Publish Date:Apr 23, 2025
జమ్మూకాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లా పహల్గాం లో మంగళవారం (ఏప్రిల్ 22) జరిగిన దాడిలో ఇద్దరు తెలుగువారు మరణించారు. వారిలో ఒకరు నెల్లూరు జిల్లా కావలికి చెందిన సోమిశెట్టి మధుసూదన్ కాగా మరొకరు విశాఖ వాసి అయిన రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి చంద్రమౌళిగా గుర్తించారు. వీరిలో మధుసూదన్ బెంటళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నారు. ఆయన తల్లిదండ్రులు కావలిలో నివసిస్తున్నారు. మధుసూదన్ కుటుంబంతో సహా జమ్మూకాశ్మీర్ పర్యటనకు వెళ్లారు. పహల్గాంలో పర్యటిస్తున్న సమయంలో జరిగిన ఉగ్రదాడిలో మధుసూదన్ మరణించారు. ఆయన శరీరంలోకి 42 తూటాలు దూసుకుపోయినట్లు చెబుతున్నారు.
ఇక ఈ ఉగ్రదాడిలో మరణించిన రెండో తెలుగు వ్యక్తి విశాఖ వాసి చంద్రమౌళి రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి.. ఈయన కుటుంబంతో సహా పర్యటనకు వెళ్లారు. ఉగ్రమూకలు ఈయనను వెంటాడి వెంటాడి హతమార్చినట్లు చెబుతున్నారు. చంపవద్దంటూ బతిమాలినా క్రూరంగా కాల్చి చంపేశారని చెబుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/two-telugu-people-died-in-pahalgaon-terror-attack-25-196766.html
తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్య పరిరక్షణ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల లబ్దిదారుల ఎంపిక విధానంలో అత్యంత కీలకమైన మార్పులకు తెరలేపుతున్నట్లు తెలుస్తోంది.
Mahabubnagar ACB Raid, Telangana ACB, ACB Trap, Bribery Case, Rs 1 Lakh Bribe, Government Officials Arrested, Mahabubnagar Corruption, Youth and Sports Department, Jakkula Rajasekhar Reddy, Gorre Umesh, Telangana Anti Corruption Bureau, ACB Helpline 1064, Telangana Crime News
చలికాలం రాగానే మనలో చాలామంది ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు
అనంతపురం జిల్లాలో జరుగుతున్న పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు, వరద ఉద్ధృతి తీవ్ర రూపం దాల్చడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఇంట్లో మొదలైన చిన్నపాటి కుటుంబ కలహాలు.. చివరకు రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాయి.
అంబులెన్స్‌లో మృతదేహం.. న్యాయం కోసం రోడ్డెక్కిన బంధువులు.!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్ ఏ. చక్రపాణి తుదిశ్వాస విడిచారు.
గ్రేటర్ హైదరాబాద్ నగరంలో తీవ్ర రూపం దాల్చుతున్న తాగునీటి ఎద్దడి విద్యాసంస్థలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.