టీటీడీ అనుమతితోనే తిరుమలపై డ్రోన్ సర్వే: అంగీకరించిన ఈవో ధర్మారెడ్డి

Publish Date:Jan 23, 2023

Advertisement

తిరుమత పవిత్రత, భద్రత విషయంలో టీటీడీకి ఇసుమంతైనా చిత్త శుద్ధి లేదన్న విషయం మరోసారి తేటతెల్లమైంది.  నోఫ్లై జోన్ అయిన తిరుమల కొండపై డ్రోన్ సర్వేకు సాక్షాత్తూ తిరుమల తిరుపతి దేవస్ధానమే అనుమతి ఇచ్చిందని తేలడంతో సర్వత్రా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయి. తిరుమలలో డ్రోన్ సర్వేకు అనుమతి ఇచ్చింది సాక్షాత్తూ తిరుమల తిరుపతి దేవస్థానమేనని స్వయంగా టీటీడీ ఈవో ధర్మారెడ్డి అంగీకరించారు.  

తిరమలపై డ్రోన్ సర్వేకు ఐఓసీకి అనుమతి ఇచ్చిన మాట వాస్తవమేనని టీటీడీ ఈవో ధర్మారెడ్డి చెబుతూ అయితే  తాము అన్నదానం నుంచి డంపింగ్ యార్డ్ వరకూ మాత్రమే డ్రోన్ సర్వేకు అనుమతి ఇచ్చామని,   టీటీడీలో భద్రతకు ఎక్కడా రాజీ పడటంలేదని.. టీటీడీకి హై సెక్యూరీటీ వ్యవ‌స్థ ఉందన్నారు. అయితే డ్రోన్ ఆపరేటర్ అత్యుత్సాహంతో అనుమతించిన పరిధి దాటి చిత్రీకరణ జరిపారని చెప్పారు.

ఇటువంటి సంఘటనలు పునరావృతం కాుకండా  తిరుమలకు యాంటీ డ్రోన్ టెక్నాలజీని త్వరలో తీసుకొస్తున్నామన్నారు. అయితే డ్రోన్ ద్వారా చిత్రీకరించారంటూ  సామాజిక మాధ్యమంలో వైరల్ అయనవి నిజమైనవేనా ఫేకా అన్నది తేలాలని ఈవో ధర్మారెడ్డి సమర్ధించుకోజూశారు. అలా కాకుండా అనుమతించిన మేర కాకుండా అత్యుత్సాహంతో పరిధి దాటి వీడియోలు తీసినట్లు తేలితే డ్రోన్ ఆపరేటర్ పై చర్యలు తీసుకుంటామన్నారు.

ఇప్పటికే  డ్రోన్‌తో శ్రీవారి ఆలయం చిత్రికరణపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు.  యూట్యూబ్‌లో ఉన్న వీడియోను తొలగించామన్నారు.    ‘నో ఫ్లై జోన్’గా ఉన్న తిరుమల కొండపై  డ్రోన్ వీడియో వైరల్ అయిన సంగతి విదితమే.   ఇక టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అయితే డ్రోన్తో తిరుమల ఆలయాన్ని చిత్రించే అవకాశమే లేదని  చెప్పారు పాత చిత్రంతో యానిమేట్‌  చేశారని విచారణకు ముందే నిర్ధారించేశారు.    

By
en-us Political News

  
YS Jagan Mohan Reddy, Pulivendula Elections, YS Jagan Protest, YSRCP, Bengaluru, Municipal Elections, Polling Irregularities, Andhra Pradesh Politics, YS Jagan News, Pulivendula Polling
దిల్లీలోని ప్రఖ్యాత కనాట్ ప్లేస్ ప్రాంతంలో దుకాణాలను అధికార భారతీయ జనతా పార్టీ (BJP) బలవంతంగా మూసివేయించిందని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
పులివెందుల మున్సిపల్‌ ఎన్నికల్లో పోలింగ్‌ అక్రమాలు చోటుచేసుకున్నాయని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు
ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ వేళ.. కడప జిల్లా పులివెందులలో రాజకీయ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.
సమాజంలో రోజురోజుకూ పెరిగిపోతున్న దారుణాలు, హేయమైన నేరాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
రేపే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌.. ప్రశాంతంగా సాగేనా.?
గర్ల్స్ హాస్టల్ ముసుగులో అండాల అక్రమ దందా గుట్టురట్టు
బెంగళూరు నగరంలోని ఒక ప్రతిష్టాత్మక లగ్జరీ హోటల్‌లో చోటుచేసుకున్న ఘోర ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
అర్నబ్ తుపాను నష్టాల నుంచి రాష్ట్రాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చే పునరుద్ధరణ పనులను వేగవంతం చేయడంతో
ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ఉత్కంఠ రేకెత్తిస్తున్న మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది.
జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన వ్యక్తిగత జీవితంలో ఓ సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చిన భారీ నిరసన ర్యాలీ అంశం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.