సాయికృష్ణ మిస్సింగ్ కేసు.. ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్ల లొంగుబాటు
Publish Date:Jun 30, 2026
Advertisement
రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. గత కొన్ని రోజులుగా అటు పోలీసు శాఖను, ఇటు ప్రజలను తీవ్ర ఉత్కంఠకు గురిచేసిన ఈ కేసులో ఊహించని పరిణామం ఎదురైంది. ఈ కేసుతో ప్రత్యక్ష సంబంధం ఉందనే ఆరోపణలు ఎదుర్కొంటూ గత కొన్ని రోజులుగా పరారీలో ఉన్న ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరి లొంగుబాటుతో సాయికృష్ణ అదృశ్యం వెనుక ఉన్న మిస్టరీ బయటపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. తమపై నిఘా పెరిగిందని, అరెస్ట్ తప్పదని గ్రహించిన సదరు ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు గత కొన్ని రోజులుగా విధులకు హాజరుకాకుండా పరారయ్యారు. వీరి కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి గాలింపు చర్యలు చేపట్టారు. చుట్టుముడుతున్న పోలీసు భయం, ఉన్నతాధికారుల ఒత్తిడి తట్టుకోలేక చివరకు వారు చట్టం ముందు లొంగిపోవడమే ఉత్తమమని భావించి లొంగిపోయినట్లు తెలుస్తోంది.
కొద్దిరోజుల క్రితం సాయికృష్ణ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలోఅదృశ్యమయ్యాడు. అతని కుటుంబ సభ్యులు అన్ని చోట్లా వెతికినా ఫలితం లేకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే.. ఈ మిస్సింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న కొద్దీ పోలీసుల పాత్రపైనే అనుమానాలు రేగాయి. . సాయికృష్ణను చివరిగా ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు తీసుకెళ్లినట్లు ఆధారాలు లభించడంతో ఈ కేసు ఒక్కసారిగా మలుపు తిరిగింది. ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏర్పాటు చేసింది. దర్యాప్తు ప్రారంభించిన సిట్.. ఈ కేసుకు సంబంధించి సీఐ నాగరాజును అరెస్టు చేసింది. అప్పటి నుంచీ పరారీలో ఉన్న ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు మంగళవారం (జూన్ 30) లొంగిపోయారు.
http://www.teluguone.com/news/content/two-head-constables-surrender-36-224642.html





