Publish Date:Jun 24, 2021
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నారాయణపురం గ్రామంలోనీ ఎస్సీ కాలనీలో గల తాగునీటి ట్యాంకు పంచాయతీ అధికారులు గత కొన్ని నెలలుగా శుభ్రం చేయలేదు. అసలే కరోనా టైం అలాగే వర్షాకాలం కూడా వచ్చింది. వర్షాకాలంలో కొత్త వైరుసులు వస్తాయని కనీస భాద్యత కూడా లేకుండా ప్రవర్తించారు అధికారులు. ఆ కలుషితమైన నీరు త్రాగి గ్రామంలో ఇద్దరు మృతి చెందారు అంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఆ కాలనీలో విషజ్వరాలు రావడంతో త్రాగునీరు వలనే ఇలా జరిగిందని అనుమానం వచ్చి ట్యాంక్ పైకి గ్రామస్తులు ఎక్కి చూడగా, అడుగు భాగం మొత్తం బురదమయంతో ఉండి అపరిశుభ్రంగా ఉండటంతో ఖంగుతిన్నారు. గ్రామస్తులు రోజు ఈ నీరు త్రాగడం వలనే తమకు విషజ్వరాలు వచ్చాయని అధికారులు నిలదీయడంతో అధికారులు మిషన్ భగీరథ నీరు వలన ఇలా జరిగిందని తెలిపారు. గ్రామస్తులు ఈ విషయంపై ప్రజాప్రతినిధులు, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మిషన్ భగీరథ నీరు వలన తమకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని కేవలం ట్యాంక్ శుభ్రం చేయకపోవడం వలనే తమకు విష జ్వరాలు వచ్చాయని గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేయడంతో వెంటనే అధికారులు తప్పు ఒప్పుకొని గ్రామస్తులకు సర్దిచెప్పి, వెంటనే నారాయణపురం గ్రామంలో ఉన్న అన్ని ట్యాంకులను శుభ్రం చేసి పరిశుభ్రమైన త్రాగునీరు అందించారు. ఇదే గ్రామానికి చెందిన నీరు త్రాగి వారం రోజుల వ్యవధిలో తుంగ కిట్టయ్య (30), వేల్పుల రాంబాబు (35) ఇద్దరు వ్యక్తులు కామెర్ల బారిన పడి మృతి చెందినట్లు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా అనేకమంది గ్రామస్తులు మెరుగైన వైద్యం కోసం భద్రాచలం, ఖమ్మం, సత్తుపల్లి పట్టణాల్లో ఉన్న ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వాల సోమరితనం వల్లే ప్రజలు ఇలా ప్రాణాలు కోల్పోతున్నారని స్థానికులు మాట్లాడు కుంటున్నారు. సో దీన్ని బట్టి మనకు ఏం అర్థం అవుతుందంటే అధికారులను నిలదీయాలి నిలదీసి మన హక్కులను అడగాలి ఆడితే గాని మన సమస్యలు తీరవు. సో అందరు ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసుకోండి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/two-people-died-with-pollution-drinking-water-25-118246.html
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వేళ నేతల ప్రచారం హోరెత్తుతోంది. రాష్ట్రం నలుమూలలా అభ్యర్థులు గెలుపుకోసం ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఏపీ మొత్తం ఒక ఎత్తయితే గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం ఒక్కటీ ఒక ఎత్తు. ఈ నియోజకవర్గ ప్రజల్లో రాజకీయ చైతన్యం ఎక్కువ, మేధావి వర్గమూ ఎక్కువే. అలాంటి పార్లమెంట్ నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ జెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో జగన్ పార్టీకి రైతులు ఓట్లు పడే అవకాశాలు ఎంతమాత్రం లేకుండా పోయాయి.. దీని వెనుక ఎన్నో
చిన్నారుల్ని ఎన్నికల ప్రచారానికి వినియోగించటం తప్పుగా పేర్కొన్న నిరంజన్ రెడ్డి ఫిర్యాదుకు ఎన్నికల సంఘం స్పందించింది. జరిగిన సంఘటనపై విచారణ జరిపించాలంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ను ఆదేశించింది. దీంతో హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి స్పందిస్తూ.. సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహ్రాకు ఆదేశాలు జారీ చేశారు. అమిత్ షాతో పాటు.. మరో నలుగురిపైనా మొఘల్ పురా పోలీసులు కేసు నమోదు చేసి.. ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.
పదవి ఊడబోతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నవరత్నాల పేరుతో ఏవేవో పథకాలు అనౌన్స్ చేసి 2019లో
తన అన్న, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మానసిక పరిస్థితి మీద తనకు అనుమానంగా వుందని ఆయన సోదరి,
ఈ ఏడాది దీపావళి పండగ కొద్ది నెలల ముందే రాబోతోంది. ఈ ఏడాది మే 13న నరక చతుర్దశి, జూన్ 4న దీపావళి రానున్నాయి
ఇది ప్రపంచ వింతల్లో ఎన్నో నంబర్ అవుతుందో తెలియదుగానీ, ఇది నిజంగానే ప్రపంచ వింతే! మజ్లిస్ పార్టీ అధినేత,
సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ఇప్పటికే పార్లమెంట్లో ఉన్నారు. ఇప్పుడు తాను కూడా పోటీ చేసి గెలిస్తే. గాంధీ కుటుంబలో ఉన్న ముగ్గురూ. చట్టసభలో కూర్చున్నట్టు అవుతుంది. ఇది బీజేపీకి మరో అస్త్రంగా మారుతుందని ప్రియాంక గాంధీ భయపడ్డారు.
అమెరికాలో నర్సుగా పనిచేసిన 41 ఏళ్ళ హీథర్ ప్రెస్డీ అనే మహిళకు కోర్టు 7 వందల సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
గంజాయి వ్యాపారం సామ్రాజ్యాన్ని సృష్టించిన వారిని గుంజీలు తీయిస్తానని పెమ్మసాని హెచ్చరించారు. గుంటూరులో ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి గుట్కా, గంజాయి అమ్ముతున్నాడని ఘాటుగా విమర్శించారు. గుంటూరు జిల్లాను గంజాయి మత్తులో ముంచుతారా అంటూ నిలదీస్తున్నారు. గంజాయి మొక్కలను పీకి పారేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు.
హైదరాబాద్ నుయూటీ చేసే కుట్ర జరుగుతున్నదని,దాన్ని తిప్పి కోట్టాలని బీఆర్ఎస్ అందుకున్న కొత్త పల్లవి కేవలం తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టి లోక్ సభ ఎన్నికలలో లబ్ధి పొందే ఎత్తుగడేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. హైదరాబాద్ నగరాన్ని యూటీ చేయాలని బీజేపీ కుట్ర చేస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఇటీవల ఆరోపించారు.
స్త్రీ, పురుషుల వైవాహిక స్థితి ఎలా వున్నప్పటికీ, పరస్పర అంగీకారంతో ఇద్దరు స్త్రీ పురుషులు శారీరక సంబంధం కలిగి వుంటే దాన్ని నేరం
రాజకీయ నాయకులంటే జనం చెవుల్లో పూలు పెట్టకపోతే కుదరదు. తెలంగాణ ప్రజల చెవుల్లో ఇప్పటి వరకు బీఆర్ఎస్ నాయకులు