Publish Date:Jan 29, 2025
గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసి తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ఇప్పటి వరకు సినీతారలు, రాజకీయ నాయకులు, స్వంత పార్టీ నేతల ఫోన్లు ట్యాప్ చేసిన బిఆర్ ఎస్ ఒక అడుగు ముందుకేసి ఇద్దరు న్యాయమూర్తుల ఫోన్ లను ట్యాపింగ్ చేసినట్లు తెలుస్తోంది. వీరిలో ఒక మహిళా న్యాయమూర్తి కూడా ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేయడమే చట్ట విరుద్దం. అటువంటిది రాజ్యాంగాన్ని , చట్టాలను పరిరక్షించే న్యాయమూర్తుల ఫోన్లను బిఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చిందో తేలాల్సి ఉంది.
సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో ట్విస్ట్ బయటకొస్తుంది. త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి ఫోన్ సైతం ట్యాపింగ్ అయినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించిన ఘటన మరువక ముందే తెలంగాణకు చెందిన ఇద్దరు న్యాయమూర్తుల ఫోన్లను గత బిఆర్ఎస్ ప్రభుత్వం ట్యాపింగ్ చేసింది.
ఎస్ బి ఐ మాజీ ఓ ఎస్డీ ప్రభాకర్ నేతృత్వంలోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీ ఇచ్చిన నివేదికలో ఇద్దరు న్యాయమూర్తులు ప్రొఫైళ్లు బయటపడ్డాయి. ఈ నివేదిక ప్రస్తుతం హైద్రాబాద్ పోలీసుల చేతికి చిక్కింది. వారి వ్యక్తిగత, కెరీర్ కు సంబంధించిన వివరాలు ఈ ప్రొఫైళ్లలో ఉన్నాయి. అంతే కాదు న్యాయమూర్తుల వాయిస్ రికార్డు అయ్యిందని దర్యాప్తు అధికారులు తేల్చారు. ఏకంగా న్యాయమూర్తులనే బ్లాక్ మెయిల్ చేసే ఉద్దేశ్యంతో వారి ఫోన్లను ట్యాపింగ్ చేసినట్టు సమాచారం. నిందితుల వాంగ్మూలాల్లో ఇద్దరు న్యాయమూర్తుల ప్రస్తావన వచ్చింది. పోలీసులకు చిక్కిన నివేదికలో వందలాది మంది ప్రొఫైళ్లు ఉన్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/two-judges-in-phone-tapping-trap-39-192018.html
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.