Publish Date:Apr 23, 2025
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై నమోదైన పరువు నష్టం కేసును కొట్టివేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణలో ఉన్న ఈ కేసును పూర్తిగా కొట్టివేయాలని ఆయన ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. గత ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగంపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు తమ పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉన్నాయని ఆరోపిస్తూ ఆయన నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో పరువు నష్టం దావా వేశారు. బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందని రేవంత్ రెడ్డి ఆ సభలో అన్నారని వెంకటేశ్వర్లు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
Publish Date:Apr 23, 2025
నిన్న ఒంగోలులో హత్య గురైన టీడీపీ నేత మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి భౌతికకాయానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి.. వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఒంగోలులో టీడీపీ కార్యకర్త వీరయ్య చౌదరి మంగళవారం హత్యకు గురైన విషయం తెలిసిందే. దీంతో నాగులుప్పలపాడు మండలంలోని అమ్మనబ్రోలుకు చేరుకున్న ముఖ్యమంత్రి.. వీరయ్య చౌదరి అంత్యక్రియల్లో పాల్గొననున్నారు. సీఎం చంద్రబాబు వెంట మంత్రులు అనిత, ఆనం, డోలా, ఎంపీ మాగుంట, పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. ఇలాంటి ఘోరం జరగడం జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. బాధ్యులను పట్టుకొని, కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Publish Date:Apr 23, 2025
తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు షెడ్యూల్ రిలీజ్ చేసింది. మే 22 నుంచి 29వ తేదీ వరకు ఉదయం, మధ్యాహ్నం వేళల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ప్రథమ ఇంటర్, మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు ద్వితీయ ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఓ ప్రకటనలో వెల్లడించారు. ఇంటర్ ఒకేషనల్ కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులకు సైతం ఇదే టైం టేబుల్ వర్తిస్తుందని స్పష్టం చేశారు. అలాగే, జూన్ 3 నుంచి 6వ తేదీ వరకు రెండు సెషన్లలో ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయన్నారు.
Publish Date:Apr 23, 2025
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన లేడీ అఘోరీకి చేవెళ్ల కోర్టు బుధవారం (ఏప్రిల్ 23) 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అఘోరీ తరఫు లాయర్ చీటింగ్ కేసులో లేడీ అఘోరీకి పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందన్నారు. అఘోరీది చీటింగ్ కేసు కావడంతో.. కోర్టు ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో చెప్పలేమన్నారు.
Publish Date:Apr 23, 2025
అనీల్ కుమార్ యాదవ్.. పరిచయం అక్కర్లేని పేరు. జగన్ హయాంలో ఓళ్లూపై తెలియకుండా మాట్లాడి, తొడకొట్టి సవాళ్లు విసిరి పాపులర్ అయ్యారు. ప్రత్యర్థులపై నోరెట్టుకుని పడిపోవడమే రాజకీయం అన్నట్లుగా అప్పట్లో ఆయన వ్యవహార శైలి ఉండేది. ఆ తీరు కారణంగానే జగన్ కు దగ్గరయ్యారనీ చెబుతుంటారు. సరే అది పక్కన పెడితే వైసీపీ ఘోర పరాజయం తరువాత అనిల్ కుమార్ యాదవ్ ఎక్కడా కనిపించలేదు. వినిపించలేదు. మౌనంగా మాయమైపోయారు.
Publish Date:Apr 23, 2025
జగన్ మీడియా అసత్య కథనాలపై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అనుచరులు, టీడీపీ కార్యకర్తలతో కలిసి ఏలూరు జిల్లా మీడియా కార్యాలయంలో వద్ద నిరసన చేపట్టారు. టీడీపీ కార్యకర్తలతో కలిసి ఆఫీస్ ముందు టెంట్ వేసుకోని నిరసన వ్యక్తం చేశారు. బాధితుల రక్త తర్పణం’ అంటూ జగన్ మీడియా కథనాన్ని ప్రచురించింది. బాధితుడి పక్షాన వార్త ప్రచురించినందుకు వాస్తవాలు తెలుసుకోకుండా ఏ విధంగా రాస్తారంటూ రిపోర్టర్‌పై చింతమనేని ఫైర్‌య్యారు. దాసరి బాబురావు అనే బాధితుడు బ్లేడుతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో బాధితుడి అండగా చింతమనేని బాధితుల రక్త తర్పణం’ అంటూ జగన్ మీడియా కథనాన్ని ప్రచురించింది
Publish Date:Apr 23, 2025
బూరగడ్డ అనిల్ అనంతపురం జైలులోనే ఈ నెల 30 వరకూ ఉంచాలని మొబైల్ కోర్టు న్యాయమూర్తి పోలీసులను ఆదేశించారు. అలాగే ఈ నెల 30 వరకూ బోరుగడ్డ అనిల్ ను రాజమండ్రి తరలించకుండా అనంతపురం జిల్లా జైలులోనే రిటైన్ చేయాలని ఆదేశించారు. ఇంతకూ ఏం జరిగిందంటే.. బూరగడ్డ అనిల్ ను రాజమహేంద్రవరం జైలు నుంచి పీటీ వారంట్ పై అనంతపురం తీసుకు వచ్చారు.
Publish Date:Apr 23, 2025
జమ్మూ కశ్మీర్ పహల్‌గామ్ ఉగ్ర దాడికి వ్యతిరేకంగా ట్యాంక్‌బండ్ వద్ద కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నేతల నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఉగ్రవాదానికి, పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ధ మృతులను స్మరిస్తూ నివాళులు అర్పించారు. ఉగ్రవాదానికి, పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ధ అమరులను స్మరిస్తూ నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి మాట్లాడుతూ పెహల్గం ఉగ్రదాడిని సభ్య సమాజం తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఈ దాడి సిగ్గుమాలిన చర్యగా సమాజం చూస్తోందన్నారు
Publish Date:Apr 23, 2025
వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి గుంటూరు పోలీసులు కస్టడిలోకి తీసుకున్నారు. కోర్టు ఇచ్చిన కస్టడీ ఉత్తర్వులను సెంట్రల్ జైలు అధికారులకు అందించి.. కస్టడీకి తీసుకున్నారు. రెండు రోజుల కస్టడీ కోసం రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి ప్రత్యేక వాహనంలో గోరంట్ల మాధవ్‌ను తీసుకుని ఎస్కార్ట్ సిబ్బంది గుంటూరుకు బయలుదేరి వెళ్లారు. రిమాండ్ ఖైదీగా ఉన్న గోరంట్లను ఇవాళ, రేపు గుంటూరు పోలీసులు కస్టడీ తీసుకున్నారు.
Publish Date:Apr 23, 2025
ఏ దేశ మేగినా, ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవం, అన్నారు తెలుగు కవి రాయప్రోలు సుబ్బారావు. కానీ, దేశానికి ముగ్గురు ప్రధానులను ఇచ్చిన, నెహ్రూ గాంధీల కుటుంబం నాలుగో తరం నేత రాహుల్ గాంధీ, అందుకు పూర్తి విరుద్ధంగా ఏదేశం వెళ్ళినా, భారత దేశాన్ని అవమానించడం, అవహేళన చేయడం అలవాటుగా చేసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కుంటున్నారు.
Publish Date:Apr 23, 2025
జమ్మూ కశ్మీర్ పహల్‌గామ్ ఉగ్ర దాడి బాధితులను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా పరామర్శించారు. తమ ఆప్తులను కోల్పోయిన వారు ఆ ఘటలను అమిత్‌షాతో పంచుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. విహారయాత్రకు వస్తే తమ వారు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారంటూ వారు రోదించారు. ఈ ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. బాధితులను ఓదార్చలేక అమిత్‌షా సైతం మౌనంగా ఉండిపోయారు. అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గాంలో ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నివాళులర్పించారు. బుధవారం శ్రీనగర్‌లోని పోలీస్ కంట్రోల్ రూమ్ వద్దకు హెలికాప్టర్ లో చేరుకున్న అమిత్ షా మృతదేహాల వద్ద పుష్ప గుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. కాల్పుల ఘటన జరిగిన తీరును అమిత్ షా వారిని అడిగి తెలుసుకొన్నారు.
Publish Date:Apr 23, 2025
ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి కేటాయించబోయే రాజ్యసభ స్థానం నుంచి.. పార్లమెంటులో అడుగుపెట్టబోయే అదృష్టవంతుడెవరో దాదాపుగా తేలిపోయిందంటున్నారు. వైసీపీ మాజీ నేత విజయసాయి రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఎంపీ సీటుని.. బీజేపీకి వదిలేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారన్న ప్రచారం జరుగుతోంది.
Publish Date:Apr 23, 2025
మొన్నటిదాకా హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి ఏకగ్రీవం అయిపోతారనుకున్నారు. అక్కడ వాళ్లకున్న బలం అలాంటిది. కానీ.. ఎప్పుడైతే బీజేపీ తమ అభ్యర్థిని బరిలోకి దించిందో.. అప్పుడు ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికల్లో.. ఎక్స్‌అఫీషియో సభ్యులతో కలిపి మొత్తంగా 112 మంది ఓటర్లు ఉన్నారు.