బ్రిటన్ లో గ్రూమింగ్ గ్యాంగుల అరాచకాలపై ఆందోళన.!
Publish Date:Aug 20, 2026
Advertisement
బ్రిటన్ లో గ్రూమింగ్ గ్యాంగ్‌ల పేరుతో సాగుతున్న వ్యవస్థీకృత లైంగిక దోపిడీ తీవ్ర కలకలం రేపుతోంది. స్థానిక బాలికలను లక్ష్యంగా చేసుకుని కొందరు ముఠాలుగా ఏర్పడి అరాచకాలకు పాల్పడుతున్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం నిర్వహించిన విచారణతో పాటు పార్లమెంట్‌లో వెల్లడైన వివరాలు బ్రిటన్ సమాజాన్నే కాకుండా యావత్ ప్రపంచాన్నీ దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. ఇటీవల పార్లమెంట్ వేదికగా ఎంపీ లోవె ఈ ముఠాల అకృత్యాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాణాలతో బయటపడిన పలువురు బాధితుల వాంగ్మూలాలను అధ్యయనం చేసిన అనంతరం ఈ దారుణాలు బయటపడ్డాయన్నారు. ఈ గ్యాంగ్‌లలో పాకిస్థాన్ నుంచి వచ్చిన టాక్సీ డ్రైవర్లు, స్థానిక వ్యాపారులు సభ్యులుగా ఉన్నట్లు తేలింది. వీరు 12 నుంచి 18 ఏళ్ల వయస్సు గల శ్వేతజాతి బాలికలను మభ్యపెట్టి, వారిపై ఘోరాలకు ఒడిగడుతున్నట్లు విచారణలో తేలింది. 13 ఏళ్ల చిన్నారిపై దాడి చేయడం, 15 నుంచి 20 మంది బాలికలను కుక్కల బోనుల్లో బంధించి వ్యాన్లలో రవాణా చేయడం వంటి ఘాతకాలు జరిగినట్లు విచారణ తేల్చింది. ఒక బాధితురాలు తాను 13 ఏళ్ల వయస్సు నుంచి దాదాపు 600 నుండి 700 మంది చేతుల్లో నిరంతరం వేధింపులకు గురయ్యానని విచారణాధికారుల ముందు వెల్లడించింది. పండుగల సమయాల్లో ఈ తరహా దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని దర్యాప్తులో వెల్లడైంది. పోలీసు యంత్రాంగం, అధికార వర్గాల నిర్లక్ష్యం, వ్యవస్థీకృత వైఫల్యాల వల్లే ఈ అరాచకాలు ఇన్నాళ్లూ బయటకు రాలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బ్రిటన్ వ్యాప్తంగా దాదాపు 85 ప్రాంతాల్లో ఈ గ్రూమింగ్ గ్యాంగ్‌ల కార్యకలాపాలు సాగుతున్నట్లు తెలుస్తోంది. గతంలో అంటే.. 2001లో యార్క్‌షైర్‌లోని రోథర్‌హామ్ ప్రాంతంలో ఈ తరహా ఘటనలు మొదటిసారి వెలుగులోకి వచ్చాయి. అప్పట్లో పాకిస్థానీ సంతతికి చెందిన కొందరు 12 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో 2010లో శిక్షలు పడ్డాయి. అనంతరం 2014 నివేదికల ప్రకారం సుమారు 1,400 మంది చిన్నారులు ఈ ముఠాల బారిన పడి కిడ్నాప్, అక్రమ రవాణాకు గురైనట్లు తేలింది. 2023లో దేశవ్యాప్తంగా 1.15 లక్షల మంది పిల్లలపై వేధింపులు జరిగాయనీ, వారిలో వేల సంఖ్యలో చిన్నారులు ఉన్నారనీ విచారణ బయటపెట్టింది. ఈ అరాచకాలను అరికట్టేందుకు బ్రిటన్ ప్రభుత్వాలు వివిధ దశల్లో చర్యలు చేపట్టాయి. 2023లో అప్పటి ప్రధాని రిషి సునాక్ హయాంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏడాది వ్యవధిలోనే 550 మంది నిందితులను అరెస్టు చేసింది. ఆ తర్వాత కీర్ స్టార్మర్ ప్రధానిగా ఉన్న సమయంలో జాతీయ స్థాయిలో చట్టబద్ధ విచారణకు ఉత్తర్వులు జారీ చేయగా, హోం శాఖ స్వతంత్ర విచారణకు సైతం ఆదేశించింది. ఇటీవల ఈ గ్యాంగ్‌ల నాయకుడైన షబ్బీర్ అహ్మద్‌ను పాకిస్థాన్‌కు డిపోర్ట్ చేయాలని బ్రిటన్ భావించినప్పటికీ.. అతడు బ్రిటిష్ పౌరుడేనని చెబుతూ పాకిస్థాన్ తిరస్కరించింది. దాంతో బ్రిటన్ ప్రభుత్వం అతడి పౌరసత్వాన్ని రద్దు చేసే దిశగా అడుగులు వేసింది. రోజురోజుకూ తీవ్రమవుతున్న ఈ సంక్షోభంపై కఠిన చర్యలు తీసుకోవాలని, నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూడాలని చట్టసభ సభ్యులతో పాటు పౌర సమాజం నుంచి తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. UKGrooming Gangs, Britain Minor Abuse Case, UK Parliament Speech, Child Sexual Exploitation UK, Grooming Gang Investigation
http://www.teluguone.com/news/content/ukgrooming-gangs-36-229319.html





