Publish Date:May 18, 2026
ఇటీవలి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో ఘన విజయం సాధించిన తమిళ స్టార్ హీరో , టీవీకే అధినేత విజయ్‌పై సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రశంసల జల్లు కురిపించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి అధికారంలోకి వచ్చిన విజయ్ విజయం చారిత్రాత్మకంగా అభివర్ణించారు.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అద్భుతమైన విజయంతో అధికారాన్ని దక్కించుకున్న సంగతి విదితమే. అయితే ఆ విజయం తరువాత తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ వ్యవహరించిన తీరు పలు విమర్శలకు దారి తీసింది. ఎన్నికలలో పరాజయం పాలైన డీఎంకే అధినేత స్టాలిన్ నివాసానికి వెళ్లి మరీ పలకరించి, పరామర్శించిన రజనీకాంత్, ఘన విజయం సాధించిన టీవీకే విజయ్ కు అభినందించలేదు. మరో పక్క.. కమల్ హసన్ స్వయంగా విజయ్ నివాసానికి వెళ్లి అభినందనలు తెలియజేశారు. కానీ రజనీకాంత్ మాత్రం విజయ్ కు మర్యాదపూర్వకంగా కలవకపోవడం, కనీసం అభినందనలు తెలియజేయకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. రజనీకాంత్ అసూయతో విజయ్‌ను అభినందించలేదన్న విమర్శలూ వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో తనపై వస్తున్న విమర్శలు మరియు అసూయ వార్తలపై రజనీకాంత్ స్పందించారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పాటు, తమిళనాడులోని రెండు ప్రధాన ద్రావిడ పార్టీలను ఒంటరిగా ఎదుర్కొని విజయ్ ఈ ఘన విజయాన్ని సాధించారంటూ మీడియా ఎదుట విజయ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. గతంలో ఎన్టీఆర్, ఎంజీఆర్ సాధించిన విజయాల కంటే విజయ్ సాధించిన విజయం ఎంతో గొప్పదన్నారు. విజయ్ విజయం సాధించడం, ముఖ్యమంత్రి కావడం తనకు ఎంతో సంతోషం కలిగించిందన్నారు. తనకు రాజకీయాలతో సంబంధం లేదనీ, రాజకీయాలకు దూరమై చాలా కాలమైందని చెప్పారు. ఇక విజయ్ పై తాను అసూయ చెందుతున్నానని వస్తున్న వ్యాఖ్యలను పూర్తిగా కొట్టిపారేసిన రజనీకాంత్, తమ ఇద్దరి మధ్యా పాతికేళ్లకు పైన వయస్సు తూడా ఉందని గుర్తు చేశారు. యువకుడైన విజయ్, రాజకీయాలకు అతీతంగా స్వయంకృషితో, సొంత బలంతో రెండు పెద్ద పార్టీలను ఎదిరించి ఈ గుర్తింపు తెచ్చుకున్నాడని ప్రశంసించారు.
ఇక స్టాలిన్‌ను కలవడంపై వస్తున్న విమర్శలకు కూడా రజనీకాంత్ సమాధానం చెప్పారు. స్టాలిన్ తో తన స్నేహం రాజకీయాలకు సంబంధించినది కాదన్నారు. కొలత్తూరులో స్టాలిన్ పరాజయం పాలు కావడం తనను ఎంతగానో బాధించిందని, అందుకే స్నేహపూర్వకంగా ఆయన్ను పరామర్శిం చానన్నారు. ముఖ్యమంత్రిగా విజయ్ విజయం సాధించిన వెంటనే తాను ఫోన్ ద్వారా అభినందనలు తెలియజేశానని, ఇందులో దాచడానికి ఏమీ లేదన్న రజనీకాంత్.. ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలో తమిళనాడు ప్రగతి పథంలో పయనిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/tvk-vijay-success-surpassesmgr-and-ntr-25-220102.html
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.