Publish Date:Oct 25, 2024
తిరుమలలో శారదాపీఠం అక్రమ నిర్మాణాల కూల్చివేతకు రంగం సిద్ధమైంది. తిరుమలలో అక్రమ నిర్మాణాల తొలగింపునకు తొలుత నోటీసులు జారీ చేసి ఆ తరువాత కూల్చివేయాలన్న నిర్ణయానికి తిరుమల తిరుపతి దేవస్థానం వచ్చింది. ఇప్పటికే ప్రభుత్వం టీటీడీ భూముల్లో శారదాపీఠం అక్రమనిర్మాణాలను తొలగించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి విదితమే.
జగన్ అండతో గత కొన్నేళ్లుగా తిరుమలలో శారదా పీఠం యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలను చేపట్టింది. 20 వేల చదరపు అడుగులలో ఈ నిర్మాణాలు ఉణ్నాయి. తిరుమలలో రోడ్డును కూడా ఆక్రమించి శారదా పీఠం మఠం నిర్వాహకులు భారీ భవనాలను నిర్మిస్తున్నారు. అలాగే చెరువులను సైతం ఆక్రమించినట్లు ఆరోపణలు ఉన్నాయి. టీటీడీ సమాచారం మేరకు 20 వేల చదరపు అడుగుల్లో శారదా పీఠం అక్రమ నిర్మాణాలు చేపట్టింది. గత ఏడాది డిసెంబర్‌లో టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి ఉన్న పాలకమండలి 30 లక్షల రూపాయల జరిమానా విధిస్తూ ఈ అక్రమ నిర్మాణాలను క్రమబ ద్ధీకరించాలంటూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.
అయితే ఈ ఏడాది జరిగిన ఎన్నికలలో వైసీసీ సర్కార్ పతనమై తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు అందుకోవడంతో జగన్ హయాంలో శారదాపీఠం తిరుమల కొండపై చేపట్టిన అక్రమ నిర్మాణాలపై దృష్టి సారించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు టీటీడీ ఈవో సమగ్ర నివేదికను సమర్పించారు. ఆ నివేదికను పరిశీలించిన దేవాదాయ శాఖ గత పాలకమండలి ఇచ్చిన ధృవీకరణను రద్దు చేసింది. అలాగే శారదా పీఠం చేపట్టిన అక్రమ నిర్మాణాలను వెంటనే కూల్చివేయాలని ఆదేశించింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ttd-to-demolish-saradapeetham-illegal-constructions-25-187412.html
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.!
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .!
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్‌నే టార్గెట్ చేశారు.
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) స్వీకరించారు