Publish Date:Jul 19, 2022
కుక్కలకు మనిషికి స్నేహబంధం అనాదిగా వుంది. పెంపుడు కుక్కకు యజమానిపట్ల ఉండే విధేయతకు గొప్ప సాక్ష్యం కేథరినా త్యోవా కుటుంబమే. రష్యా దళాలు ఉక్రెయిన్‌పై దాడులు జరిపిన పుడు త్యోవా కుటుంబం కూలిపోయిన ఇంటిని విడిచి దూరంగా వెళ్లవలసి వచ్చింది. నాలుగు నెలల తర్వాత యుద్ధవాతావరణం తగ్గేసరికి తిరిగి వచ్చింది. చిత్రంగా వారి పెంపుడు కుక్క వారి కోసం ఆ శిధిలాల వద్దే ఎదురుచూస్తూ కనపడింది.
ఉత్తర ఉక్రెయిన్ లోని కీలక విమానాశ్రయం వున్న హోస్తోమెల్‌పై రష్యా దాడి చేసింది. ఆ పట్టణంలో 35 సంవత్సరాల బంగారం వ్యాపారి త్యోవా ఆమె కుటుంబం భయపడి పట్టణం విడిచి వెళ్లాలనుకున్నారు. ఆమె తన భర్త అలెగ్జాండర్, ఇద్దరు పిల్లలతో వెళి పోయారు. కానీ వారు ఆ భయాందోళనల్లో వారి పెంపుడు కుక్క సైబేరియన్ హస్కీని వదిలేశారు. ఎంత నిర్దాక్షిణ్యంగా వదిలే శారు.. అనుకోవచ్చు. అయినా వారికి అది తప్పని పరిస్థితి. కానీ హస్కీ తప్పకుండా తమ కోసం ఎదురుచూస్తుంటుందని త్యోవా నమ్మింది. కానీ వారికి ఆ తర్వాత నుంచి తెలిసిన వార్తల అనుసరించి వారి ప్రాంతం అంతా రాళ్ల గుట్టలుగా మారిందని. దాంతో త్యోవాకు హస్కీ గురించిన బెంగ పట్టుకుంది. మధ్య ఉక్రెయిన్ ప్రాంతంలోని వినిత్సాలో తమ స్నేహితుల ఇంట్లో త్యోవా కుటుంబం తలదాచుకుంది.
తొమ్మిదేళ్ల హస్కీ మాత్రం అక్కడే ఆ శిధిలాలమధ్య తిరుగుతూ ఆ కుటుంబంతో అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ అటూ ఇటూ చూస్తూ, రాళ్లమధ్య దొరికినది తింటూ రోడ్డుమీదకి వస్తూ పోతూ బేలగా చూస్తూ నాలుగు నెలల గడిపింది. నాలుగు నెలల తర్వాత ఆ మధ్య త్యోవా కుటుంబం తన పట్టణానికి వచ్చింది. ఆమెకు ముందుగా సగం కూలిన ఇల్లు కాకుండా హస్కీ బతికే వుందో లేదో చూడాలని ఇంటివేపు కూతురుతో పాటు పరుగులు తీసింది. కొద్దిదూరంలో హస్కీ తన యజమానురాలు రావడం చూసి పరుగు పరుగున వెళ్లి కాళ్లను చుట్టేసింది. దాని ఆనందానికి అంతేలేదు. త్యోవాకు గుండె భారం తగ్గింది. అమాంతం దాన్ని ఎత్తుకుని ముద్దులతో ముంచెత్తింది. త్యోతా ఐదేళ్ల కూతురు తజిసియా అయితే హస్కీని ఎత్తుకుని పరుగులు తీసింది, ఆడింది, దాని తోక లాగి హస్కీ ఆటపట్టించింది. హస్కీ మాత్రం తజిసియా పాదాలు నాకి నన్నొదలద్దన్నది!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ukraine-family-met-their-dog-39-140044.html
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.