కుర్రకారుకి బైక్ ల పిచ్చి పెరిగిపోతోంది. బైక్ రైడ్ అంటేనే అదో అద్భుతం! ఈ తరం యువత పల్స్ బాగా తెలిసిన బిఎండబ్ల్యూ కేవలం యువత కోసమే సరికొత్త హంగులతో తెస్తోంది 310 ఆర్ ఆర్ బైక్. జూన్ 15న మార్కెట్ లోకి రానున్న ఈ బైక్ ఖరీదు రూ.3 లక్షలు. దీని ప్రత్యేకతల విషయానికి వస్తే, ఈ బైక్ టివిఎస్ అపాచీ 310తో ప్లాట్‌ఫామ్ షేర్ చేసుకుంటుంది. బిఎం డబ్ల్యూ మోటరాడ్, టివిఎస్ మోటార్ ఇటీవలే భాగస్వాములయ్యాయి. ఈ భాగస్వామ్యం ఆధ్వర్యం లోనే టివిఎస్ భారతదేశంలో బిఎండబ్ల్యూ వాహనాల ఉత్పత్తికి సహకరిస్తుంది.
ఇక డిజైన్ విషయానికి వస్తే, బిఎండబ్ల్యూ 310 బైక్ అపాచీ 310 డిజైన్లా కనిపించవచ్చు. బ్లూటూత్ అను సంధానమయి వుండడం మరో ప్రత్యేక ఆకర్షణ. అలాగే డ్యూయల్ ఛానల్ ఏ బిఎస్ తో ఆకట్టుకుంటుంది. అన్నింటికీ మించి ఆర్ ఆర్ 310 బైక్‌లు తెలుపు, నీలం రంగుల్లో వుంటుంది. నీలం రంగు బిఎండబ్ల్యూ సంప్రదాయంగా వున్నదన్నది అందరికీ తెలిసినదే.
ఇంజన్ సంగతి చెప్పాలంటే, ప్రస్తుత బిఎండబ్ల్యూ 310 ఇంజన్ మోడల్ లానే ఈ కొత్త బైక్ ఇంజన్ వుంటుంది.
అలాగే 312.2 సిసి సింగిల్ సిలిండర్‌తో, లిక్విడ్‌కూల్ ఇంజన్ కలిగి వుంటుంది. ఈ బైక్‌కి 9700 ఆర్‌పియం వద్ద 34 పిఎస్, అత్యధికంగా 7700 పిఎం వద్ద 27.3 ఎన్ఎం శక్తి కలిగి వుంటుంది. అలాగే 6 స్పీడ్ ట్రాన్స్మిషన్ యూనిట్ కూడా కలిగి వుంటుంది. ఇక వేగంలో చెప్పక్కర్లేదు..గంటకు 160 కి.మీ వేగంలో వెళుతుంది. 0 నుంచి 1000 కి.మీ కేవలం 7.17 సెకండ్లలో దూసుకెళ్లగలదు. ఈ సరికొత్త హంగుల బైక్ ఖరీదు అపాచి 310 కిమించే వుంటుంది.
అపాచీ 310 ప్రస్తుతం రూ.2.65 లక్షలకు దొరుకుతోంది. ఇటీవల బిఎండబ్ల్యూ ఫోర్ వీలర్లు ఊహించని ప్రమాదాలకు గురి అవుతుండడంతో వాటిని వెనక్కి తీసు కుని, ఉత్పత్తి ఆపేసి ఎంతో అత్యాధునిక హంగులతో ఈ బిఎండబ్ల్యూ బైక్‌ను ఉత్పత్తి సంస్థ అందిస్తు న్నది. ఈ బైక్ తప్పకుండా దేశంలో యువతను ఆకట్టుకోగలదని అధికారులు అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/two-wheelers-from-bmw-39-137199.html
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
రాష్ట్రంలోని పలు ముఖ్యమైన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాలు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా కడప జిల్లాలోని బద్వేల్ మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది.
పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
తాను ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రత్యర్థులు ఎవరూ నిలబడలేరని ఆయన హచ్చరించారు. ఈ అస్తవ్యస్త పరిస్థితుల మధ్య ఎన్నికల్లో ఓటు వేయడం అంటే ఆ అక్రమాలను అంగీకరించడమే అవుతుందని భావించి, తాను ఓటు హక్కును వినియోగించుకోకుండానే పులివెందుల నుంచి వెనుదిరగారు.
Publish Date:Oct 31, 2026
రేపే మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. ప్రశాంతంగా సాగేనా.?