Publish Date:Feb 17, 2025
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఎస్ సి ఎస్ టి కోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు. మరో వైపు వంశీ కూడా తనకు బెయిల్ ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు.
Publish Date:Feb 17, 2025
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ సత్తెనపల్లి కోర్టులో లొంగిపోయారు. నందిగం సురేశ్ కు వరుస కేసులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మరియమ్మ అనే మహిళ కేసులో ఆయన 145 రోజుల జైలు జీవితం గడిపారు. అనారోగ్య కారణాలతో ఆయనకు బెయిల్ లభించింది. అమరావతి ఉద్యమం సమయంలో అమరావతి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారన్న కేసులో ఆయన సత్తెనపల్లి కోర్టుకు వచ్చారు.
Publish Date:Feb 17, 2025
గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా ఈ కేసులో ఇద్దరు నిందితులు సరెండర్ అయ్యారు. టీడీపీ ఆఫీసుపైదాడికేసులో మొత్తం 88 మంది నిందితులు ఉన్నారు. వారిలో జానీ, కలామ్ అనే వ్యక్తులు సోమవారం గన్నవరం పోలీసులు ఎదుట లొంగిపోయారు
Publish Date:Feb 17, 2025
ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాలు సోమవారం (ఫిబ్రవరి 17) అగ్నిప్రమాదం సంభవించింది. కుంభమేళాలో అగ్నిప్రమాదం జరగడం ఇది ఏడో సారి.
Publish Date:Feb 17, 2025
ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాలో ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ప్రయాగ్ రాజ్ లోని పవిత్ర త్రివేణి సంగమంలో ఆయన తన సతీమణి నారా బ్రాహ్మణి, కుమారుడు నారా దేవాన్ష్ తో కలిసి పుణ్య స్నానం ఆచరించారు.
Publish Date:Feb 17, 2025
వంశీ కనుసన్నలలోనే టీడీపీ కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్థన్ కిడ్నాప్ జరిగిందనడానికి పోలీసులు పక్కా ఆధారాలు సేకరించారా? ఆయన కిడ్నాప్ నకు సంబంధించి సీసీ ఫుటేజీల ఆధారంగా వంశీ ప్రమేయాన్ని నిర్థారించుకున్నారా? అంటే ఔనన్న సమాధానమే వస్తోంది.
Publish Date:Feb 17, 2025
జెఎన్జె హౌసింగ్ సొసైటీకి జరగబోయే ఎన్నికల్లో కాగ్రెస్ పార్టీ టీమ్ జేఎన్‌జేకు సంపూర్ణ మద్దతునిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేష్‌కుమార్‌గౌడ్ చెప్పారు.
Publish Date:Feb 17, 2025
ఢిల్లీ ఎన్నికల్లో బిజెపి ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఎవరు ముఖ్యమంత్రి అనే ఉత్కంఠం నెలకొంది. ఢిల్లీ సిఎం రేసులో అనేక పేర్లు వినిపిస్తున్నప్పటికీ ముఖ్యమంత్రిని ఓడించిన పర్వేశ్ వర్మ ఈ పేరు ప్రముఖం వినిపిస్తుంది.
Publish Date:Feb 17, 2025
కేశినేని నాని రాజకీయ సన్యాసం పుచ్చుకున్న తరువాత ఇప్పుడు మళ్లీ ఆయన మనసు పాలిటిక్స్ వైపు మళ్లినట్లు కనిపిస్తున్నది. వరుసగా రెండు సార్లు విజయవాడ లోక్ సభ స్థానం నుంచి తెలుగుదేశం ఎంపీగా విజయం సాధించిన కేశినేని నాని, ఆ తరువాత అహం తలకెక్కి సొంత పార్టీపైనే తిరుగుబావుటా ఎగుర వేశారు. కేశినేని ట్రావెల్స్ ద్వారా గుర్తింపు సంపాదించుకున్న నాని రాజకీయ అరంగేట్రం తెలుగుదేశం పార్టీ ద్వారా జరిగింది.
Publish Date:Feb 17, 2025
ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ అరెస్టు అంటే నెల రోజుల కిందటి వరకూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ కేసులో కేటీఆర్ నిండా ఇరుక్కున్నారనీ, ఇహనో ఇప్పుడో ఆయన అరెస్టు ఖాయమని రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఈడీ, ఏసీబీ కూడా ఆయనను విచారించాయి. కోర్టు కూడా ఆయనకు అరెస్టు నుంచి పూర్తి రక్షణ కల్పించలేదు. ఈ కేసులో ఈడీ విచారణలో సీనియర్ ఐఏఎస్ అధికారులు ఇరువురు కేటీఆర్ కు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చారని కూడా వార్తలు వచ్చాయి.
Publish Date:Feb 17, 2025
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు పీఏను అరెస్టు చేశారు. హరీష్ రావు పిఏ వంశీకృష్ణను పోలీసులు శనివారం (ఫిబ్రవరి 15) అరెస్టు చేశారు. ఇప్పటికే ఈ కేసులో పోలీసులు మాజీ మంత్రి హరీష్ రావు, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, మరి కొందరిపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
Publish Date:Feb 17, 2025
రాష్ట్రంలో విద్యాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను విజ్ణాన విహార యాత్రలను పంపాలని నిర్ణయించింది. మనోవికాసం, స్కిల్ డెవలప్ మెంట్, సాంకేతిక అంశాలపై ఆసక్తి పెంపొందించడం కోసం ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో చదివే విద్యార్థులను విజ్ణాన, విహార యాత్రలకు పంపాలన్న నిర్ణయం తీసుకుంది.
Publish Date:Feb 16, 2025
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు రోడ్లు అద్దాల్లా మెరిసిపోతున్నాయ్. జగన్ హయాంలో అడుగుకో గుంత అన్నట్లుగా ఉండే రోడ్లు.. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువు దీరిన తరువాత బాగుపడ్డాయి. జగన్ తన ఐదేళ్ల పాలనలో బటన్ నొక్కుడుకు తప్ప మరే విషయాన్నీ పట్టించుకోలేదు.