జూబ్లీ ఉప ఎన్నిక.. మాగంటి ఫ్యామిలీకి బీఆర్ఎస్ మొండి చేయి ?

Publish Date:Jul 10, 2025

Advertisement

 

సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మృతితో, ఉప ఎన్నిక అనివార్యమైన జూబ్లీహిల్స్, నియోజక వర్గంలో గెలుపు కోసం మూడు ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ, అంతకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి’ రాజకీయ భవిష్యత్’ను నిర్ణయించడంలో జూబ్లీహిల్స్ గెలుపు ఓటములు టర్నింగ్ పాయింట్ అవుతుందని, రాజకీయ పరిశీలకు భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, సర్వశక్తులు ఒడ్డి అయినా సరే, జుబ్లీ సీటు గెలిచి తీరాలనే దృఢ సంకల్పంతో పావులు కదుపుతోందని అంటున్నారు. అలాగే, సిట్టింగ్ సీటును నిలబెట్టుకోవడంతో పాటుగా, పడి లేచిన కెరటంలా రాష్ట్ర రాజకీయాల్లో  దూసుకు పోవాలని చూస్తున్న బీఆర్ఎస్’ పార్టీకి కూడా జూబ్లీ హిల్స్ నియోజక వర్గం ఉప ఎన్నిక గెలుపు అత్యంగా కీలకంగా బావిస్తున్నట్లు తెలుస్తోంది. 

అందుకే, ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా, సిట్టింగ్ సీట్’ ను నిబెట్టుకునెందుకు గులాబీ పార్టీ ప్రయత్నాలు సాగిస్తోంది. మరోవంక,తెలంగాణలో ఏపీ కూటమి ప్రయోగానికి సిద్దమవుతున్న బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి, జూబ్లీ హిల్స్’ నియోజక వర్గాన్ని, లాంచింగ్ ప్యాడ్’గా భావిస్తోందని, పరిశీలకులు అంటున్నారు. ఈ నేపధ్యంలో, మూడు ప్రధాన పార్టీలు, వ్యూహ రచనతో పాటుగా, అభ్యర్ధుల ఎంపిక కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా,గెలుపు ఓటములను నిర్ధారించడంలో కీలకంగా భావిస్తున్న ముస్లిం మైనారిటీ ఓటు టార్గెట్’గా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు వ్యూహ రచన చేస్తుంటే,బీజేపీ హిందూ ఓటు బ్యాంకు’ ను కన్సాలిడేట్’ చేసే దిశగా పావులు కదుపుతోందని  అంటున్నారు. మరోవంక కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసంగతంలో పోటీచేసి ఓడిపోయినా, మాజీ క్రికెటర్ అజారుద్దీన, బీఆర్ఎస్’నుంచి కాంగ్రెస్’లోకి జంప్ చేసిన జీహెచ్ఎంసీ’ మాజీ మేయర్. బొంతు రామ్మోహన్’ సహా మరి కొన్ని పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. 

అయితే, ఎంఐఎం  నిర్ణయం పై కాంగ్రెస్ అభ్యర్ధి ఎంపిక ఆధారపడి ఉంటుందని, పార్టీ వర్గాల సమాచారం.ఇక బీజేపీ అభ్యర్ధి విషయానికి సమబందించి,గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినా లంక దీపక్ రెడ్డి పేరుతొ పాటుగా, గతంలో కూకటపల్లి నుంచి టీడీపీ టికెట్ పై పోటీ చేసిన, నందమూరి సుహాసిని పేరు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే, కూటమి తరపున ఏ పార్టీ పోటీ చేయాలో తేలిన తర్వాతనే, అభ్యర్ధి ఎంపిక పై, కూటమి నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని, బీజేపీ నాయకులు అంటున్నారు.   అదలా ఉంటే, మాగంటి మరణం మొదలు, అదే కుటుంబం నుంచి పార్టీ అభ్యర్ధిని బరిలో దించాలని భావించిన, బీఆర్ఎస్’ మనసు మార్చుకుని,ముస్లిం అభ్యర్ధి వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్’ అధినేత కేసీఆర్’ ముందు నుంచి కూడా మాగంటి సతీమణి సునీతను బరిలో దించాలని భావించారు. నిజానికి, ఆమె పోటీకి అంత  సుముఖంగా లేక పోయినా,ఆమెను ఒప్పించారని పార్టీవర్గాల సమాచారం.

అయితే, అంతలోనే అనూహ్యంగా మాగంటి గోపీనాథ్ సోదరుడు మాగంటి వజ్రనాథ్’ పోటీకి సిద్ధం కావడంతో, కేసీఆర్ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. అందుకే, వ్యూహం మార్చి ముస్లిం అభ్యర్ధిని బరిలో దించాలని బీఆర్ఎస్ బాస్’ నిర్ణయించినట్లు చెపుతున్నారు. ఈ నేపధ్యంలో నిన్న (జూలై 9) బీఆర్‌ఎస్‌ హైదరాబాద్‌ మైనార్టీ విభాగం సమావేశంలో ముస్లిం మైనారిటీ అభ్యర్ధిని పోటీకి దించాలన్న నిర్ణయాన్ని ప్రకటించినట్లు చెపుతున్నారు. కాగా, సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీశ్‌రావు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సత్తా చాటుదామని బీఆర్‌ఎస్‌ శ్రేణులకు పిలుపునిచ్చారు.సమావేశంలో హరీష్ రావుతో పాటుగా మాజీ మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్’  పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ తమది సెక్యులర్‌ ప్రభుత్వమని చెప్పుకొనే కాంగ్రెస్‌, 20 నెలలు గడుస్తున్నా ఒక్క మైనార్టీ నేతను మంత్రిగా చేయలేదన్నారు.హైడ్రా, మూసీ పేర్లతో రేవంత్‌ సర్కార్‌ ముస్లింల ఇళ్లను కూల్చి వారికి గూడులేకుండా చేసిందన్నారు. మైనార్టీల కోసం ఎన్నికలప్పుడు హామీలు గుప్పించిన కాంగ్రెస్‌.. అధికారంలోకి వచ్చాక వాటి అమలును పట్టించుకోవడంలేదని విమర్శించారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్’కు బుద్ధిచెప్పాలని మైనార్టీలను కోరారు. ఈ పరిణామాలను బట్టి చూస్తే, బీఆర్ఎస్’ ప్రస్తుతానికి ముస్లిం మైనారిటీ వైపు మొగ్గుచుపుతున్నట్లు తెలుస్తోందిని పరిశీలకులు అంటున్నారు. అయితే,ఇదే తుది నిర్ణయం కాకపోవచ్చని,పార్టీ ముఖ్య నాయకుడు ఒకరు ‘తెలుగు వన్’ కు చెప్పారు. మరో వంక, రాజకీయ పార్టీ చక చక వ్యూహాలను మార్చుకుంటున్న నేపధ్యంలో   జూబ్లీ నియోజక వర్గం ఉప ఎన్నిక మరిత్న ఆసక్తిని రేకిస్తోందని అంటున్నారు.


 

By
en-us Political News

  
ఉప్పల్‌లో టీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ..
నేడు తెలంగాణకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ కుల, ప్రాంతీయ సమీకరణాల చుట్టూనే తిరుగుతుంటాయి.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో 2024 ఎన్నికల ఫలితాలు ఒక చారిత్రాత్మక మార్పును తీసుకువచ్చాయి.
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రం అత్యంత ఆసక్తికరమైన మరియు సంక్లిష్టమైన మలుపుల మధ్య సాగుతోంది.
సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు...కూటమి ప్రభుత్వానికి రాజకీయ సవాల్..
మొత్తంగా ముచ్చటగా మూడో సారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన రెండేళ్ల తరువాత ప్రధాని మోడీ తన కేబినెట్ ప్రక్షాళనకు నడుంబిగించారని అంటున్నారు. మోడీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం కూడా ఖరారైందంటున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మోడీ సోమవారం (జూన్ 29) క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ చేయనున్నారు.
జగన్ కోసం ముద్రగడ తన సొంత సామాజిక వర్గం వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. అటువంటి ముద్రగడ పద్మనాభం తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే.. జగన్ కనీసం ఆయనను పరామర్శిండానికి కూడా రాకపోవడంపై రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది.
సాయికృష్ణ మిస్సింగ్ కేసును రాజకీయం చేయాలని వైసీపీ చూస్తోందనీ., కానీ ఈ కేసులో నిందితుడైన సీఐ నాగరాజు కూడా కాపు సామాజిక వర్గానికి చెందినవాడేనని గుర్తుచేశారు. తప్పు చేసిన వాడు ఏ కులానికి చెందినవాడైనా తప్పేనని, దానికి కులాన్ని అంటగట్టడం సరికాదని హితవు పలికారు.
ఆ అమ్మాయి నోట జగన్ సార్ అనే మాట రాగానే.. అది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డేనంటూ వైఎసీపీ సోషల్ మీడియా విభాగం పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారానికి తెరలేపింది. ఆ అమ్మాయి ప్రాణాలు కాపాడింది వైఎస్ జగనేనంటూ ఫోటోలు మార్ఫింగ్ చేసి నెట్టింట పోస్టులు పెట్టారు. ఈ క్రెడిట్ చోరీపై కిరాక్ ఆర్పీ సాక్ష్యాలను చూపిస్తూ గట్టి కౌంటర్ ఇచ్చారు.
బాధిత తల్లితో సిఐ నాగరాజు మాట్లాడిన ఆడియో సంభాషణలు, ఆయన ప్రదర్శించిన దురుసు ప్రవర్తన ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో బహిర్గతమై ప్రపంచమంతటా సంచలనం సృష్టించాయన్నారు.
ఈ శిలాఫలకంపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేరు ఎక్కడా కనిపించలేదు. ఈ వింత పరిస్థితిని గమనించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆశ్చర్యానికి గురయ్యారు. ఎంతో ఉత్సాహంగా కార్యక్రమానికి వచ్చిన ఆయన, ఆ శిలాఫలకంపై తన పేరు లేకపోవడంతో నిరాశకు లోనయ్యారు.
కాంగ్రెస్ నేతల పనితీరుపై ముఖ్యమంత్రి అసంతృప్తి..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.