ఆగిపోయిన చదువుకు మళ్లీ శ్రీకారం: ఉల్లాస్ పరీక్షపై మంత్రి సీతక్క అభినందనలు.!

Publish Date:Sep 27, 2026

Advertisement

రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన ఉల్లాస్ పరీక్షకు హాజరవుతున్న లక్షలాది మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు మంత్రి సీతక్క అభినందనలు తెలిపారు. విద్యకు వయసుతో సంబంధం లేదని.. విద్యే మనిషికి బలమైన ఆయుధమని ఆమె పేర్కొన్నారు. కుటుంబ బాధ్యతలు, ఆర్థిక ఇబ్బందులు, ఉపాధి సమస్యలు, చిన్న వయసులో వివాహం వంటి కారణాలతో ఎంతోమంది మహిళలు మధ్యలోనే చదువును నిలిపివేశారని మంత్రి తెలిపారు. 

అయితే, బడి మానేయడం అంటే చదువు ముగిసిపోయినట్లు కాదని.. ఆగిపోయిన చదువును ఎప్పుడైనా తిరిగి కొనసాగించవచ్చని అన్నారు.ఉల్లాస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి నేరుగా పదో తరగతి పరీక్ష రాసే అవకాశం లభిస్తుందని సీతక్క వెల్లడించారు. స్వయం సహాయక సంఘాల్లో చదువు మధ్యలో ఆపేసిన మహిళలను గుర్తించి, వారు తిరిగి విద్యను కొనసాగించేలా ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా సెర్ప్ ప్రత్యేకంగా ప్రోత్సహిస్తోందని తెలిపారు.మహిళలను కేవలం ఆర్థికంగా స్వావలంబులుగా చేయడమే కాకుండా.. విద్య, సామాజిక సాధికారతలోనూ ముందుకు తీసుకెళ్లడమే ఇందిరా మహిళా శక్తి లక్ష్యమని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.

 

 

 

[ ULLAS Exam, Minister Seethakka, Self Help Groups, SHG Women, Indira Mahila Shakti, SERP, Women Empowerment, Adult Education, Education for Women, Class 10 Exam, Telangana Government, Women Education, Social Empowerment, Self Reliance, Telangana News ]

By
en-us Political News

  
పదేళ్లుగా పక్కింటివారిలా పరిచయం.. మెల్లిగా చీటీలతో నమ్మకం సంపాదించారు.. ఆ నమ్మకంతోనే ఒక్కొక్కరి నుంచి భారీగా డబ్బులు తీసుకున్నారు.
పోయింది అధికారం మాత్రమే.. కేసీఆర్‌పై అభిమానం తగ్గలేదు.!
గడ్డిపోచలు కూడా గడ్డపారలుగా మారుతాయి..!
గణేష్‌ నిమజ్జనం సందర్భంగా పోలీసుల బందోబస్తు కొనసాగుతుండగా.. అల్మాస్‌గూడలో అర్ధరాత్రి కొందరు వ్యక్తులు హల్‌చల్‌ చేశారు.
వికారాబాద్ జిల్లా పరిగి మండలం బసిరెడ్డిపల్లి సమీపంలో పెద్దపులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది.
 శ్రీనాథ్  అవయవ దానంతో చావు అంచున ఉన్న ఆరుగురికి  పునర్జన్మ లభించింది. శ్రీనాథ్ కుటుంబ సభ్యులకు జీవన్‌దాన్ అధికారులు   కృతజ్ఞతలు తెలియజేశారు. తన అవయవదానంతో  సిద్దని ప్రేమ వెంకట సత్య సాయి శ్రీనాథ్ మరణించిన తరువాత కూడా చిరంజీవిగా వర్ధిల్లుతున్నాడు.
తాడ్వాయి గురుకుల పాఠశాల విద్యార్థినులు పక్షుల కూతను బట్టి జాతిని గుర్తించే సరికొత్త ఎకో సెన్స్ బర్డ్ సౌండ్ డిటెక్షన్ ప్రాజెక్టును ఆవిష్కరించారు.
తెలంగాణను ఇచ్చిన మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా గణేష్ నిమజ్జనాల సందర్భంగా  ఎస్సై సహా 13 మంది ప్రాణాలు కోల్పోగా.. 26 మంది గాయపడ్డారు.  రాష్ట్రవ్యాప్తంగా   1.24 లక్షల మండపాల్లో వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించినట్లు తెలంగాణ డీజీపీ  సీవీ ఆనంద్   తెలిపారు.
. ఈ ఏడాది ఎల్ నినో ప్రభావంతో  తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ.. సీజన్ చివరి రోజుల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా భారీ వర్షాలు కురిసి కొంత మేరకు ఉపశమనం కలిగించాయి గత నాలుగు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కురిసిన  వర్షాల కారణంగా వర్షపాతం లోటు ఒకింత తగ్గింది.
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీక చాకలి ఐలమ్మకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ఘన నివాళులర్పించారు.
మాదకద్రవ్యాల నియంత్రణలో తెలంగాణ పోలీసులు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్నారని డీజీపీ సి.వి. ఆనంద్ పేర్కొన్నారు.
నిమజ్జన ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లుఅధికారుల పర్యవేక్షణలో   పక్కా ప్రణాళికతో  జరిగాయి. ఉత్సవ కమిటీ సభ్యులు ఉదయాన్నే ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించి, సంప్రదాయబద్ధంగా సామూహిక ప్రార్థనలు చేపట్టారు. ఆ తర్వాత భారీ క్రేన్ల సహాయంతో   ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపైకి విగ్రహాన్ని చేర్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.