Publish Date:Jul 19, 2022
కేఏ పాల్ ఎప్పుడు ఎవరిని ఆకాశానికి ఎత్తేస్తారా, ఎవరిని ఎప్పుడు విమర్శలతో ముంచెత్తుతారో కనీసం ఆయనకైనా తెలుసా అన్న అనుమానం ఆయన మాటలు విన్న ఎవరికైనా కలగక మానదు. ఎవరేమనుకున్నా, ఎంతగా నవ్విపోతున్నా ఆయన తన బాణీని మార్చుకోరు. పూటకో అంశం, గంటకో సమస్యతో ఆయన మీడియా ముందుకు వచ్చి హాస్యాన్ని పండిస్తూనే ఉంటారు.
ఒకే సమయంలో ఒకే వ్యక్తిని పొగడ్తలతో ముంచేయగలరు, విమర్శలతో చెరిగేయగలరు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్.. విమర్శలతో ఫైర్ అయిన నాయకుల జాబితాలో ఇప్పుడు జనసేనాని పవన్ కల్యాణ్ కూడా చేరిపోయారు. పార్టీ పెట్టిన తరువాత ఇప్పటి వరకూ తొమ్మిది పార్టీలతో కలిసిన పవన్ కల్యాణ్ అసలురాజకీయాలకే పనికి రాడని కేఏపాల్ అభిప్రాయపడ్డారు.
పునర్విభజన చట్టంలోని హామీల అమలు డిమాండ్ తో బుధవారం (జులై20)న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధీక్ష నిర్వహించనున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడుకేఏ పాల్ఆ సందర్భంగా మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఒక వైపు పవన్ రాజకీయాలకు పనికి రాడని విమర్శిస్తూనే తన దీక్షకు జనసేన మద్దతు ఇవ్వాలని కోరారు. అలాగే నిన్న మొన్నటి వరకూ కేసీఆర్ పై విమర్శలతో చెలరేగిపోయిన పాల్ ఇప్పుడు తన దీక్షకు మద్దతు ఇవ్వాల్సిందిగా అదే కేసీఆర్ ను మీడియా ముఖంగా కోరారు. అలాగే ఏపీలో అధికార పార్టీ, విపక్ష పార్టీల మద్దతునూ కోరారు. మద్దతు కోరుతూనే కేసీఆర్ క్లౌడ్ బరస్ట్ వ్యాఖ్యలపై సెటైర్లు వేశారు. అయితే ఈ మీడియా సమావేశంలో ఆయన కేసీఆర్, పవన్ కల్యాణ్ పై విమర్శలు గుప్పించారు.
అదే సమయంలో కేంద్ర ప్రభుత్వాన్నీ, ఏపీలో జగన్ ప్రభుత్వాన్నీ కూడా విడిచి పెట్టలేదు. పవన్ కల్యాణ్ ను ఎవరూ నమ్మే పరిస్థితి లేదన్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇలాగే అప్పులు చేస్తూ మందుకువెళితే రాష్ట్రాలు శ్రీలంకలా మారిపోవడం ఖాయమన్నారు. అలాగే కేంద్రం అప్పులపై కూడా ఆయన ధ్వజమెత్తారు. దేశాన్ని శ్రీలంక, వెనిజులా బాటలో మోడీ నడిపిస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లో తాను గ్లోబల్ సమ్మిట్ పెడతానంటే దానిని గుజరాత్‌లో పెట్టాలంటూ బీజేపీ నేతలు ఒత్తిడి తీసుకొస్తున్నారన్నారు. ఆగస్టు 15వ తేదీలోగా పునర్విభజన చట్టంలోని హామీలు నెరవేర్చకుంటే ఆమరణ నిరాహారదీక్షకు దిగుతానని హెచ్చరించారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/pawan-kalyan-not-fit-for-politics-says-paul-39-140042.html
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.