ఎయిర్ ఇండియా విమానంలో ఇద్దరు క్రూ సభ్యులు అస్వస్థత.. పైలట్ ఏం చేశాడంటే?
Publish Date:Jun 9, 2026
Advertisement
రోడ్డు మార్గంలో ప్రయాణి స్తున్నప్పుడు ఎవరైనా అస్వస్థతకు గురైతే వెంటనే సమీప ఆస్పత్రికి తరలిం చడం సాధ్యమవుతుంది. అయితే గాల్లో వేల అడు గుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానంలో ఇటువంటి పరిస్థితి తలెత్తితే? ముందుగా విమానంలోనే ప్రాథమిక చికిత్స అందించి, అవసరమైతే సమీప విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వస్తుంది. ఇలాంటి ఘటనే మంగళవారం (జూన్ 9) హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. కొచ్చిన్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు మహిళా క్రూ సభ్యులు ఒక్కసారిగా కడుపు నొప్పితో తీవ్ర అస్వస్థ తకు గురయ్యారు. పరిస్థితిని గమనించిన పైలట్ వెంటనే అప్రమత్తమై విమా నాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానం సురక్షితంగా దిగిన అనంతరం వైద్య సిబ్బంది ఇద్దరు క్రూ సభ్యులకు ప్రాథమిక చికిత్స అందించి... అనంతరం మెరుగైన వైద్యం కోసం వారిని అపోలో హాస్పిటల్ కు తరలించారు.ఇద్దరు సిబ్బందికి ఒకేసారి అస్వస్థతకు గురి కావడం వెనుక కారణాలేమిటన్న దానిపై అధికారులు విచారణ చేపట్టారు. కాగా విమానం లోని ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నట్లు అధికా రులు వెల్లడించారు.
http://www.teluguone.com/news/content/two-crew-members-fell-ill-on-an-air-india-flight-36-222333.html





