టుకోవడానికి జంకుతోంది.

కేంద్ర దర్యాస్తు సంస్థ అయిన సీబీఐ తీరు నవ్వుల పాలౌతోంది. జనంలో ఆ దర్యాప్తు సంస్థ చులకన అవుతోంది. అయినా పట్టించుకోవడం లేదు. విచారణకు రండి సార్ అని నోటీసుల మీద నోటీసులు ఇచ్చి బతిమలాడుకుంటోంది. అయినా కూడా అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరు కాను కాక కాను అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ పనులంటూ ఓసారి, తల్లి అనారోగ్యం అంటూ మరోసారి, ఇంకోసారి కడుపునొప్పి అంటూ స్వయంగా తానే ఆసుపత్రిలో చేరారు. ఇక తాజాగా తన తల్లి ఆనారోగ్యంతో ఉన్నందున ఆమె ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసే వరకూ విచారణకు హాజరు కావడానికి కుదరదని మరోసారి సీబీఐకి లేఖ రాశారు.  సోమవారం( మే10) విచారణకు రావాలంటూ సీబీఐ అవినాష్ కు నోటీసులు జారీ చేసినప్పటి నుంచి మొదలైన హై డ్రామా కొనసాగుతూనే ఉంది. ఆ రోజు విచారణకు బయలుదేరిన అవినాష్ తల్లి ఆనోరోగ్యం సమాచారం అందిందంటూ  డుమ్మా కొట్టారు.   హైదరాబాద్ కు కానీ.. ఇటు బెంగళూరుకు కానీ తీసుకెళ్లకుండా మధ్యలో కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి వైద్యుడు, అవినాష్ రెడ్డి స్నేహితుడు.

 సరే సీబీఐ సోమవారం(మే 22)  విచారణకు రండి అంటూ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఆ నోటీసులకు కూడా ఆయన కుదరదనే సమాధానం ఇచ్చారు.  ఆయన తీరును చూస్తే.. ఇప్పట్లో ఆయన విచారణకు హాజరు కాను అని చెప్పినట్లే ఉంది.  సీబీఐ విచారణకు డుమ్మా కొట్టడానికి చాలా పకడ్బందీగా అవినాష్ రెడ్డి ఆడుతున్న గేమ్ లో సీబీఐ చిత్తవుతోందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. అవినాష్ తీరు పట్ల సీబీఐ సీరియస్ గా ఉందనీ, సీబీఐ కేంద్ర కార్యాలయం ఆయనను అరెస్టు చేయమని ఆదేశాలు జారీ చేసిందనీ వార్తలు వస్తున్నా.. సీబీఐ మాత్రం గడువు మీద గడువు ఇచ్చుకుంటూ వెళుతోంది. సీబీఐ దర్యాప్తు చేస్తోందా.. లేక అవినాష్ చెప్పినట్లు చేస్తోందా అని పరిశీలకులు సైతం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సీబీఐ అవినాష్ విచారణ తెలుగు టీవీ సీరియల్ లా అంతులేకుండా సాగుతోందని అంటున్నారు. 

By
en-us Political News

  
జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఒకే రోజున విడుదలైతే.. ఆ రెండింటిలో మీరు ముందుగా ఏ సినిమా అంటే ఎవరి సినిమా చూస్తారన్న ప్రశ్నకు.. లోకేష్ చాకచక్యంగా ఇద్దరి సినిమాలనూ ఒకే రోజు చూస్తానని బదులిచ్చారు.
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రాన్ని పరిశీలిస్తే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమం
తన నాలుక కోసి సమాధి కడతానని బెదిరించడం హత్యను ప్రేరేపించే క్రిమినల్ చర్య కిందకే వస్తుందన్న ఆయన, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తిపై ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు. ఒకవేళ ప్రభుత్వం సుమోటోగా చర్యలు తీసుకోకపోయినా, తనపై ఉన్న అభిమానంతో ఎవరో ఒకరు తప్పకుండా ఫిర్యాదు చేస్తారని రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు.
తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
జగన్‌ నమ్మినబంటులా వ్యవహరించారన్న విమర్శులు ఎదుర్కొంటున్న శ్రీలక్ష్మి వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి కి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు అసెంబ్లీ స్థానం, లేదా ఏలూరు, నరసాపురం లోక‌సభ స్థానాలలో ఏదో ఒక చోట నుంచి ఆమె పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది.
తెలంగాణలో బెంగాల్ ఫార్ములా వర్కౌట్ అవుతుందా? అంటే పరిశీలకులు మాత్రం ఆ అవకాశం ఇసుమంతైనా లేదంటున్నారు. బెంగాల్‌తో తెలంగాణను పోల్చడం సాధ్యం కాదని కుండబద్దలు కొడుతున్నారు. పశ్చిమ బెంగాల్, తెలంగాణ రాష్ట్రాల మధ్య రాజకీయంగా భారీ వ్యత్యాసాలు ఉన్నాయి.
బాంకీపూర్ నియోజకర్గం దశాబ్దాలుగా బీజేపీ కి బలమైన కోటగా నిలబడుతోంది. 1995 నుండి ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థులే విజయం సాధిస్తూ వస్తున్నారు. గత ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ విజయం సాధించారు. ఆయన తాజాగా రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఈ నియోజకవర్గానికి రాజీనామా చేశారు.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు, బయటి నుంచి వచ్చే రాజకీయ మద్దతుపై ఆధారపడటం మానుకోవాలని ఈ సందర్భంగా నితిన్ నబీన్ విస్పష్టంగా చెప్పారు. బయటి నుంచి మద్దతు లభిస్తుంది, దానితో ఎన్నికల్లో గెలిచేయవచ్చు అనే భ్రమల నుంచి తెలంగాణ బీజేపీ నాయకులు వెంటనే బయటకు రావాలనీ, . నాయకత్వంలో అలసత్వాని ఇకపై ఇసుమంతైనా సహించేది లేదనీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
ఉప్పల్‌లో టీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ..
నేడు తెలంగాణకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ కుల, ప్రాంతీయ సమీకరణాల చుట్టూనే తిరుగుతుంటాయి.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో 2024 ఎన్నికల ఫలితాలు ఒక చారిత్రాత్మక మార్పును తీసుకువచ్చాయి.
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రం అత్యంత ఆసక్తికరమైన మరియు సంక్లిష్టమైన మలుపుల మధ్య సాగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.