కాకాణి ఫైల్స్ చోరీ కేసు.. సీబీఐకి ఇస్తే ఇరుక్కుంటారా?

Publish Date:Apr 27, 2022

Advertisement

వ్యవసాయ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కేసు ఫైల్స్ చోరీ ఘటనపై దర్యాప్తు అధికారం సీబీఐకి ఇస్తే ఎవరు ఇరుక్కుంటారనే చర్చ ఏపీలో జరుగుతోంది. నెల్లూరు కోర్టులో ఫైల్స్ చోరీ, కాకాణిపై ఫోర్జరీ కేసుల దర్యాప్తును సీబీఐకి ఎందుకు అప్పగించకూడదో చెప్పాలని హైకోర్టు అనడంతో ఒక్కసారిగా పలువురి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయట. టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విదేశాల్లో కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు కూడబెట్టారని ఆరోపిస్తూ గతంలో కాకాణి గోవర్ధన్ రెడ్డి కోర్టులో కేసు వేశారు. అందుకు సాక్ష్యాలుగా కొన్ని పత్రాలను ఆయన కోర్టుకు సమర్పించారు. అయితే.. కాకాణి సమర్పించిన పత్రాలు ఫోర్జరీవని ఆయనపై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కేసు పెట్టారు. మొత్తం ఈ కేసులను సీబీఐకి అప్పగిస్తే అభ్యంతరం ఏమైనా ఉందా అని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించినప్పుడు రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ తమకు అభ్యంతరం లేదని చెప్పారు. దీంతో ఈ కేసులతో ప్రమేయం ఉన్న పలువురు అధికారులు, రాజకీయ నేతల్లో అలజడి రేగిందంటున్నారు.

ఈ కేసును దర్యాప్తు చేసి, అఫిడవిట్ దాఖలు చేయాలని ఏపీ డీజీపీని హైకోర్టు నిర్దేశించింది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీబీఐ డైరెక్టర్, నెల్లూరు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, ప్రస్తుత మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తదితరులకు హైకోర్టు నోటీసులు జారీచేసింది.

నెల్లూరు కోర్టులో ఉన్న ఫైల్స్ చోరీ అయ్యాయని ముందుగా ఒప్పంద బెంచ్ క్లర్క్ గా పనిచేస్తున్న నాగేశ్వరరావు ఫిర్యాదు చేయడం గుర్తుంచుకోవాల్సి అంశం. అయితే.. క్లర్కు చోరీ అయినట్లు చెప్పిన ఫైల్స్ అసలు కోర్టు ఆధీనంలోనే లేవని, అవి పోలీస్ స్టేషన్ లో ఉన్నాయని నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సి.యామిని హైకోర్టుకు నివేదిక సమర్పించడం సంచలనంగా మారింది. గుర్తు తెలియని వ్యక్తులతో బెంచి క్లర్కు నాగేశ్వరరావు కుమ్మక్కై కట్టుకథ అల్లాడని, పత్రాలు చోరీ అయ్యాయని కోర్టును తప్పదారి పట్టించాడని ఆ నివేదికలో జస్టిస్ యామిని పేర్కొనడం గమనించదగ్గ అంశం. ఈ మొత్తం వ్యవహారంపై స్వతంత్ర సంస్థతో సమగ్రంగా దర్యాప్తు చేయించాలని తన నివేదికలో జస్టిస్ యామిని హైకోర్టుకు విన్నవించారు. నెల్లూరు కోర్టు ప్రాంగణంలోని డ్రైనేజిలో ఏప్రిల్ 14న దొరికిన ప్రాపర్టీ నగర నాలుగో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు సంబంధించిన ప్రాపర్టీయే కాదని జస్టిస్ యామిని తన నివేదికలో చెప్పడం విశేషం.

నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి యామిని హైకోర్టుకు ఇచ్చిన నివేదిక ప్రకారం చూస్తే.. కోర్టులో ఉన్న పత్రాలు చోరీ అయ్యాయని కాంట్రాక్ట్ బెంచ్ క్లర్క్ నాగేశ్వరరావు ఎందుకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందనే అనుమానం తెరమీదకు వస్తోంది. అలా పత్రాలు పోయాయంటూ నాగేశ్వరరావు ఫిర్యాదు చేయడం వెనక ఎవరున్నారు? అనే ప్రశ్న కూడా దూసుకు వస్తోంది. అసలు కోర్టులోనే లేని పత్రాలు పోయాయని ఎందుకు ఫిర్యాదు చేశాడు.. ఫిర్యాదు చేయడం వెనుక కుట్ర ఏమైనా ఉందా? అనేది స్పష్టం కావాల్సి ఉంది. కోర్టులో ఉన్న కాకాణికి కేసుకు సంబంధించిన ఫోర్జరీ పత్రాలు చోరీ అయ్యాయంటే.. అవి నిజంగా ఫోర్జరీవే అయితే.. వాటిని తప్పించాల్సిన అవసరం కాకాణికి ఉంటుందంటున్నారు. కానీ ఆ పత్రాలు ఫోర్జరీవి కాకపోతే వాటిని దొంగిలించాల్సి అగత్యం ఇంకెవరికి ఉంటుందనేది ప్రశ్నగా మారింది. అలా కాదనుకుంటే కోర్టులోనే లేని పత్రాలు చోరీ అయ్యాయని చెప్పడం వెనుక కాకాణిని అభాసుపాలు చేసే కుట్ర ఉందా? అనే సందేహాలు కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు.

ప్రజా ప్రతినిధులపై నమోదైన కేసులను విచారించే ప్రత్యేక కోర్టులోనే చోరీ జరిగిందనేది వాస్తవం. అయితే.. ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులకు సంబంధించిన రికార్డులు అప్పటికే విజయవాడలోని ప్రత్యేక కోర్టుకు పంపించేశారట. కానీ వాటిలో మంత్రి కాకాణి కేసుకు సంబంధించిన పత్రాలు మాత్రం విజయవాడకు చేరలేదట. ఈ సమాచారం నెల్లూరు జిల్లా జడ్జికి కూడా అందించలేదు. తీరా చూస్తే ఆ ఫైల్స్ నెల్లూరు టూటౌన్ పోలీసుల ఆధీనంలో ఉన్నాయట. అంటే చోరీ జరిగినట్లు చెబుతున్న కాకాణి కేసు ఫైల్స్ 4వ అదనపు జూనియర్ సిలిల్ జడ్జి కోర్టులో లేవని జిల్లా ప్రధాన జడ్జి జస్టిస్ యామిని తేల్చారు.

అంటే అసలు చోరీ అయిన ప్రాపర్టీలో కాకాణి కేసు ఫైల్స్ లేకపోయినా.. ఎందుకు అవి చోరీ అయ్యాయని కాంట్రాక్ట్ బెంచ్ క్లర్క్ ఫిర్యాదు చేయాల్సి వచ్చిందనేది ఇప్పుడు తేలాల్సిన అంశం. చోరీ అయినవి మంత్రి కాకాణి కేసు ఫైల్సే అనే ప్రచారం ఎలా జరిగింది? ఆ ప్రచారం అసలు ఎక్కడ మొదలైంది? బెంచ్ క్లర్క్ చెప్పిన కాకాణి ఫైల్స్ చోరీ కథ కట్టుకథా? లేక ఇంకేదైనా మోటివేషన్ ఉందా? అనే దానిపై చర్చ జరుగుతోంది. బెంచ్ క్లర్క్ చెప్పింది కట్టుకథే అయితే.. ఎందుకు చెప్పాడనేది స్పష్టం కావాల్సి ఉంది.

నిజానికి కోర్టులో చోరీ జరిగిందని చెబుతున్న రోజున కోర్టులో 3 ప్లస్ 1 పోలీసు కాపలా ఎందుకు ఉండలేదు? ఆ రోజే భద్రతను అంత ఈజీగా పోలీసులు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది. చోరీ జరిగిన తీరుపై పోలీసు దర్యాప్తు సరైన దర్యాప్తు జరగలేదని వస్తున్న అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి తేల్చిన దానిపై ఎవరిని బాధ్యులగా లేలుస్తారనేది సీబీఐకి దర్యాప్తు అప్పగిస్తే తేలే అవకాశం ఉందంటున్నారు. చోరీ జరిగిన రోజున కోర్టు తలుపులు పగలగొట్టిన దుండగుల వేలి ముద్రలు గానీ, సంఘటనా స్థలంలో పాదముద్రలు గానీ పోలీసులు ఎందుకు సేకరించలేదనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. సంఘటన జరిగిన రోజున దర్యాప్తు చేయడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి కారణం ఏమై ఉంటుందనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. అందుకు ఏదైనా బలమైన కారణం ఉందా అంటున్నారు.

మొత్తం మీద నెల్లూరు కోర్టులో చోరీ కేసును, కాకాణి, సోమిరెడ్డి పెట్టుకున్న కేసులపై సీబీఐ విచారణ జరిగితే.. అవి ఎవరి మెడకు చుట్టుకుంటాయో? ఇంకెవరు ఇరుక్కుపోతారో అనే ఆసక్తి పెరిగిపోతోంది.

By
en-us Political News

  
ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమ ప్రాంతంలో సుమారు 15 వేల‌ నుంచి 20 వేల‌ మంది వ‌ర‌కూ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఒక‌ అంచనా. అయితే ఈ ప‌రిశ్ర‌మ ఇక్క‌డ స్థాపించ‌డంపై మాజీ మంత్రి పేర్ని నాని చేసిన కామెంట్లు ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.
కాంగ్రెస్ హైకమాండ్ కు, మరీ ముఖ్యంగా గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన వీహెచ్ రాజ్యసభకు మూడు పర్యాయాలు ఎంపికయ్యారు. అయితే 2016 తర్వాత ఇంత వరకూ ఆయనకు పార్టీ పరంగా ఎటువంటి పదవీ దక్కలేదు.
కేరళం ప్ర‌జ‌ల‌కు దశాబ్దాలుగా సేవ చేస్తూ, విలువలతో కూడిన‌ రాజకీయాలు చేసే సతీశన్‌కు ఈ పదవి రావడం సముచిత గుర్తింపని రేవంత్ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధికి మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌కు అధికార బాధ్యతలు అప్పగించారని అన్నారు.
ఎల్‌డీఎఫ్ హయాంలో వి.డి.సతీశన్ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. క్లిష్ట సమయలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం ఆయన తీవ్రంగా శ్రమించారు. అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్షం నుంచి అధికార పక్షంలోకి తీసుకు రావడంలో సతీశన్ కీలక పాత్ర పోషించారు. కేరళం కాంగ్రెస్ కేడర్‌లో కూడా ఇదే అభిప్రాయం బలంగా ఉంది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న అధిష్ఠానం సీఎంగా సతీశన్ ను ఎంపిక చేసింది.
సాధారణంగా ముఖ్యమంత్రులు, మంత్రుల పర్యటనల సమయంలో భద్రతా కారణాల రీత్యా పెద్ద సంఖ్యలో వాహనాలు కాన్వాయ్‌లో ఉంటాయి. అయితే.. దీనివల్ల భారీగా ఇంధన వ్యయం అవ్వడమే కాకుండా.. ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయని భావించిన సీఎం, డిప్యూటీ సీఎం.. ఖజానాపై అనవసర భారం పడకూడదనే ఉద్దేశంతో, భద్రతకు విఘాతం కలగకుండానే వాహనాల సంఖ్యను తగ్గించాలని నిర్ణయించారు.
తీవ్రమైన పోక్సో కేసు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ మధ్య రహస్య ఒప్పందం కుదిరిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఆ కారణంగానే బండి కుమారుడిపై పోక్సో కేసు నీరుగారిపోయిందని ధ్వజమెత్తారు.
హైదరాబాద్‌ను ఏ విధంగా ఐటీ, హెల్త్ హబ్‌గా మార్చానో గుర్తు చేస్తూ.. అమరావతిని అంతకంటే అద్భుతమైన నగరంగా నిర్మిస్తానని చంద్రబాబు చెప్పారు. హైదరాబాద్ గతమైతే, అమరావతి భవిష్యత్తు అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకుని దాదాపు మూడు వారాల పాటు విధులకు దూరంగా హైదరాబాద్ లో విశ్రాంతి తీసుకున్న ఆయన బుధవారం ఉదయం అమరావతిలోని తన క్యాంపు కార్యాలయానికి చేరుకుని విధుల్లో నిమగ్నమయ్యారు.
ఈ బలపరీక్షలో విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా 144 మంది శాసనసభ్యులు మద్దతు పలకగా.. 22 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. మరో ఐదుగురు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.
అయితే 2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి అమరావతి నిర్మాణ వేగం పెరిగింది. అయినా వైసీపీ అధినేత మావిగన్ ప్రతిపాదన, అమరావతి పురోగతిని అడుగడుగునా అడ్డుకోవడమే లక్ష్యంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, వ్యవహరిస్తున్న తీరు మాత్రం అమరావతి అనిశ్చితి మేఘాలు పూర్తిగా తొలగిపోకుండా ఉండేందుకు కారణమయ్యాయి.
బండి బగీరథ ఈ కేసు నుంచి పులుకడిగిన ముత్యంలా బయటపడితేనే.. తిరిగి బండి సంజయ్ కు పార్టీలో ప్రాధాన్యత, గుర్తింపు ఉంటాయని అన్యాపదేశంగానే అయినా విస్పష్ట సందేశం ఇచ్చింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వమైతే.. చట్టం ముందు అంతా సమానమేనని స్పష్టం చేసింది.
ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో విజయ్ తన కారు డ్రైవర్‌ రాజేంద్రన్ కుమారుడు శబరినాథన్‌కు విజయ్ టీవీకే తరఫున టికెట్ ఇచ్చారు. చెన్నైలోని విరుగంబాక్కం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన శబరినాథన్ విజయం సాధించారు. తాజాగా ఆయన్ను ప్రభుత్వ చీఫ్ విప్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించారు.
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో కీలక సమావేశం నిర్వహించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.