Publish Date:May 13, 2026
తమిళనాడు అసెంబ్లీలో టీవీకే ప్రభుత్వం బలపరీక్షలో గెలిచింది. బుధవారం బుధవారం అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం సునాయాసంగా గట్టెక్కింది. ఈ బలపరీక్షలో విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా 144 మంది శాసనసభ్యులు మద్దతు పలకగా.. 22 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. మరో ఐదుగురు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ఇటీవలి ఎన్నికల్లో విజయం సాధించి అధికార పీఠం దక్కించుకున్న విజయ్.. ఈ విశ్వాస పరీక్షలో గెలిచి నిలబె ట్టుకున్నారు.
అయితే, ఈ ఓటింగ్‌కు ముందు ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే తన 59 మంది ఎమ్మెల్యేలతో సభ నుంచి వాకౌట్ చేసింది. ఇక.. మూడో అతిపెద్ద పార్టీ అయిన అన్నాడీఎంకే ఓటింగ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించినప్పటికీ, ఆ పార్టీకి చెందిన పాతిక మంది ఎమ్మెల్యేలు విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారు. దీంతో దీంతో తమిళ రాజకీయాల్లో ఒకప్పుడు చక్రం తిప్పిన అన్నాడీఎంకే పార్టీ నిట్ట నిలువుగా చీలిపోయినట్లైంది. అన్నా డీఎంకేలో పళనిస్వామి వర్గానికి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు.
ఈ తిరుగుబాటుతో పళనిస్వామికి రాజకీయంగా గట్టి రాజకీయ ఎదురుదెబ్బ తగిలిందని చెప్పవచ్చు. ఇక పోతే విశ్వాస పరీక్ష తరువాత మీడియాతో మాట్లాడిన సీఎం విజయ్... విజిల్ చరిత్రను మార్చిందన్నారు. తమది మైనారిటీ ప్రభుత్వం అని చెబుతూనే.. మైనార్టీల హక్కులను కాపాడే ప్రభుత్వమన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/tvk-vijay-win-confidence-25-219631.html
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.!
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .!
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్‌నే టార్గెట్ చేశారు.
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) స్వీకరించారు