కరీంనగర్ పీఎంజే జ్యువలరీ షాప్ లో దోపిడీ చేసిన కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ దోపిడి దొంగలు ముందుగా జ్యువెలరీ షాప్ పై రెక్కి నిర్వహించడమే కాకుండా పోలీసుల చేతికి చిక్కకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు... దొంగతనం చేసిన అనంతరం ఈ దుండగులు బైక్‌ను గోదావరి తీరంలో వదిలివేసి వెళ్లారు... అయితే ఇప్పుడు ఆ ద్విచక్ర వాహనం నెంబర్ ప్లేట్ పై పోలీసులు ఆరా తీయడంతో కొన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి... దుండగులు వాడిన ద్విచక్ర వాహనానికి నెంబర్ ప్లేట్ హైదరాబాదుకు చెందినదిగా గుర్తించిన పోలీసులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు.
అనంతరం కరీంనగర్ పోలీసులు, హైదరాబాద్ పోలీసులను సంప్రదించారు... దీంతో హైదరాబాద్‌కు చెందిన మొబైల్ షాప్ వ్యాపారిని పోలీసులు విచారణకు పిలిపించారు. ఈ కేసులో హైదరాబాద్ పోలీసులు కూడా రంగంలోకి దిగి విచారణ చేపట్టారు.. పోలీసుల విచారణలో ఆ వ్యాపారి తన TVS మోటార్ కంపెనీ తయారు చేసిన అపాచీ బైక్‌ను అమ్మేం దుకు ఇటీవల OLX లో ప్రకటన ఇచ్చినట్లు తెలిసింది.
అదే ప్రకటనలో ఉన్న వాహనం నెంబర్‌ను దుండగులు గుర్తు పెట్టుకుని, తమ బైక్‌కు అదే నెంబర్ ప్లేట్ అమర్చి పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు అను మానిస్తున్నారు. దుండగులకు ఆ నెంబర్ ఎలా తెలిసింది? ప్రకటనను చూసి ముందుగానే ప్రణాళిక వేసుకున్నారా? అనే కోణాల్లో పోలీసులు విచారణను మరింత వేగవంతం చేశారు.ఈ కేసులో మరిన్ని కీలక వివరాలు త్వరలో వెలుగులోకి వచ్చే అవకాశముందని పోలీసులు తెలిపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/twist-in-karimnagar-jewelry-shop-robbery-case-36-219152.html
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన డీఎస్పీ భీమ్ రెడ్డి వ్యవహారంలో దర్యాప్తు వేగం పెంచిన ఏసీబీకి కీలక ఆధారాలు లభించాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది.
కోస్టుగార్డు, నేవీ నౌకలతో గాలింపు చర్యలకు సీఎం చంద్రబాబు ఆదేశాలు..!
నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి సమీపంలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది
భారీ వర్షాలకు దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరం చిగురుటాకులా వణికి పోతున్నది. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ధాటికి దేశ ఆర్థిక రాజధాని జలమయమైంది. ఆకాశానికి చిల్లు పడిందా అనే రీతిలో కుండపోత వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. నగరంలోని ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు సముద్రాన్ని తలపిస్తున్నాయి.
కాగా వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన వారిని విజయనగరం జిల్లా ముక్కాం గ్రామానికి చెందిన చిన్న, గరగయ్య, అప్పలరాజు, కె.చిన్నయ్య, సీతోడు, అలాగే.. భీమిలి మండలం పెదనగమయ్యపాలేనికి చెందిన బండయ్య, విశాఖపట్నానికి చెందిన చిన్న అమ్మోరుగా గుర్తించారు.
తొలుత టాస్ గెలిచిన టీమ్ ఇండియా బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు సాధించింది. ఇషాన్ కిషన్ 49 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, అభిషేక్ శర్మ 43 పరుగులతో మెరుపులు మెరిపించాడు. ఈ మ్యాచ్ తో అరంగేట్రం చేసిన యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ 10 బంతుల్లో 14 పరుగులు చేశాడు. తొలి మ్యాచ్ లోనే.. బెదురూ బెరుకూ లేకుండా జోఫ్రా అర్చర్ బౌలింగ్ లో సిక్సర్ బాది ఔరా అనిపించాడు.
హైదరాబాద్‌లో అక్రమంగా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, ప్రమాదకర బాడీ సప్లిమెంట్ల విక్రయాలపై కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ ఉక్కుపాదం మోపింది.
ఆరు దశాబ్దాలుగా భూమి కోసం ఎదురుచూస్తున్న కంగుంది గ్రామంలోని 322 కుటుంబాల నిరీక్షణకు ముఖ్యమంత్రి చంద్రబాబు తెర దించారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై అరెస్టైన ప్రముఖ సోషల్ మీడియా యాక్టివిస్ట్
సీఎం రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానంలో రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్‌లో నిర్వహించిన కృతజ్ఞత సభలో భావోద్వేగంగా మాట్లాడారు.
చరిత్ర సృష్టించిన వైభవ్.. 15 ఏళ్లకే టీమిండియాలో అరంగేట్రం..!