నాన్నిచ్చిన ధైర్యాన్ని నా నుంచి లాక్కోలేరు.. ఉద్ధవ్

Publish Date:Jul 8, 2022

Advertisement

 ఎట్టి పరిస్థితుల్లోనూ శివసేన ఎన్నికల గుర్తును తిరుగుబాటు దారులు ఉపయోగించుకోనివ్వనని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే అన్నారు. తన తండ్రి బాల్ థాక్రే స్థాపించిన శివసేన పార్టీని వారు తీసుకోగలరేమో కానీ.. ఆయన ఇచ్చిన ధైర్యాన్ని తన నుంచి ఎవరూ లాక్కోలేరని ఆయన అన్నారు.

ఏక్ నాథ్ షిండే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఉద్ధవ్ థాక్రే తొలిసారిగా బహిరంగ సభలో పాల్గొన్న ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన దమ్ముంటే మధ్యంతర ఎన్నికలకు సిద్ధం కావాలని షిండే కు సవాల్ విసిరారు. ప్రజా మద్దతు చూరగొని అధికారం చేజిక్కించుకునే ధైర్యం లేక దొడ్డిదారిన అధికారం చేపట్టారని విమర్శించారు.  

దమ్ముంటే తక్షణమే మధ్యంతర ఎన్నికలు నిర్వహించండి.. మేం తప్పు చేస్తే ప్రజలు మమ్మల్ని ఇంటికి పంపిస్తారన్నారు. మహా వికాస్ అఘాడీ కూటమిని ఎవరూ విడదీయలేరన్నారు.  గత రెండున్నరేళ్లలో బిజెపి తనను, అతడిని టార్గెట్ చేసిందని, అందుకు తమ పార్టీలోని కొన్ని గ్రూపులు సహకారం అందించాయనీ ఉద్ధవ్ ఆరోపించారు. అతను వారితో టచ్ లో వుంటూ సొంత పార్టీ కి ద్రోహం చేసారని ఉద్ధవ్ థాక్రే   షిండే పేరు ప్రస్తావించకుండానే ఆరోపణలు గుప్పించారు.

 బెదిరింపులు వచ్చినా బెదరకుండా నిలిచి నాతో   ఉన్నఎమ్మెల్యేలను చూసి గర్విస్తున్నానని ఉద్ధవ్ థాక్రే ఉద్వేగంగా చెప్పారు.  సుప్రీంకోర్టు శివసేన భవిష్యత్తును మాత్రమే కాకుండా భారత ప్రజాస్వామ్య భవిష్యత్తును కూడా నిర్ణయిస్తుందని ఆయన అన్నారు.

By
en-us Political News

  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.