'తుంగభద్ర' రివ్యూ
Publish Date:Mar 20, 2015
Advertisement
తారాగణం: అదిత్, డింపుల్, సత్యరాజ్, కోట శ్రీనివాసరావు, చలపతిరావు, సప్తగిరి, రాజేశ్వరి నాయర్, ధన్‌రాజ్, నవీన్, రవివర్మ, చరణ్, శశాంక్ తదితరులు, నిర్మాత.. సాయి కొర్రపాటి, డైరెక్టర్.. శ్రీనివాస కృష్ణ
నిర్మాత సాయి కొర్రపాటి వారాహి చలనచిత్రం బేనర్లో నిర్మించిన కొత్త చిత్రం తుంగభద్ర. ఈగ, లెజెండ్, ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్య లాంటి పలు హిట్ చిత్రాలు ఈయన నిర్మాణంలో వారాహి బేనర్ నుండి వచ్చినవే. అయితే వరుస హిట్ చిత్రాలు అందించిన ఈ బ్యానర్ నుండి వచ్చిన చిత్రం కాబట్టే తుంగభద్రపై ప్రేక్షకులు అంచనాలు పెట్టుకున్నారు. ఆ అంచనాలే ప్రేక్షకులని థియేటర్ల వైపు నడిపించేలా చేశాయి. రాజకీయాలు, ఫ్యాక్షన్ గొడవల మధ్య ఓ చిన్న ప్రేమకథను జోడించి తుంగభద్ర చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఈ చిత్రం ప్రేక్షకులకు నచ్చిందా, సాయి కొర్రపాటిపై ప్రేక్షకులు పెట్టుకొన్ననమ్మకాన్నినిలబెట్టుకోగలిగాడా లేదా చూద్దాం.
ఇక కథలోకి వెళదాం.. రామరాజు (సత్యరాజ్), త్రిమూర్తులు(చలపతిరావు) తాడికొండ నియోజకవర్గంలో పొలిటికల్ లీడర్లు. ఈ ఇద్దరి వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. అయితే ఈ పొలిటికల్ ఫ్యాక్షన్ గొడవల వల్ల రామరాజు చేతిలో త్రిమూర్తులు ప్రాణాలు కోల్పోతాడు. త్రిమూర్తులు కొడుకులు తమ తండ్రిని చంపిన రామరాజును చంపి పగ తీర్చుకొవడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. ఒకసారి అదను చూసి దాడి చేస్తారు. కానీ ఈ దాడిలో రామరాజు అనుచరులు తమ ప్రాణాలు అడ్డువేసి రామరాజుని కాపాడుతారు. ఆ చనిపోయిన అనుచరుల్లో ఒకడి కొడుకే హీరో శ్రీను (అదిత్). తమ తండ్రిని చంపిన వారిపై పగ తీర్చుకోవడానికి రామరాజుకు అనుచరుడిగా వచ్చిన శ్రీను రామరాజు కూతురి ప్రేమలో పడతాడు. ఈ విషయం తెలిసిన రామరాజు ఎలా రియాక్ట్ అయ్యాడు? తరువాత పరిస్థితులను శ్రీను ఎలా ఎదుర్కొన్నాడు అనేది కథ.
ఫెర్ఫార్మెన్స్ విషయానికొస్తే.... ఈ సినిమాలో ముందుగా సత్యరాజ్ ఫెర్ఫార్మెన్స్ గురించి చెప్పుకోవాలి. నాయకుడు పాత్రలో ఆయన అద్భుతమైన నటన కనబరిచారు. సినిమా మొత్తానికి ఆయన ఫెర్ఫార్మెన్స్ హైలెట్. హీరో అదిత్ అంతా గొప్పగా చేయలేకపోయినప్పటికీ పర్వాలేదనిపించాడు. హీరోయిన్ డింపుల్ తన శక్తి మేరకు బానే చేసింది. అయితే ఇంతకు ముందు సినిమాల్లో కామెడీ పండించిన సప్తగిరి మాత్రం ఈసారి ఎక్కువ నవ్వించలేకపోయాడు. జబర్దస్త్ శ్రీను, నవీన్, ధనరాజ్ ఉన్నంతలో అక్కడక్కడా కామెడీ చేశారు. పైడితల్లి పాత్రలో కోట శ్రీనివాసరావు ఎప్పటిలాగే తన సహజనటనతో మెప్పించారు. టెక్నికల్ గా రాహుల్ శ్రీవాత్సవ్ సినిమాటోగ్రఫీ బావుంది. హరిహర అందించిన సంగీతం కంటే బ్యాగ్రౌండ్ స్కోర్ బావుంది. స్క్రీన్ ప్లే కూడా అంత చెప్పుకోదగిన విధంగా ఏమీ లేదు. సినిమాలో ఇటు ఫ్యాక్షన్ అంశాలను, అటు ప్రేమకథను ఆసక్తికరంగా చూపడంలో దర్శకుడు విఫలమయ్యాడు. హీరో, దర్శకుడి గురించి ప్రేక్షకుల్లో పెద్దగా అంచనాలు లేకపోయినా వారాహి చలన చిత్రం దృష్టిలో పెట్టుకొని థియేటర్ కి వెళ్లిన ప్రేక్షకుడు నిరాశకు గురయ్యాడు.
http://www.teluguone.com/news/content/tungabhadra-review-32-44307.html
హాయిగా నవ్వుకునే టిట్ బిట్స్ వున్న ఫన్ బక్కెట్ కామెడీ పదమూడో ఎపిసోడ్‌ని ఎంచక్కా చూసి ఎంజాయ్ చేయండి..
మొన్నీమధ్య విడుదలైన గోపీచంద్ ‘సౌఖ్యం’ సినిమా మీద మన సక్కుబాయి రివ్యూ ఏమిటో చూసేద్దామా?
డిసెంబర్ 27, 2015 నుంచి జనవరి 02, 2016 వరకు వివిధ రాశులవారి గ్రహబలం ఈ చిన్న వీడియో ద్వారా తెలుసుకోవచ్చు.
ఈ రెండు నిమిషాల నిడివి వున్న ఫన్ బక్కెట్ పన్నెండో కాపీ చూడండి.. మీకు నచ్చి తీరుతుంది. మాదీ గ్యారంటీ..
2015 సంవత్సరంలో టాలీవుడ్లో బిగ్గెస్ట్ హిట్స్‌గా నిలిచిన సినిమాలు ఏవో ఈ వీడియోలో చూస్తే క్లియర్‌గా తెలుస్తుంది.
క్రీడాకారుల జీవిత కథలతో రూపొందించిన బాలీవుడ్ సినిమాలు ఘన విజయాలు సాధిస్తున్నాయి. ‘భాగ్ మిల్కా భాగ్’, ‘మేరీకోం’ సినిమాలు దీనికి ఉదాహరణలు. ఆ సినిమాల స్ఫూర్తితోనే అజారుద్దీన్, మహేంద్రసింగ్ ధోనీ జీవిత కథల ఆధారంగా కూడా సినిమాలు రూపొందుతున్నాయి. ఈ నేపథ్యంలో అందాల క్రీడాకారిణి
2015 సంవత్సరంలో టాలీవుడ్లో టాప్ 10 ఫ్లాపులుగా మిగిలిన కళాఖండాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో చూడండి చాలు.. ఫుల్లుగా క్లారిటీ వచ్చేస్తుంది.
టాలీవుడ్లో ఒక్కో ఏడాది కొంతమంది హీరోయిన్లు ఐరన్ లెగ్స్ అని పిలిపించుకుంటూ వుంటారు. ఎవరి అకౌంట్లో ఎక్కువ ఫ్లాపులు పడితే వాళ్ళని ఐరన్ లెగ్స్ అనడం టాలీవుడ్లో మామూలే. మరి 2015లో ఐరన్ లెగ్స్ అని పిలిపించుకుంటున్న హీరోయిన్లు ఎవరో చూద్దామా...
సుధీర్‌బాబు హీరోగా నటించిన ‘భలే మంచి రోజు’ గురించి స్టార్ హీరో ప్రభాస్ ఏమంటున్నాడంటే...
ఈవారం అంటే... 20 డిసెంబర్, 2015 నుంచి 26 డిసెంబర్ 2015 వరకు వివిధ రాశులవారి గ్రహబలం ఎలా వుందో తెలుసుకోవాలంటే ఈ కింది వీడియోను క్లిక్ చేస్తే చాలు..
డిసెంబర్ 13వ తేదీ నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు వివిధ రాశుల వారి గ్రహబలం ఎలా వుందో తెలుసుకోవాలంటే ఈ క్రింది వీడియో చూస్తే చాలు.
త్రిష అందంగా వుంటుంది.. ఇంకా చెప్పాలంటే సూపరుగా వుంటుంది. అయితే ఇప్పుడు త్రిషని అందరూ త్రిషా.. నువ్వు సూపరు అంటున్నారు. ఈ ప్రశంస ఆమె అందానికి సంబంధించినది కాదు.. ఆమె వ్యక్తిత్వానికి సంబంధించింది. అందాల నటిగా అందరి ప్రశంసలు అందుకోవడం మాత్రమే కాదు.. సమాజం పట్ల బాధ్యతగా కూడా వ్యవహరించే త్రిషను చాలామంది ఈ కోణంలో కూడా అభిమానిస్తూ వుంటారు. ఆమధ్య స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా వీధులను ఊడ్చి స్ఫూర్తినిచ్చిన త్రిష అడపాదడపా సమాజ సేవా కార్యక్రమాల్లో
దర్శకుడు రాంగోపాల్ వర్మ అందరినీ మెప్పించగల సినిమాలు తీయడంలో విఫలమవుతున్నా, నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను ఆకట్టుకోగలుగుతున్నారు. ఏ విషయంపైనైనా తనకు తోచినట్లు నిర్భయంగా చెప్పగలగడమే అతనికి చాలా పాపులారిటీ తెచ్చిపెట్టిందని చెప్పవచ్చును. అయితే ఆ పాపులారిటీ పెరుతున్న కొద్దీ అతను తన హద్దులను కూడా దాటిపోతున్నట్లు కనిపిస్తోంది. సహజ సిద్దమయిన కొన్ని సమాజ సూత్రాలను, నియమనిబంధనలను తనకు వర్తించవు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.